వంకాయ మరియు టొమాటో కూర / మిక్స్డ్ వంకాయ మరియు టమోటా కూర Vaṅkāya mariyu ṭomāṭō kūra/ miksḍ vaṅkāya mariyu ṭamōṭā kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:

1. వంకాయ - 250 గ్రా (పొడవైనవి) | Vaṅkāya - 250 grā (poḍavainavi)
2. టొమాటో - 250 గ్రా |  Ṭomāṭō - 250 grā
3. ఉల్లిపాయ - 1 | Ullipāya - 1
4. కరివేపాకు కొన్ని | Karivēpāku konni
5. పసుపు - 1 స్పూన్ | Pasupu - 1 spūn
6. ఆవాలు - 1 చెంచా | Āvālu - 1 cen̄cā
7. జీలకర్ర - 1 చెంచా | Jīlakarra - 1 cen̄cā
8. ఉప్పు - 1-2 స్పూన్లు | Uppu - 1-2 spūnlu
9. కారం పొడి - 2-3 స్పూన్లు | Kāraṁ poḍi - 2-3 spūnlu
10. నూనె - 3 స్పూన్లు | Nūne - 3 spūnlu
11. సెనగపప్పు - 1 స్పూన్ | Senagapappu - 1 spūn
12. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | Allaṁ vellulli pēsṭ - 1 spūn
13. కొత్తిమీర ఆకులు | Kottimīra ākulu

ముందుగా స్టవ్ వెలిగించి మీడియం మంట మీద పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి వేడిచేయాలి. అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శెనగపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తరిగిన వంకాయ, టొమాటో వేసి బాగా వేగించాలి. ఉప్పు వేసి వేయించాలి. సగం ఉడికిన తర్వాత అందులో 1 కప్పు నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి 3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసి బాణలిని పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. రుచికరమైన వంకాయ టొమాటో కూరతో వడ్డించుకోడానికి సిద్ధంగా ఉంది.
Mundugā sṭav veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda pān peṭṭāli. Andulō nūne vēsi vēḍicēyāli. Adi vēḍayyāka jīlakarra, āvālu, karivēpāku, śenagapappu vēsi vēyin̄cāli. Ippuḍu andulō ullipāya mukkalu vēsi bāgā vēyin̄cāli. Tarigina vaṅkāya, ṭomāṭō vēsi bāgā vēgin̄cāli. Uppu vēsi vēyin̄cāli. Sagaṁ uḍikina tarvāta andulō 1 kappu nīḷlu pōsi grēvī cikkabaḍē varaku uḍikin̄cāli. Ippuḍu allaṁ vellulli pēsṭ, kāraṁ vēsi 3 nimiṣālu uḍikin̄cāli. Ippuḍu kottimīra tarugu vēsi bāṇalini pakkana peṭṭi sṭav āph cēyāli. Rucikaramaina vaṅkāya ṭomāṭō kūratō vaḍḍin̄cukōḍāniki sid'dhaṅgā undi.

Comments