చలిమిడి వడపప్పు ఇలా తేలిక చేసుకోండి/ చలిమిడి వడ పప్పు తయారీ విధానం / పానకం తయారీ విధానం / శ్రీ రామనవమికి చేసుకునే పానకం తయారీ విధానం Calimiḍi vaḍapappu ilā tēlika cēsukōṇḍi/ calimiḍi vaḍa pappu tayārī vidhānaṁ/ pānakaṁ tayārī vidhānaṁ/ śrī rāmanavamiki ​​cēsukunē pānakaṁ tayārī vidhānaṁ

చలిమిడి వడపప్పు ఇలా తేలిక చేసుకోండి/ చలిమిడి వడ పప్పు తయారీ విధానం

కావాల్సిన పదార్ధాలు |Kāvālsina padārdhālu:
 • బెల్లం - 30 గ్రా | Bellaṁ - 30 grā
 • బియ్యం పిండి - 1 గ్లాస్ | biyyaṁ piṇḍi - 1 glās
 • యాలకుల పొడి - 1/2 స్పూన్ | yālakula poḍi - 1/2 spūn
 • అవసరమైనంత నీరు | avasaramainanta nīru
 • పెసరపప్పు పప్పు - 30 గ్రా | pesarapappu pappu - 30 grā
 • యెండు కొబ్బరి ముక్కలు - 20 గ్రా లేదా 2 స్పూన్లు (ఐచ్ఛికం) | Yeṇḍu kobbari mukkalu - 20 grā lēdā 2 spūnlu (aicchikaṁ)
 • గసగసాలు - 1 స్పూన్ (ఐచ్ఛికం) | gasagasālu - 1 spūn (aicchikaṁ)
 • నెయ్యి - 3 స్పూన్లు | neyyi - 3 spūnlu
 
ముందుగ బెల్లము చిన్న ముక్కలుగా చీతకొట్టుకోవాలి. లేడ కోరుకుని పొడిలాగ చేసుకోవచ్చు. అందులో యాలకుల పొడి, అందులో బియ్యము పిండి వేసి కొంచెం నీరు పోసి కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పొయ్యకూడదు. బెల్లము వేసాము కాబట్టి బాగా పలుచగా ఐపోతుంది. చాల తక్కువ నీరు పోసి, నెయ్యి వేసిగట్టిగా కలుపుకోవాలి. అలాగే పెసరపప్పు ఒక అరగంట నీళ్లలో నానబెట్టి పూజకి వెళ్ళేపుడు పప్పు కడిగి నీరి వడకట్టి తాయారు చేసుకున్న చలిమిడితో నివేదన చేయాలి. చాల సులభంగా చలిమిడి వడపప్పు రెడీ చేసుకోండి.
Munduga bellamu cinna mukkalugā cītakoṭṭukōvāli. Lēḍa kōrukuni poḍilāga cēsukōvaccu. Andulō yālakula poḍi, andulō biyyamu piṇḍi vēsi kon̄ceṁ nīru pōsi kalupukōvāli. Nīḷlu ekkuva poyyakūḍadu. Bellamu vēsāmu kābaṭṭi bāgā palucagā aipōtundi. Cāla takkuva nīru pōsi, neyyi vēsigaṭṭigā kalupukōvāli. Alāgē pesarapappu oka aragaṇṭa nīḷlalō nānabeṭṭi pūjaki veḷḷēpuḍu pappu kaḍigi nīri vaḍakaṭṭi tāyāru cēsukunna calimiḍitō nivēdana cēyāli. Cāla sulabhaṅgā calimiḍi vaḍapappu reḍī cēsukōṇḍi.
(Or)
ముందుగ నేతిలో యెండు కొబ్బరి ముక్కలు, జీడి పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగ బెల్లము చిన్న ముక్కలుగా చీతకొట్టుకోవాలి. లేడ కోరుకుని పొడిలాగ చేసుకోవచ్చు. అందులో యాలకుల పొడి, ఎండిన కొబ్బరి ముక్కలు, వేయించిన గసగసాలు, అందులో బియ్యము పిండి వేసి కొంచెం నీరు పోసి కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పొయ్యకూడదు. బెల్లము వేసాము కాబట్టి బాగా పలుచగా ఐపోతుంది. చాల తక్కువ నీరు పోసి గట్టిగ కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇది రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది.
Munduga nētilō yeṇḍu kobbari mukkalu, jīḍi pappu vēyin̄ci pakkana peṭṭukōvāli. Munduga bellamu cinna mukkalugā cītakoṭṭukōvāli. Lēḍa kōrukuni poḍilāga cēsukōvaccu. Andulō yālakula poḍi, iṣṭamu
 unna vāḷḷu eṇḍina kobbari mukkalu, vēyin̄cina gasagasālu, andulō biyyamu piṇḍi vēsi kon̄ceṁ nīru pōsi kalupukōvāli. Nīḷlu ekkuva poyyakūḍadu. Bellamu vēsāmu kābaṭṭi bāgā palucagā aipōtundi. Cāla takkuva nīru pōsi gaṭṭiga kalupukōvāli. Istāṁ unna vāḷḷu vēyin̄cina jīḍi pappu kūḍā vēsi kon̄ceṁ neyyi vēsi kalupukōvāli. Idi reṇḍu mūḍu rōjula varaku niluva uṇṭundi.

పానకం తయారీ విధానం / శ్రీ రామనవమికి చేసుకునే పానకం తయారీ విధానం
Pānakaṁ tayārī vidhānaṁ/ śrī rāmanavamiki ​​cēsukunē pānakaṁ tayārī vidhānaṁ


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • బెల్లము - 20గ్రా | Bellamu - 20grā
 • నీరు - 3 గ్లాస్ | nīru - 3 glās
 • మిరియాల పొడి - 1 స్పూన్ | miriyāla poḍi - 1 spūn
 • యాలకుల పొడి - 1/2 స్పూన్ | yālakula poḍi - 1/2 spūn
 
ముందుగ నీరు తీస్కుని అందులో బెల్లము వేసి కలుపుకోవాలి. బెల్లము కరిగాక యాలకుల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన పానకము తాయారు. చాల తేలికగా ఉంది కదా. అంతే కాదండి శ్రీ రామనవమికి మనం తప్పకుండ తయారు చేసి నివేదన చేసే పానకం ఇది. ఎందుకంటే రాములవారికి చాలా ఇష్టం అంట. ఈ పానకం అంతే కాదండి ఆరోగ్యకరమైన పానకం కూడా. తప్పకుండ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
Munduga nīru tīskuni andulō bellamu vēsi kalupukōvāli. Bellamu karigāka yālakula poḍi, miriyāla poḍi vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina pānakamu tāyāru. Cāla tēlikagā undi kadā. Antē kādaṇḍi śrī rāmanavamiki ​​manaṁ tappakuṇḍa tayāru cēsi nivēdana cēsē pānakaṁ idi. Endukaṇṭē rāmulavāriki cālā iṣṭaṁ aṇṭa ī pānakaṁ antē kādaṇḍi ārōgyakaramaina pānakaṁ kūḍā. Tappakuṇḍa ṭrai cēsi elā undō ceppaṇḍi.

Comments