దద్దోజనం తయారీ విధానము Daddōjanaṁ tayārī vidhānamu

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
  • ఆవాలు - 1 చెంచా | Āvālu - 1 cen̄cā
  • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
  • సెనగపప్పు - 1 స్పూన్ | senagapappu - 1 spūn
  • మిరియాలు - 1 స్పూన్ | miriyālu - 1 spūn
  • నూనె - 1 స్పూన్ | nūne - 1 spūn
  • కరివేపాకు కొన్ని | karivēpāku konni
  • పెరుగు - 250 గ్రా / 1 కప్పు | perugu - 250 grā/ 1 kappu 
  • పాలు - 1 కప్పు | Pālu - 1 kappu
  • బియ్యం - 250 గ్రా / 1 కప్పు | biyyaṁ - 250 grā/ 1 kappu
  • జీడి పప్పు - 10 గ్రా | Jīḍi pappu - 10 grā
ముందుగ వండిన అన్నం తీసుకుని చల్లారనివ్వాలి. అందులో పెరుగు వేసుకోవాలి.
Munduga vaṇḍina annaṁ tīsukuni callāranivvāli. Andulō perugu vēsukōvāli.
పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి వేడి చెయ్యాలి. పాన్ వేడి చేసాక అందులో నునే వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో అవలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, సెనగపప్పు వేసి వేయాలి. అవి వేగిన తర్వాత చివరిలో జీడి పప్పు వేసి వేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లరిన తరువత ఆ తాలింపు పెరుగు వేసిన అన్నము పైన వేసుకోవాలి.
Poyyi veligin̄ci oka pān peṭṭi vēḍi ceyyāli. Pān vēḍi cēsāka andulō nunē vēsi vēḍi ceyyāli. Nūne vēḍekkina taruvāta andulō avalu, jīlakarra, miriyālu, karivēpāku, senagapappu vēsi vēyāli. Avi vēgina tarvāta civarilō jīḍi pappu vēsi vēyāli. Taruvāta sṭav āph cēsi pān tīsi pakkana peṭṭi callāranivvāli. Callarina taruvata ā tālimpu perugu vēsina annamu paina vēsukōvāli.
పెరుగు, అన్నము, పప్పులు అన్నీ కలిసేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నము బాగా కలసిన తరువాత చల్లటి పాలు అందులో పోసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దద్దోజనము తయారుగా ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలం లో ఇది తింటే సెరీరానికి చాలా చల్లగా ఉంటుంది. చలువ చేస్తుంది. పిల్లకు కూడా పెట్టొచ్చు.
Perugu, annamu, pappulu annī kalisēlā kalupukōvāli. Ruciki saripaḍā uppu vēsukuni bāgā kalupukōvāli. Annamu bāgā kalasina taruvāta callaṭi pālu andulō pōsi bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina ārōgyakaramaina daddōjanamu tayārugā undi. Idi ārōgyāniki cālā man̄cidi. Vēsavi kālaṁ lō idi tiṇṭē serīrāniki cālā callagā uṇṭundi. Caluva cēstundi. Pillaku kūḍā peṭṭoccu.

చిట్కాలు | Ciṭkālu:
పిల్లకు గుజ్జుగా ఉంటె ఇస్తాం కాబట్టి చివరిలో పాలు పోసుకుంటాము. పాలు పొయ్యడం వల్ల చాల సమయం వరకు ఫ్రెష్‌గా ఉంటుంది.
Pillaku gujjugā uṇṭe istāṁ kābaṭṭi civarilō pālu pōsukuṇṭāmu. Pālu poyyaḍaṁ valla cāla samayaṁ varaku phreṣ‌gā uṇṭundi.

ఈ దద్దోజనంలో దానిమ్మగింజలు వేస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలు చాల ఇష్టపడతారు.
Ī daddōjananlō dānim'magin̄jalu vēstē iṅkā bāguṇṭundi. Pillalu cāla iṣṭapaḍatāru.

Comments