కట్టె పొంగలి / పొంగలి తయారీ విధానం / కట్టె పొంగలి సులువుగా ఇలా చేసి చూడండి Kaṭṭe poṅgali/ poṅgali tayārī vidhānaṁ/ kaṭṭe poṅgali suluvugā ilā cēsi cūḍaṇḍi


కావలసిన పదార్ధాలు | Kāvalasina padārdhālu::
  • బియ్యం - 2 కప్పులు | Biyyaṁ - 2 kappulu
  • పెసర పప్పు - 1 కప్పు | pesara pappu - 1 kappu
  • మిరియాలు గింజలు - 1 2 స్పూన్లు | miriyālu gin̄jalu - 1 2 spūnlu
  • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
  • కరివేపాకు కొన్ని | karivēpāku konni
  • నెయ్యి - 3 స్పూన్లు | neyyi - 3 spūnlu
  • జీడిపప్పు - 20 గ్రా | jīḍipappu - 20 grā
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • పచ్చి మిర్చి - 2 (ఐచ్ఛికం) | pacci mirci - 2 (aicchikaṁ)
 
ముందుగ బియ్యము, పెసరపప్పు తీస్కుని బాగా కడగలి. బియ్యము (2 కప్పులు), పెసరపప్పు (1 కప్పు) తీస్కుని అందులో 6 కప్పుల నీళ్లు పోసి వండుకోవాలి.
Munduga biyyamu, pesarapappu tīskuni bāgā kaḍagali. Biyyamu (2 kappulu), pesarapappu (1 kappu) tīskuni andulō 6 kappula nīḷlu pōsi vaṇḍukōvāli.
ముందుగ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో మిరియాలు, జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు, పచ్చి మిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి.
Munduga sṭav veligin̄ci oka pān peṭṭi andulō neyyi vēsi vēḍi cēsukōvāli. Neyyi vēḍekkina taruvāta andulō miriyālu, jīlakarra, jīḍi pappu, karivēpāku, pacci mirapakāya vēsi bāgā vēyin̄cukōvāli.
 
బియ్యము పెసరపప్పు కలిపి ఊడికించిన తరువాత అందులో తాలింపు పెట్టుకునే పప్పులు,మిరియాలు,కరివేపాకు నెయ్యితో సహా అన్నము లో వేసుకోవాలి. 
Biyyamu pesarapappu kalipi ūḍikin̄cina taruvāta andulō tālimpu peṭṭukunē pappulu,miriyālu,karivēpāku neyyitō sahā annamu lō vēsukōvāli.
  
రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
Ruciki saripaḍā uppu vēsi bāgā kalupukōvāli.
 
అంతేనండి ఎంతో రుచికరమైనా హెల్తీ అండ్ టేస్టీ కట్టె పొంగలి తయారీ ఉంటుంది.
Antēnaṇḍi entō rucikaramainā heltī aṇḍ ṭēsṭī kaṭṭe poṅgali tayārī uṇṭundi. 

Comments