కేసరి / రవ్వ కేసరి తయారీ విధానం / స్వీట్ కేసరి ఎంతో రుచిగా సులువుగా ఎలా చేసుకోండి Kēsari/ ravva kēsari tayārī vidhānaṁ/ svīṭ kēsari entō rucigā suluvugā elā cēsukōṇḍi


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • జీడిపప్పు - 20 గ్రా | Jīḍipappu - 20 grā
 • కిస్మిస్ - 20 గ్రా | kismis - 20 grā
 • నెయ్యి - 3 - 4 స్పూన్లు | neyyi - 3 - 4 spūnlu
 • సూజి / బొంబాయి రవ్వ - 2 కప్పులు | sūji/ bombāyi ravva - 2 kappulu
 • చక్కెర - 2 కప్పులు | cakkera - 2 kappulu
 • నీరు - 4 కప్పులు | nīru - 4 kappulu
 • యాలకుల పొడి - 1 స్పూన్ | yālakula poḍi - 1 spūn
  
ముందుగ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బొంబాయి రవ్వ పోసి వేయాలి. కొంచెం రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో జీడిపప్పు వేసి వేయాలి. జీడిపప్పు వేగినా తరువాత ఎండు ద్రాక్ష, బాదం పప్పు ముక్కలుగా చేసి అవి కూడా వేయాలి. పప్పులు బాగా వేగిన తరువాత ఆ పాన్ తీసి పక్కన్ పెట్టి చల్లారనివ్వాలి.
Munduga sṭav veligin̄ci pān peṭṭi andulō bombāyi ravva pōsi vēyāli. Kon̄ceṁ raṅgu mārina tarvāta tīsi pakkana peṭṭukuni callāranivvāli. Ippuḍu iṅkō pān peṭṭi andulō neyyi vēsi vēḍi ceyyāli. Neyyi vēḍekkina taruvāta andulō jīḍipappu vēsi vēyāli. Jīḍipappu vēginā  taruvāta eṇḍu drākṣa, bādaṁ pappu mukkalugā cēsi avi kūḍā vēyāli.Pappulu bāgā vēgina taruvāta ā pān tīsi pakkan peṭṭi callāranivvāli.
ఇప్పుడు మరోక పాన్ తీస్కుని పొయ్యి వెలిగించి మీడియం మంట మీద పెట్టి వేడి చెయ్యాలి. ఇప్పుడు అందులో నీరి పోసి మరిగించాలి. నీరు మరుగుతుండగా అందులో వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ అనుడ్లో కొంత పెద్దగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ నీరు మొత్తం చిక్కబడి బొంబాయి రవ్వ దగ్గరికి వచ్చే వరకు ఊడించాలి.
Ippuḍu marōka pān tīskuni poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda peṭṭi vēḍi ceyyāli. Ippuḍu andulō nīri pōsi marigin̄cāli. Nīru marugutuṇḍagā andulō vēyin̄ci pakkana peṭṭukunna bombāyi ravva anuḍlō konta peddagā vēstū bāgā kalupukōvāli. Uṇḍalu kaṭṭakuṇḍā bāgā kalupukōvāli. Ilā kaluputū nīru mottaṁ cikkabaḍi bombāyi ravva daggariki vaccē varaku ūḍin̄cāli.
ఇప్పుడు బొంబాయి రవ్వలోకి పంచదార వేసి బాగా ఊదించాలి. పంచదార వేసరికి వేడి ఇనా కొడ్డీ నీరు వస్తుంది. యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
Ippuḍu bombāyi ravvalōki pan̄cadāra vēsi bāgā ūdin̄cāli. Pan̄cadāra vēsariki vēḍi inā Koddi nīru  vastundi. Yālakula poḍi vēsi bāgā kalupukōvāli.
నీరు బాగా తగ్గి రవ్వ కేసరి చిక్కబడే దాక మీడియం మంటలో ఉండి తిప్పుతూ ఉండాలి.
Nīru bāgā taggi ravva kēsari cikkabaḍē dāka mīḍiyaṁ maṇṭalō uṇḍi tipputū uṇḍāli.
ఇప్పుడూ అందులో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు ముక్కలు నేతితో సహా వేసుకోవాలి.
Ippuḍū andulō vēyin̄ci pakkana peṭṭukunna jīḍipappu, eṇḍu drākṣa, bādaṁ pappu mukkalu nētitō sahā vēsukōvāli.
పప్పులన్నీ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఏంటో రుచికరమైన రవ్వ కేసరి తయారుగా ఉంది. తప్పుకుండా తాయారు చేసి చూడండి. తక్కువ సమయంలో కొన్ని వస్తువులతో తేలికగా చేసుకునే రవ్వ కేసరి.
Pappulannī bāgā kalupukuni sṭav āph cēsi pān tīsi pakkana peṭṭukōvāli. Ēṇṭō rucikaramaina ravva kēsari tayārugā undi. Tappukuṇḍā tāyāru cēsi cūḍaṇḍi. Takkuva samayanlō konni vastuvulatō tēlikagā cēsukunē ravva kēsari.
 
చిట్కాలు | Ciṭkālu:
 • నీరూ వేడి చేసిన సమయంలో యాలకుల పొడి, నెయ్యి వేస్తే కేసరి అంటుకోకుండా పొడి పొడి లాడుతూ వస్తుంది. ఏంటో కమ్మటి వాసన వస్తుంది. 
 • Nīrū vēḍi cēsina samayanlō yālakula poḍi, neyyi vēstē kēsari aṇṭukōkuṇḍā poḍi poḍi lāḍutū vastundi. Ēṇṭō  kam'maṭi vāsana vastundi.
 • తీపి ఎక్కువ తినే వారు ఒక కప్పు రవ్వ కి ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవారు పంచదార తక్కువ వేసుకోవాలి లేదా అర్ర కప్పు వేసుకోవాలి.
 • Tīpi ekkuva tinē vāru oka kappu ravva ki oka kappu pan̄cadāra vēsukōvaccu. Tīpi takkuva tinēvāru pan̄cadāra takkuva vēsukōvāli lēdā arra kappu vēsukōvāli.

Comments