పెసర వడలు తయారీ విధానం / మసాలా వడలు తయారీ విధానం / చాలా సులువుగా వదులు తయారీ విధానం / తక్కువ సమయంలో తేలికగా చేసుకునే వదులు తయారీ విధానం Pesara vaḍalu tayārī vidhānaṁ/ masālā vaḍalu tayārī vidhānaṁ/ cālā suluvugā vadulu tayārī vidhānaṁ/ takkuva samayanlō tēlikagā cēsukunē vadulu tayārī vidhānaṁ

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • సెనగపప్పు - 2 కప్పులు | senagapappu - 2 kappulu
 • పెసలు - 2 కప్పులు | pesalu - 2 kappulu
 • మినపగుళ్లు - 2 కప్పులు | minapaguḷlu - 2 kappulu
 • పచ్చిమిర్చి - 8-10 | paccimirci - 8-10
 • ఉప్పు సరిపడా | uppu saripaḍā
 • అల్లము - 10గ్రా | allamu - 10grā
 • డీప్ ఫ్రై కోసం నూనె | ḍīp phrai kōsaṁ nūne
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • కొత్తిమీర కొంచెము | kottimīra kon̄cemu
 • పుదీనా ఒక కట్టా | pudīnā oka kaṭṭā
ముందుగ సెనగపప్పు, పెసలు, మినపగుళ్లు నీరు పోసి నానబెట్టాలి. పప్పులు మునిగేదాక నీరు పొయ్యాలి. పప్పులు 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందు పచ్చిమిరపకాయలు, అల్లము ముద్దగా నూరుకోవాలి. (మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు). తరవాత ననబెట్టిన పప్పులు కడిగి మిక్సీలో వేసి పిండిగా రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయ, అల్లము ముద్ద కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
Muṇḍuga senagapappu, pesalu, minapaguḷlu nīru pōsi nānabeṭṭāli. Pappulu munigē dāka nīru poyyāli. Pappulu 4 gaṇṭalu nānabeṭṭukōvāli. Ippuḍu mundu paccimirapakāyalu, allamu muddagā nūrukōvāli. (miksīlō vēsukuni pēsṭ cēsukōvaccu). Taravāta nanabeṭṭina pappulu kaḍigi miksīlō vēsi piṇḍigā rubbukōvāli. Paccimirapakāya, allamu mudda kūḍā andulō vēsi bāgā kalupukōvāli.
వడలు వేసుకునే ముందు ఒక చెంచా పెసలు, ఒక చెంచా మినపగుళ్ళు, ఒక చెంచా పెసరపప్పు నీతిలో నానబెట్టుకోవాలి.
Vaḍalu vēsukunē mundu oka cen̄cā pesalu, oka cen̄cā minapaguḷḷu, oka cen̄cā pesarapappu nītilō nānabeṭṭukōvāli.
ఓక 10 నిమిషాలు నానిన తర్వాత నీరు వడకట్టి నానబెట్టిన పప్పులు వడ పిండిలో వేసుకోవాలి
Ōka 10 nimiṣālu nānina tarvāta nīru vaḍakaṭṭi nānabeṭṭina pappulu vaḍa piṇḍilō vēsukōvāli
ఓక ఉల్లిపాయ తరిగి ముక్కలు చేసుకోవాలి. కడిగిన సుబ్రపరచిన కొత్తిమీర చిన్నగ తరగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకునే పొడిన ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా ఆ వడ పిండిలో వేసుకోవాలి
Ōka ullipāya tarigi mukkalu cēsukōvāli. Kaḍigina subraparacina kottimīra cinnaga taragi pakkana peṭṭukōvāli. Kaḍigi pakkana peṭṭukunē poḍina ākulu, ullipāya mukkalu, kottimīra kūḍā ā vaḍa piṇḍilō vēsukōvāli
ఇప్పుడు ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోయి వెలిగించి ఓక కడాయి తీస్కుని నూనె పోసి వేడి చేయాలి.
Ippuḍu uppu vēsi piṇḍini bāgā kalupukōvāli. Ippuḍu pōyi veligin̄ci ōka kaḍāyi tīskuni nūne pōsi vēḍi cēyāli.
నునె బాగా వేడెక్కిన తరువాత కొంచెం వడ పిండి తీస్కుని గుండ్రముగా చెక్క లాగా చేసి నూనెలో బిళ్లలు వదిలి ఊడకనివ్వాలి. 
Nune bāgā vēḍekkina taruvāta kon̄ceṁ vaḍa piṇḍi tīskuni guṇḍramugā cekka lāgā cēsi nūnelō biḷlalu vadili ūḍakanivvāli.
 
బాగా వేగి రంగు మారి రెడ్ కలర్ వచ్చిన తర్వాత పెసర వడలు తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన పెసర వడలు / మసాలా వడలు తయారీ. ఈ వడలు వరలక్ష్మీ వ్రతంలో నైవేద్యం కూడా పెట్టవచ్చు. అమ్మవారికి పెసర వడలు చాలా ఇష్టం అని చెప్తారు. మీరు కూడా తప్పకుండా చేసి నివేదన చెయ్యగలరు.
Bāgā vēgi raṅgu māri reḍ kalar vaccina tarvāta pesara vaḍalu tīsi pakkana peṭṭukōvāli. Antēnaṇḍi entō rucikaramaina pesara vaḍalu/ masālā vaḍalu tayārī. Ī vaḍalu varalakṣmī vratanlō naivēdyaṁ kūḍā peṭṭavaccu. Am'mavāriki pesara vaḍalu cālā iṣṭaṁ ani ceptāru. Mīru kūḍā tappakuṇḍā cēsi nivēdana ceyyagalaru.

చిట్కాలు | Ciṭkālu:
 • వడ పిండి ముందు రోజు వేసి ఫ్రిజ్ లో పెట్టుకుని తరువాత రోజు వేసుకుంటే చాల మెత్తగా వస్తాయి.
 • Vaḍa piṇḍi mundu rōju vēsi phrij lō peṭṭukuni taruvāta rōju vēsukuṇṭē cāla mettagā vastāyi.
 • క్రిస్పీగా తినాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టి సాయంత్రం పెసర వడలు వేసుకోవచ్చు.
 • Krispīgā tināli anukuṇṭē udayānnē nānabeṭṭi sāyantraṁ pesara vaḍalu vēsukōvaccu. 

Comments