పూర్ణాలు తయారీ విధానం | తీపి బూరెలు తయారీ విధానము | పూర్ణం బూరెలు తయారీ విధానము Pūrṇālu tayārī vidhānaṁ | tīpi būrelu tayārī vidhānamu | pūrṇaṁ būrelu tayārī vidhānamu


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
  • సెనగపప్పు - 2 కప్పులు | senagapappu - 2 kappulu
  • పూర్ణం పిండి - 2 కప్పులు మినపగుళ్లు + ఒకటిన్నర (1&1/2) కప్పు బియ్యం | pūrṇaṁ piṇḍi - 2 kappulu minapaguḷlu + okaṭinnara (1&1/2) kappu biyyaṁ
  • నెయ్యి - 3 స్పూన్లు | neyyi - 3 spūnlu
  • యాలకుల పొడి - 1 చెంచా | yālakula poḍi - 1 cen̄cā
  • బెల్లం - 2 కప్పులు | bellaṁ - 2 kappulu
  • డీప్ ఫ్రై కోసం నూనె | ḍīp phrai kōsaṁ nūne
  • ఉప్పు రుచికి సరిపడా (1 స్పూన్) | Uppu ruciki saripaḍā (1 spūn)
ముందుగ సెనగపప్పు తీస్కుని బాగా కడిగి నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి.
Munduga senagapappu tīskuni bāgā kaḍigi nālugu gaṇṭalu nīḷlalō nānabeṭṭāli.
తరువాత నానబెట్టిన సెనగపప్పుని మల్లె కడిగి వడకట్టి 2 కప్పులు సెనగపప్పు కి 3-4 కప్పులు నీరు పోసి ఊడికించాలి. బాగా మెత్తగా ఊడికించాలి. ఊడికిన తరువాత పప్పు గట్టిగ ఉంటె మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ ఇయ్యేలా చేసుకోవచ్చు. తరువాత అందులో బెల్లము తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. 
Taruvāta nanabeṭṭina senagapappuni malle kaḍigi vaḍakaṭṭi 2 kappulu senagapappu ki 3-4 kappulu nīru pōsi ūḍikin̄cāli. Bāgā mettagā ūḍin̄cukōvāli. Ūḍikina taruvāta pappu gaṭṭiga uṇṭe miksī lō vēsi meṭṭagā pasṭe iyyēlā cēsukōvaccu. Taruvāta andulō bellamu turumu, yālakula poḍi, Neyyi vēsi bāgā kalupukōvāli. 
బెల్లం కరిగే సరికి పప్పులో నీరు ఉన్నా (లేదంటే) పప్పు పలుచగా ఊడికిన కొంచెం సేపు పొయ్యి మీద మీడియం ఫ్లేమెలో పెట్టి తిప్పుతూ ఉండాలి. కొంతసేపటికి పిండి చిక్కబడి గట్టిగ అవుతుంది. 6-8 గంటలకు వరకు పిండి బయట ఉంటె సరిపోతుంది.
Bellaṁ karigē sariki pappulō nīru unnā (lēdaṇṭē) pappu palucagā ūḍikinā kon̄ceṁ sēpu poyyi mīda mīḍiyaṁ phlēmelō peṭṭi tipputū uṇḍāli. Kontasēpaṭiki piṇḍi cikkabaḍi gaṭṭiga avutundi.6-8 Gaṇṭalaku varaku piṇḍi bayaṭa uṇṭe saripōtundi.
పూర్ణం పూత పిండి తయారీ విధానం ఇలా చేయండి. ముందుగ 2 కప్పులు మినపగుళ్లు, ఒకటి నర్ర కప్పు (1 & 1/2 కప్పు) బియ్యము రెండు గిన్నెల్లో విడి విడిగ నీరు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత నేరు తీసేసి ముందు మినపగుల్లని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బియ్యము మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యము పిండిని, మినపగ్గులు పిండిని, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సరే గంటా ఆ పిండిని ఫ్రిజ్ లో పెట్టుకుంటే పిండి పులిసి పోకుండా ఉంటుంది. తరువాత పడుకునేపుడు పిండి ఫ్రిజ్ లో నుండి తీసి బయట పెట్టుకుని మరుసటి రోజు ఉదయము పూర్ణాలు తయారు చేసుకోవచ్చు. 6-8 గంటలకు వరకు పిండి బయట ఉంటె సరిపోతుంది. అంత కన్నా ఎక్కువ సమయం ఉంటే పిండి పుల్లగా వచ్చే అవకాశం ఉంటుంది.
Pūrṇaṁ pūta piṇḍi tayārī vidhānaṁ ilā cēyaṇḍi. Munduga 2 kappulu minapaguḷlu, okaṭi narra kappu (1& 1/2 kappu) biyyamu reṇḍu ginnellō viḍi viḍiga nīru pōsi nālugu gaṇṭalu nānabeṭṭāli. Taruvāta nēru tīsēsi mundu minapagullani mettagā rubbukōvāli. Taruvāta biyyamu meṭṭagā rubbukōvāli. Ippuḍu oka ginnelō biyyamu piṇḍini, minapaggulu piṇḍini, kon̄ceṁ uppu vēsi bāgā kalupukōvāli. Sarē gaṇṭā ā piṇḍini phrij lō peṭṭukuṇṭē piṇḍi pulisi pōkuṇḍā uṇṭundi. Taruvāta paḍukunēpuḍu piṇḍi phrij lō nuṇḍi tīsi bayaṭa peṭṭukuni marusaṭi rōju udaya pūrṇālu tayāru cēsukōvaccu. 6-8 Gaṇṭalaku varaku piṇḍi bayaṭa uṇṭe saripōtundi. Anta kannā ekkuva samayaṁ uṇṭē piṇḍi pullagā vaccē avakāśaṁ uṇṭundi.
ముందు రోజు సిద్దం చేసుకున్న సెనగపప్పు బెల్లం పిండిని గుండ్రంగా ఉండలాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి
Mundu rōju siddaṁ cēsukunna senagapappu bellaṁ piṇḍini guṇḍraṅgā uṇḍalāga cēsukoni pakkana peṭṭukōvāli.
పొయ్యి వెలిగించి మీడియం మంట మీద నూనె వేడి చెయ్యాలి. నునె వేడెక్కిన తరువాత కొంచెం పిండి వేసి చూడాలి. వెంటనే పిండి నూనెలో పైకి తేలితే నునే బాగా కాగినట్లు తెలుస్తుంది. కాబట్టి పొయ్యి అధిక జ్వాల లోకి మార్చి పూర్ణాలు వేసుకోవాలి.
Poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda nūne vēḍi ceyyāli. Nune vēḍekkina taruvāta kon̄ceṁ piṇḍi vēsi cūḍāli. Veṇṭanē piṇḍi nūnelō paiki tēlitē nunē bāgā kāginaṭlu telustundi. Kābaṭṭi poyyi adhika jvāla lōki mārci pūrṇālu vēsukōvāli.
ఇప్పుడు పూత పిండిని బాగా కలుపుకోవాలి. పిండి నానేసరికి ఉబ్బుతుంది కాబట్టీ ఒక్కసారి కలుపుకుంటే మధ్యలో గాలి లేకుండా పిండి అంతా బాగా కలుపుతుంది. ఇప్పుడు గుండ్రంగా చుట్టి పక్కన పెట్టిన ఉండలు తీసి పూత పిండిలో ముందు నుంచి లోకి వేసుకోవాలి.
Ippuḍu pūta piṇḍini bāgā kalupukōvāli. Piṇḍi nānēsariki ubbutundi kābaṭṭī okkasāri kalupukuṇṭē madhyalō gāli lēkuṇḍā piṇḍi antā bāgā kaluputundi. Ippuḍu guṇḍraṅgā cuṭṭi pakkana peṭṭina uṇḍalu tīsi pūta piṇḍilō mundu nun̄ci lōki vēsukōvāli. 
  
ముందే గుండ్రంగా ఉండలు చుట్టము కాబట్టి త్వరగా పూర్ణాలు చేస్కోవచ్చు. పూర్ణాలు ఎరుపు రంగులోకి వచ్చిన తరువాత తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. నునే ఇస్టపడని వారు ప్లేట్ లో టిష్యూలు పెట్టి అందులో పూర్ణాలు వేసుకుంటే టిష్యూలు నునే పీల్చేసి పూర్ణాలు నునే లేకుండా బాగుంటాయి.
Mundē guṇḍraṅgā uṇḍalu cuṭṭamu kābaṭṭi tvaragā pūrṇālu cēskōvaccu. Pūrṇālu erupu raṅgulōki vaccina taruvāta tīsi pakkana plēṭ lō peṭṭukōvāli. Nunē isṭapaḍani vāru plēṭ lō ṭiṣyūlu peṭṭi andulō pūrṇālu vēsukuṇṭē ṭiṣyūlu nunē pīlcēsi pūrṇālu nunē lēkuṇḍā bāguṇṭāyi.
 
ఎంతో రుచికరమైన మరియు గుమ గుమ లాడే పూర్ణలు సిద్దంగా ఉన్నాయి.
Entō rucikaramaina mariyu guma guma lāḍē pūrṇalu siddaṅgā unnāyi.

చిట్కాలు | Ciṭkālu::
  • సెనగ పప్పు, బెల్లం కలిపిన పిండిలో ఇష్టం ఉన్నవారు జీడి పప్పు, బాదం, ఏడు కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి ఆ పిండిలో కలుపుకోవచ్చు.
  • Senaga pappu, bellaṁ kalipina piṇḍilō iṣṭaṁ unnavāru jīḍi pappu, bādaṁ, ēḍu kobbari mukkalu neyyilō vēyin̄ci ā piṇḍilō kalupukōvaccu.

Comments