మిరియాల చారు తయారీ విధానము | మిరియాల రసం తక్కువ సమయంలో ఇలా చేసుకోండి | 5 నిమిషాల్లో తేలికగా ఇలా మిరియాల రసం చేసుకోండి|మిర్యాల రసం Miriyāla cāru tayārī vidhānamu | miriyāla rasaṁ takkuva samayanlō ilā cēsukōṇḍi | 5 nimiṣāllō tēlikagā ilā miriyāla rasaṁ cēsukōṇḍi|miryāla rasaṁ

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • చింతపండు - 10గ్రా | cintapaṇḍu - 10grā
 • టొమాటో - 2 | ṭomāṭō - 2
 • యెండు మిరపకాయలు - 2 | yeṇḍu mirapakāyalu - 2
 • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
 • మిర్యాల పొడి - 1-2 స్పూన్లు | miryāla poḍi - 1-2 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
 • కరివేపాకు కొన్ని ఆకులు | karivēpāku konni ākulu
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • నీరు - 3 కప్పులు | nīru - 3 kappulu
 • వెల్లుల్లి రెబ్బలు - 3 | vellulli rebbalu - 3
   
ముందుగ ఒక కప్పు నీళ్లల్లో చింతపండు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడూ ఓక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి ఇన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు, యెండు మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత అందులో చితకకొట్టిన వెల్లుల్లి రెమ్మలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి బాగా మీటగా అయ్యేదాకా వేయించుకోవాలి.
Munduga oka kappu nīḷlallō cintapaṇḍu vēsi nānabeṭṭukōvāli. Ippuḍū ōka pān peṭṭi andulō nūne vēsi vēḍi cēsukōvāli. Vēḍi ina taruvāta andulō āvālu, jīlakarra vēsi ullipāya mukkalu, Yeṇḍu mirapakāyalu vēsi bāgā vēyiṁ cukōvāli. Taruvāta andulō citakakoṭṭina vellulli rem'malu vēsi pacci vāsana pōyē varaku vēyin̄cukōvāli.Ippuḍu ṭamōṭā mukkalu vēsi bāgā mīṭagā ayyedākā vēyiṁ cukōvāli.
ఇప్పుడు చింతపండు పులుసు పిండి ఆ పాన్ లో వేసి బాగా మరిగించాలి. (చింతపండు పేస్ట్ ఐతే 1 స్పూన్ వేసి 2 కప్పులు నీరు పోసుకోవాలి). అందులో కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు, మిరియాల పొడి వేసి బాగా మరిగించుకోవాలి.
Ippuḍu cintapaṇḍu pulusu piṇḍi ā pān lō vēsi bāgā marigin̄cāli. (Cintapaṇḍu pēsṭ aitē 1 spūn vēsi 2 kappulu nīru pōsukōvāli). Andulō kon̄ceṁ pasupu, uppu, karivēpāku, miriyāla poḍi vēsi bāgā marigin̄cukōvāli. 
 
నీరు బాగా మరిగినా తరువాత అందులో కొత్తిమీరా వేసి పోయి ఆఫ్ చేసి చారు పక్కన పెట్టుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన మరియు ఘాటుగా మిరియాల చారు తయారుగా ఉంది. వేడి వేడి అన్నంలోకి వద్దిం చుకోండి. మిరియాల చారు ఆరోగ్యానికి చాలా మంచిది అంది. పైత్యం ఉంటే పోతుంది. చిన్న పిల్లలకి పొట్టలో నొప్పి అంటుంటారు. మిరియాల రసం చేసి అన్నంలో పెట్టి చూడండి. తప్పకుండ తగ్గుతుంది. నాన్ వెజ్ కూర ఉన్నపుడు, జ్వరం వచినపుడు ఇది నోటికి రుచిగా చాల బాగుంటుంది. తప్పకుండ చేసి చూడండి. త్వరగా అరిగిపోతుంది కూడా. జలుబు, దగ్గు దూరం చేస్తుంది ఈ మిర్యాల రసం. అంతే కాదండి జలుబు, దగ్గు దూరం చేస్తుంది ఈ మిర్యాల రసం.
Nīru bāgā mariginā taruvāta andulō kottimīrā vēsi pōyi āph cēsi cāru pakkana peṭṭukōvāli. Antēnaṇḍi entō rucikaramaina mariyu ghāṭugā miriyāla cāru tayārugā undi. Vēḍi vēḍi annanlōki vaddiṁ cukōṇḍi. Miriyāla cāru ārōgyāniki cālā man̄cidi andi. Paityaṁ uṇṭē pōtundi. Cinna pillalaki poṭṭalō noppi aṇṭuṇṭāru. Miriyāla rasaṁ cēsi annanlō peṭṭi cūḍaṇḍi. Tappakuṇḍa taggutundi. Nān vej kūra unnapuḍu, jvaraṁ vacinapuḍu idi nōṭiki rucigā cāla bāguṇṭundi. Tappakuṇḍa cēsi cūḍaṇḍi. Tvaragā arigipōtundi kūḍā.Antē kādaṇḍi jalubu, daggu dūraṁ cēstundi ī miryāla rasaṁ.

Comments