బీరకాయ టమోటా పచ్చడి తయారీ విధానం| బీరకాయ రోటీ పచ్చడి తయారీ విధానం | రుచికరమైన బీరకాయ టమోటా పచ్చడి | మల్లీ మల్లీ తినాలనిపించేలా బీరకాయతో పచ్చడి ఇలా చేసి చూడండీ Bīrakāya ṭamōṭā paccaḍi tayārī vidhānaṁ| bīrakāya rōṭī paccaḍi tayārī vidhānaṁ | rucikaramaina bīrakāya ṭamōṭā paccaḍi | mallī mallī tinālanipin̄cēlā bīrakāyatō paccaḍi ilā cēsi cūḍaṇḍī

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • బీరకాయ - 1 | bīrakāya - 1
 • టొమాటో - 4 | ṭomāṭō - 4
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • ఆవలు - 1 స్పూను | āvalu - 1 spūnu
 • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
 • సెనగపప్పు - 2 స్పూన్లు | senagapappu - 2 spūnlu
 • వెల్లుల్లి రెమ్మలు - 5 | vellulli rem'malu - 5
 • పచ్చిమిరపకాయలు - 3 | paccimirapakāyalu - 3
 • యెండుమిరపకాయలు - 2 | yeṇḍumirapakāyalu - 2
 • ఉప్పు సరిపడా | uppu saripaḍā
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • నూనె - 5 స్పూన్లు | nūne - 5 spūnlu
 • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
 • చింతపండు - 5 గ్రా (ఐచ్ఛికం) | cintapaṇḍu - 5 grā (aicchikaṁ)
 • కొత్తమీరా కొంచెము | kottamīrā Kon̄cemu
   
ముందుగ పొయ్యి వెలిగించి మీడియం మంటలో పెట్టి పాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్లు నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యినా తరువాత అందులో బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, యెండు మిరపకాయలు వేసి బాగా వేయించాలి. పచ్చిమిరపకాయలు మంటగ ఉంటె 3-4 సరిపోతాయి. కారం తక్కువ కాయలు అయిన, మీరు కారంగా పచ్చడి తినాలి అనిపించిన 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముక్కలూ మెత్తబడి బాగా వేగిన తరువాత పాన్ తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
Munduga pōyyi veligin̄ci mīḍiyaṁ maṇṭalō peṭṭi pān peṭṭukōvāli. Andulō 3 spūnlu nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍi ayyinā taruvāta andulō bīrakāya mukkalu, ṭamāṭā mukkalu, ullipāya mukkalu, paccimirapakāyalu, yeṇḍu mirapakāyalu vēsi bāgā vēyin̄cāli. Paccimirapakāyalu maṇṭaga uṇṭe 3-4 saripōtāyi. Kāraṁ takkuva kāyalu ayina, mīru kāraṅgā paccaḍi tināli anipin̄cina 7-8 paccimirapakāyalu vēsukōvāli. Mukkalū Mettabaḍi bāgā vēgina taruvāta pān tīsi pakkana peṭṭukuni callāranivvāli.

  
ముక్కలూ చల్లారిన తరువాత రుబ్బుకోవాలి. మిక్సీలో వేసి వేయించిన ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా మిక్సీలో రుబ్బుకోవాలి.
Mukkalū callārina taruvāta rubbukōvāli. Miksīlō vēsi vēyin̄cina mukkalatō pāṭu ruciki saripaḍā uppu, kon̄ceṁ cintapaṇḍu, jīlakarra 1 spūn, vellulli rem'malu vēsi bāgā miksīlō rubbukōvāli.
ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి వేడి చెయ్యాలి. పాన్ వేడి అయినా తరువాత అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. చమురు వేడి అయినా తరువాత అందులో ఆవులు, జీలకర్ర చెంచా, పసుపు, సెనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిన తరువాత అందులో కరివేపాకు, ఒక యెందు మిరపకాయ వేసి వేయించుకోవాలి. 
Ippuḍu poyyi veligin̄ci oka pān peṭṭi vēḍi ceyyāli. Pān vēḍi ayinā taruvāta andulō nūne vēsi vēḍi ceyyāli. Camuru vēḍi ayinā taruvāta andulō āvulu, jīlakarra cen̄cā, pasupu, senagapappu vēsi bāgā vēyin̄cukōvāli. Pappulu bāgā vēgina taruvāta andulō karivēpāku, oka yendu mirapakāya vēsi vēyin̄cukōvāli.
  
ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి పాన్ తీసి తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతేనండి ఎంతో రుచికరమైన మరియూ ఆరోగ్యకరమయిన బీరకాయ పచ్చడి తాయారు. ఇది ఇడ్లీ లోకి, దోస, అన్నము చాలా బాగుంటుంది. మల్లీ   తినాలనిపించేలా ఉంటుంది.
Ippuḍu poyyi āph cēsi pān tīsi tālimpunu paccaḍilō vēsi bāgā kalupukōvāli. Kottimīratō gārniṣ cēstē antēnaṇḍi entō rucikaramaina mariyū ārōgyakaramayina bīrakāya paccaḍi tāyāru. Idi iḍlī lōki, dōsa, annamu cālā bāguṇṭundi. Mallī   tinālanipin̄cēlā uṇṭundi.

Comments