చెక్కలు తయారీ విధానము | గోడమాపిండితో చెక్కలు ఇలా చేసి చూడండి | గోడుమపిండితో చెక్కలు తయారీ విధానము | చెక్కలు రెసిపీ | పప్పు చెక్కలు |గోడుమాపిండితో కరకరలాడే చెక్కలు|గోడుమాపిండితో చెక్కలు టీ టైమ్ స్నాక్స్ | తక్షణ చెక్కలు చేసుకునే విధానం Cekkalu tayārī vidhānamu | gōḍamāpiṇḍitō cekkalu ilā cēsi cūḍaṇḍi | gōḍumapiṇḍitō cekkalu tayārī vidhānamu | cekkalu resipī | pappu cekkalu |gōḍumāpiṇḍitō karakaralāḍē cekkalu|gōḍumāpiṇḍitō cekkalu ṭī ṭaim snāks | takṣaṇa cekkalu cēsukunē vidhānaṁ


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • గోదుమ పిండి - 2 కప్పులు | Gōduma piṇḍi - 2 kappulu
  • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
  • ఉప్పు రుచికి సరిపడ | uppu ruciki saripaḍa
  • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
  • పసుపు - 1 చెంచా | pasupu - 1 cen̄cā
  • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
  • డీప్ ఫ్రై కోసం నూనె | ḍīp phrai kōsaṁ nūne
  • బియ్యం పిండి - 2 స్పూన్లు | biyyaṁ piṇḍi - 2 spūnlu
  • సెనగపప్పు - 1 కప్పు | senagapappu - 1 kappu
  • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
   
ముందుగ సెనగపప్పు తీస్కుని నీళ్లలో 4 గంటలు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నె తీస్కుని అందులో గోడుమాపింది తీస్కోవాలి. అందులో రుచికి సరిపడ ఉప్పు, కారము, జీలకర్ర, వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. పిండి పొడిగా ఉంటుంది. అందులో నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకున్నా సెనగపప్పు నీ కూడా వేసి కలుపుకోవాలి.బాగ కలుపుకున్నా తరువాత  చిన్ని చిన్నగా నీళ్ళు చేస్కుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి.
Munduga senagapappu tīskuni nīḷlalō 4 gaṇṭalu nānabeṭṭāli. Taruvāta oka ginne tīskuni andulō gōḍumāpindi tīskōvāli. Andulō ruciki saripaḍa uppu, kāramu, jīlakarra, vēḍi nūne vēsi bāgā kalupukōvāli. Piṇḍi poḍigā uṇṭundi. Andulō nīḷḷu vaḍakaṭṭi pakkana peṭṭukunnā senagapappu nī kūḍā vēsi kalupukōvāli. Bāga kalupukunnā taruvāta cinni  cinnagā nīḷḷu cēskuṇṭū piṇḍini muddalā kalupukōvāli.
 
ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండ తీస్కుని కొంచెం బియ్యం పిండి / గడుమ పిండి ఇలా వేసి పైనా చపాతీ లాగ పలుచగా చేస్కోవాలి.
Ippuḍu piṇḍini cinna uṇḍalugā cēsukōvāli. Oka uṇḍa tīskuni kon̄ceṁ biyyaṁ piṇḍi/ gaḍuma piṇḍi ilā vēsi painā capātī lāga palucagā cēskōvāli.
  
ఇప్పుడూ ఓక గ్లాసు తీస్కుని గుండ్రంగా ఆ పిండి మీద నొక్కితే గుండ్రంగా చెక్కలు పిండి వస్తుంది. అలా గుండ్రంగా అన్నీ చెక్కలు పిండిని ఒక ప్లేట్ లోకి తీస్కుని పక్కన పెట్టుకోవాలి. మద్యలో మిగిలిన పిండిని మల్లి ఉండ చేసుకొని చపాతీ లాగ బేల్ చేసి మల్లి గుండ్రంగా చెక్కలు పిండి తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
Ippuḍū ōka glāsu tīskuni guṇḍraṅgā ā piṇḍi mīda nokkitē guṇḍraṅgā cekkalu piṇḍi vastundi. Alā guṇḍraṅgā annī cekkalu piṇḍini oka plēṭ lōki tīskuni pakkana peṭṭukōvāli. Madyalō migilina piṇḍini malle uṇḍa cēsukoni capātī lāga bēl cēsi malli guṇḍraṅgā cekkalu piṇḍi tīsi pakkana plēṭ lō peṭṭukōvāli.
 
ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. నునె బాగా వేడి అయ్యినా తరువాత పక్కన ప్లేట్ లో పెట్టుకున్న చెక్కలు పిండిని నూనె వేసి బాగా వేయాలి. మీడియం మంట మీద ఉండి వేస్తే కర కర లాడుతూ చాలా బాగా వస్తాయి చెక్కలు. అంతేనండి ఎంతో రుచికరమైన చెక్కలు తయారుగా ఉన్నాయి. పిల్లలు కూడా ఇస్టపడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పిండి కలుపుకుని త్వరగా చేసుకోవచ్చు. సెనగపప్పు లేకపోయిన చాల క్రిస్పీగా వస్తుంది. 
Ippuḍu poyyi veligin̄ci kaḍāyi peṭṭi andulō nūne pōsi vēḍi ceyyāli. Nune bāgā vēḍi ayyinā taruvāta pakkana plēṭ lō peṭṭukunna cekkalu piṇḍini nūne vēsi bāgā vēyāli. Mīḍiyaṁ maṇṭa mīda uṇḍi vēstē kara kara lāḍutū cālā bāgā vastāyi cekkalu. Antēnaṇḍi entō rucikaramaina cekkalu tayārugā unnāyi. Pillalu kūḍā isṭapaḍatāru. Eppuḍu kāvālaṇṭē appuḍu kon̄ceṁ kon̄ceṁ piṇḍi kalupukuni tvaragā cēsukōvaccu. Senagapappu lēkapōyina cāla krispīgā vastundi. 

చిట్కాలు| Ciṭkālu:
1.బేల్ చేసేటప్పుడు బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి చెక్కలు. బియ్యం పిండి లేనిపుడు గొడుమ పిండి కొంచెం ఎక్కువ వేసి బేల్ చెయ్యాలి.
Bale cēsēṭappuḍu biyyaṁ piṇḍi vēstē krispīgā vastāyi cekkalu. Biyyaṁ piṇḍi lēnipuḍu goḍuma piṇḍi kon̄ceṁ ekkuva vēsi bale ceyyāli.
2. సనగపప్పు వేసినపుడు బేల్ చేస్తే పిండి కొంచెం మందంగా వస్తుంది. అలానే వేయండి. కాకపోతే మీడియం మంట మీద ఎక్కువ వేయిస్తే క్రిస్పీగా వస్తుంది. వెంటనే చెక్కలు చేస్కోవాలి అనుకోనపుడు సెనగపాపు లేకుండా చేసుకోవచ్చు. నేల రోజుల దాకా బాగుంటయి
Senagapappu vēsinapuḍu bēl cēstē piṇḍi kon̄ceṁ mandaṅgā vastundi. Alānē vēyaṇḍi. Kākapōtē mīḍiyaṁ maṇṭa mīda ekkuva vēyistē krispīgā vastundi. Veṇṭanē cekkalu cēskōvāli anukōnapuḍu senagapāpu lēkuṇḍā cēsukōvaccu. Nēla rōjula dākā bāguṇṭayi

Comments