దోసకాయ చికెన్ కర్రీ తయారీ విధానం | చికెన్ దోసకాయ కూర | అధిక ప్రోటీన్ ఉన్న కూర Dōsakāya ciken karrī tayārī vidhānaṁ | ciken dōsakāya kūra | adhika prōṭīn unna kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • చికెన్ - 500 గ్రా | ciken - 500 grā
 • పసుపు దోసకాయ - 2 లేదా 500 గ్రా | pasupu dōsakāya - 2 lēdā 500 grā
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
 • గరం మసాలా పొడి - 1 స్పూన్ | garam masālā poḍi - 1 spūn
 • నూనె - 3-4 స్పూన్లు | Nūne - 3-4 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
 • కారం - 2-3 స్పూన్లు | kāraṁ - 2-3 spūnlu
 • బే ఆకు - 1 | bē āku - 1
 • లవంగాలు - 4-5 lavaṅgālu - 4-5
 • దాల్చిన చెక్క - 1 | dālcina cekka - 1
 • అనాస పువ్వు - 1 | anāsa puvvu - 1
 • జాజి కాయ - 1 | jāji kāya - 1
 • షజీరా - 1 స్పూన్ | ṣajīrā - 1 spūn
ముందుగ పొయ్యి వెలిగించి పాన్/కుక్కర్ పెట్టి వేడి చేయాలి. వేడెక్కిన తరువాత అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యాక అందులో లవంగాలు, దాల్చిన చెక్క, బే ఆకు, అనస పువ్వు, జాజి కాయ, షాజీర వేసి వేయిం చాలి.అవి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. ఇపుడు అందులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. అందులో చికెన్ వేసి బాగా కలుపుకోవాలి.
Munduga poyyi veligin̄ci pān/kukkar peṭṭi vēḍi cēyāli. Vēḍekkina taruvāta andulō nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍi ayyāka andulō lavaṅgālu, dālcina cekka, bē āku, anasa puvvu, jāji kāya, ṣājīra vēsi
vēyiṁ cāli.Avi vēgina taruvāta andulō ullipāya mukkalu, ṭamāṭā mukkalu vēsi vēyin̄cāli. Ipuḍu andulō uppu, kāramu, pasupu, allaṁ velli mudda vēsi bāgā kalupukōvāli. Pacci vāsana pōyēdākā vēyin̄cāli. Andulō ciken vēsi bāgā kalupukōvāli. 
 
కూర కుక్కర్ లో వండుతునపుడు కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారిన తరువాత అందులో కొంచెం నీళ్ళు పోసి, దోసకాయ ముక్కలూ వేసి ఒక విజిల్ రానివ్వాలి. మల్లె స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి కూర చిక్కబెట్టాలి. నీరు ఇగిరిపోయి కూర చిక్కబడుతుండగా అందులో గరం మసాలా పొడి వేసి కూర బాగా కలుపుకోవాలి. కొంచెం కొట్టిమేరా వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
Kūra kukkar lō vaṇḍutunapuḍu kukkar mūta peṭṭukuni 3 vijils vaccāka sṭav āph cēsi kukkar callāranivvāli. Kukkar callārina taruvāta andulō kon̄ceṁ nīḷḷu pōsi, dōsakāya mukkalū vēsi oka vijil rānivvāli. Malle sṭav āph cēsi kukkar callāranivvāli. Ippuḍu maḷḷī poyyi veligin̄ci kūra cikkabeṭṭāli. Nīru igiripōyi kūra cikkabaḍutuṇḍagā andulō garaṁ masālā poḍi vēsi kūra bāgā kalupukōvāli. Kon̄ceṁ koṭṭimērā vēsukuni gārniṣ cēsukuṇṭē cālā bāguṇṭundi. (or)
 
కూర కడాయి/పాన్ లో వందితే వారు చికెన్ బాగా కలుపుకుని పెద్ద మంట మీద చికెన్ ని ఊదించాలి. కూర సగం ఊడికైనా తరువాత అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ఊడికెలోపే చికెన్ కూడా ఊడిపోతుంది. దోసకాయ ముందు వేస్తే బాగా మెత్తగా ఐపోతుంది కాబట్టీ చికెన్ సగం ఊడికైనా తరువాత దోసకాయ వేసుకోవాలి. కొంచెం నీరు పోసి బాగా ఊడికించుకోవాలి. కూర చిక్కబడ్డ తరువాత అందులో గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొట్టిమేరతో అలంకరించు చేస్తే చాల బాగుంటుంది. అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ దోసకాయ కూర తయారుగా ఉంది. ఇది అన్నంలోకి, రోటీ, చపాతీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఆరోగ్యము కుడా అండి.
Kūra kaḍāyi/pān lō vanditē vāru ciken bāgā kalupukuni pedda maṇṭa mīda ciken ni ūdin̄cāli. Kūra sagaṁ ūḍikainā taruvāta andulō dōsakāya mukkalu vēsukōvāli. Dōsakāya ūḍikelōpē ciken kūḍā ūḍipōtundi. Dōsakāya mundu vēstē bāgā mettagā aipōtundi kābaṭṭī ciken sagaṁ ūḍikainā taruvāta dōsakāya vēsukōvāli. Kon̄ceṁ nīru pōsi bāgā ūḍikin̄cukōvāli. Kūra cikkabaḍḍa taruvāta andulō garaṁ masālā poḍi vēsi bāgā kalupukōvāli. Koṭṭimēratō alaṅkarin̄cu cēstē cāla bāguṇṭundi. Antēnaṇḍi entō rucikaramaina ciken dōsakāya kūra tayārugā undi. Idi annanlōki, rōṭī, capātī anniṭilōki cālā bāguṇṭundi. Ārōgyamu kuḍā aṇḍi.

Comments