కోడి గుడ్డు పులుసు కూర తయారీ విధానం | చాలా తేలికగా గుడ్డు పులుసు ఇలా చేసి చూడండి Kōḍi guḍḍu pulusu kūra tayārī vidhānaṁ | cālā tēlikagā guḍḍu pulusu ilā cēsi cūḍaṇḍi

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • కోడి గుడ్లు - 7 | kōḍi guḍlu - 7
 • చింతపండు - 20గ్రా | cintapaṇḍu - 20grā
 • ఉల్లిపాయ - 2 పెద్దవి | ullipāya - 2 peddavi
 • ఆవలు - 1 స్పూను | āvalu - 1 spūnu
 • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • వెల్లుల్లి రెబ్బలు - 3 | vellulli rebbalu - 3
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
 • నీరు - 1-2గ్లాసు | nīru -1- 2glāsu
 • కొత్తిమీర కొంచెము | kottimīra kon̄cemu
ముందుగ ఒక గిన్నెల ఒక గాజు నీరు పోసి అందులో చింతపండు నానబెట్టాలి. చింతపండు గుజ్జు/ పేస్ట్ బయట కొనే వారు 1 చెంచ చింతపండు గుజ్జు/పేస్ట్ కూరలో ఉపయోగించవచ్చు.
Munduga oka ginnela oka gāju nīru pōsi andulō cintapaṇḍu nānabeṭṭāli. Cintapaṇḍu gujju/ pēsṭ bayaṭa konē vāru 1 cen̄ca cintapaṇḍu gujju/pēsṭ kūralō upayōgin̄cavaccu.
ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లు తీయాలి. పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక చెంచా నూనె వేసి గుడ్డలని వేయించాలి. గుడ్లు వేగిన తరువాత నూనె లోంచి గుడ్లు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి.
Ippuḍu uḍakapeṭṭina guḍlu tīyāli. Poyyi veligin̄ci oka pān peṭṭi andulō oka cen̄cā nūne vēsi guḍḍalani vēyin̄cāli. Guḍlu vēgina taruvāta nūne lōn̄ci guḍlu tīsi pakkana plēṭlō peṭṭukōvāli.

ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అన్నిలో ఉప్పు,పసుపు,వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించుకోవాలి. పాచి వాసన పోయే వరకు వేయంచాలి. అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి.
Ippuḍu poyyi veligin̄ci pān peṭṭukuni andulō 2 cen̄cālu nūne vēsukōvāli. Nūne vēḍekkina taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cukōvāli. Avi bāgā vēgina taruvāta andulō ullipāya mukkalu vēsi bāgā
vēyin̄cukōvāli. Ullipāya mukkalu raṅgu mārina taruvāta annilō uppu,pasupu,vellulli mudda vēsi bāgā
vēyin̄cukōvāli. Pāci vāsana pōyē varaku vēyan̄cāli. Andulō kāraṁ vēsi bāgā kalupukōvāli.
నానబెట్టిన చింతపండు బాగా పిసికి గుజ్జు తీసి వేగుతున్న ఉల్లిపాయలో వేయాలి. గుజ్జు చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.
Nānabeṭṭina cintapaṇḍu bāgā pisiki gujju tīsi vēgutunna ullipāyalō vēyāli. Gujju cikkabaḍē varaku uḍakanivvāli.
 
వేయించిన గుడ్లకి గాట్లు పెట్టుకుని పులుసులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఓక 2-3 నిమిషాలు ఉడికిస్తే ఉప్పు, కారం, పులుపు గుడ్లకి పట్టి బాగా రుచిగా ఉంటుంది. ఇస్తాం ఉన్న వాళ్ళు అందులో ధనియాల పొడి వేసుకోవచ్చు. చివరగా తరిగిన కొట్టిమేర వేసి పోయి ఆఫ్ చేయాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన మరియు సులభమైన రీతిలో కోడిగుడ్డు పులుసు సిద్దంగా ఉంది.
Vēyin̄cina guḍlaki gāṭlu peṭṭukuni pulusulō vēsukuni bāgā kalupukōvāli. Ōka 2-3 nimiṣālu uḍikistē uppu, kāraṁ, pulupu guḍlaki paṭṭi bāgā rucigā uṇṭundi. Istāṁ unna vāḷḷu andulō dhaniyāla poḍi vēsukōvaccu. Civaragā tarigina koṭṭimēra vēsi pōyi āph cēyāli. Antēnaṇḍī entō rucikaramaina mariyu sulabhamaina rītilō kōḍiguḍḍu pulusu siddaṅgā undi.

Comments