సేమియా పాయసము తయారీ విధానము | సేమియా పాయసము ఇలా చేసి చూడండి | సేమియ సగ్గుబియ్యము పాయసము | సబుదానా స్వీట్ | సాగో స్వీట్ Sēmiyā pāyasamu tayārī vidhānamu | sēmiyā pāyasamu ilā cēsi cūḍaṇḍi | sēmiya saggubiyyamu pāyasamu | sabudānā svīṭ | sāgō svīṭ

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
  • సేమియా - 1 గ్లాస్ | sēmiyā - 1 glās
  • సగ్గుబియ్యము - 1 గ్లాసు | saggubiyyamu - 1 glāsu
  • పాలు - 500 మి.లీ | pālu - 500 mi.Lī
  • యాలుకల పొడి - 1 స్పూన్ | yālukala poḍi - 1 spūn
  • చక్కెర - 1-2 గ్లాసెస్ | cakkera - 1-2 glāses
  • నెయ్యి - 3-5 స్పూన్లు | neyyi - 3-5 spūnlu
  • జీడిపప్పు - 10 గ్రా | jīḍipappu - 10 grā
  • ఎండుద్రాక్ష - 10 గ్రా | eṇḍudrākṣa - 10 grā
  
ముందుగ ఒక గిన్నె తీసుకుని అందులో సగ్గుబియ్యం వేసి నీళ్లల్లో నానబెట్టుకోవాలి.తరువాత పొయ్యి వెలిగించి ఓక పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయిన తరువాత అందులో 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడి అయిన తరువాత అందులో సేమియా వేసి వేయించుకోవాలి. సేమియ రంగు మారి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకుని పొయ్యి ఆఫ్ చేసి సేమియా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. అందులో సేమియా వేసి 10నిమిషాలు ఉడకించాలి. 
Munduga oka ginne tīsukuni andulō saggubiyyaṁ vēsi  nīḷlallō nānabeṭṭukōvāli.Taruvāta poyyi  veligin̄ci ōka pān peṭṭi vēḍi cēsukōvāli. Pān vēḍi ayina taruvāta andulō 2 spūnlu neyyi vēsi vēḍi ceyyāli. Neyyi vēḍi ayina taruvāta andulō sēmiyā vēsi vēyin̄cukōvāli. Sēmiya raṅgu māri kon̄ceṁ erupu raṅgu vaccēdākā vēyin̄cukuni poyyi āph cēsi sēmiyā pakkana peṭṭukōvāli. Ippuḍu oka ginne tīsukuni andulō oka glāsu nīḷḷu pōsi bāgā maraganivvāli. Andulō sēmiyā vēsi 10nimiṣālu uḍakin̄cāli.
  
సేమియాలో ఇప్పుడు 250ml పాలు పోసి అందులో వడకట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసి బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం, సేమియా బాగా ఊడికెదాకా కలుపుతూ చూసుకోవాలి. లేదంటే అడుగు అంటుంది మడిపోయే అవకాశం కూడా ఉంది. అందులో యాలుకల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
Sēmiyālō Ippuḍu 250ml pālu pōsi andulō vaḍakaṭṭi pakkana peṭṭukunna saggubiyyaṁ andulō vēsi bāgā kalupukōvāli. Saggubiyyaṁ, sēmiyā bāgā ūḍikedākā kaluputū cūsukōvāli. Lēdaṇṭē aḍugu aṇṭundi maḍipōyē avakāśaṁ kūḍā undi. Andulō yālukala poḍi vēsi bāgā kalupukōvāli.
  
ఇప్పుడు అందులో పనచదర/బెల్లము వేసే బాగా కలుపుకోవాలి. పంచదార/బెల్లము కరిగేదాకా కలుపుతూ ఉండాలి. మద్యలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి తీస్కుని ఒక పాన్ లో వేసి వేడి ఇన తరువాత అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం(ఐచ్ఛికం), పిస్తా(ఐచ్ఛికం) వేసి బాగా వేయించుకోవాలి.పప్పులు బాగా వేగిన తరువాత నెయ్యితో సహా పాయసంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన సేమియా పాయసము తాయారు. తక్కువ సమయం లో ఎక్కువ శ్రమ లేకుండా తేలికగా ఇలా చేసుకోవచ్చు.
Ippuḍu andulō panacadara/bellamu vēsē bāgā kalupukōvāli. Pan̄cadāra/bellamu karigēdākā kaluputū uṇḍāli. Madyalō kon̄ceṁ kon̄ceṁ pālu pōsukuṇṭū uṇḍāli. Ippuḍu 2 spūnlu neyyi tīskuni oka pān lō vēsi vēḍi ina taruvāta andulō jīḍipappu, eṇḍu drākṣa, bādaṁ(aicchikaṁ), pistā(aicchikaṁ) vēsi bāgā vēyin̄cukōvāli. Pappulu bāgā vēgina taruvāta neyyitō sahā pāyasanlō vēsukuni bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina sēmiyā pāyasamu tāyāru. Takkuva samayaṁ lō ekkuva śrama lēkuṇḍā tēlikagā ilā cēsukōvaccu.

చిట్కా | Ciṭkā:
పాయసం చిక్కగా రావాలి అంటే నీరు వాడకుండా పాలు వాడుకోవచ్చు.
Pāyasaṁ cikkagā rāvāli aṇṭē nīru vāḍakuṇḍā pālu vāḍukōvaccu.

Comments