ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం | గుడ్డుతో మిగిలిపోయిన అన్నం గొప్ప వంటకం | ఎగ్ రైస్ ఇలా తయారు చేయండి | సాధారణ ఎగ్ రైస్ రెసిపీ Eg phraiḍ rais tayārī vidhānaṁ | guḍḍutō migilipōyina annaṁ goppa vaṇṭakaṁ | eg rais ilā tayāru cēyaṇḍi | sādhāraṇa eg rais resipī


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • ఉల్లిపాయ - 1 | Ullipāya - 1
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • గుడ్లు - 3 | Guḍlu - 3
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • పచ్చిమిర్చి - 1 | paccimirci - 1
 • కారం - 2 స్పూన్లు | karam - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట - 1 స్పూన్ | allaṁ vellulli pasṭe - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • షాజీరా - 1 స్పూన్ | ṣājīrā - 1 spūn
 • బే ఆకు - 2 | bē āku - 2
 • అనస పుష్పం - 1 | anasa puṣpaṁ - 1
 • దాల్చిన చెక్క - 1 | dālcina cekka - 1
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • మిరియాలు - 3 | miriyālu - 3
 • యాలుకలు - 2 | yālukalu - 2
 • జాజి కాయ - 1 | Jāji kāya - 1
 • అన్నం - 2 కప్పులు | annaṁ - 2 kappulu
 • కరివేపాకు కొంచెం | Karivēpāku kon̄ceṁ
 • కొత్తిమీర కొంచెం | kottimīra kon̄ceṁ
 
ముందుగ పొయ్యి వెలిగించి ఒక కడాయి/పాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. తరువాత లవంగాలు, ఆనాస పువ్వు, బే ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలుకలు, జాజి కాయ వేసి వేయించుకోవాలి. 
Munduga poyyi veligin̄ci oka kaḍāyi/pān peṭṭi vēḍi cēyāli. Andulō nūne vēsi vēḍi ceyyāli. Taruvāta lavaṅgālu, ānāsa puvvu, bē āku, dālcina cekka, miriyālu, yālukalu, jāji kāya vēsi vēyin̄cukōvāli.
  
బాగా వేగిన తరువాత అందులో తరిగినా, ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిరపకాయ ముక్కలూ వేసి బాగా వేయించుకోవాలి. ముక్కలూ బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే దాక వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
Bāgā vēgina taruvāta andulō tariginā, ullipāya mukkalū, paccimirapakāya mukkalū, ṭamāṭā, baṅgāḷadumpa mukkalū vēsi bāgā vēyin̄cukōvāli. Mukkalū bāgā vēgina taruvāta andulō allaṁ velli mudda vēsi paccivāsana pōyē dāka Vēyin̄cukōvāli.. Ippuḍu uppu, pasupu vēsi bāgā kalupukōvāli.
 
ఉల్లిపాయ ఊడికిన తరువత గుడ్డు పగలగొట్టి అందులో మిస్రమన్ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తరువాత కొంచెం కొంచెం గా కలుపుతూ ఉంటే చిన్న చిన్న ఉండలుగా వస్తుంది. ముందే ఉండకనివ్వకుండా కలిపితే ఇలా ఉండలు రావు. అన్నం మద్యలో ఇలా ఉండలు తగిలితే చాల బాగుంటుంది.తరువాత కారం, షాజీరా, కరివేపాకు వేసి 2నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగ ఊడికించిన అన్నము తీస్కుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా పట్టేలా బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్న అన్నం మీద కొంచెం కొత్తిమెర చల్లి స్టవ్ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టాలి
Ullipāya ūḍikina taruvata guḍḍu pagalagoṭṭi andulō misramanni vēsukōvāli. Pacci vāsana pōyina taruvāta kon̄ceṁ kon̄ceṁ gā kaluputū uṇṭē cinna cinna uṇḍalugā vastundi. Mundē uṇḍakanivvakuṇḍā kalipitē ilā uṇḍalu rāvu. Annaṁ madyalō ilā uṇḍalu tagilitē cāla bāguṇṭundi.Taruvāta kāraṁ, ṣājīrā, karivēpāku vēsi 2nimiṣālu kalupukuṇṭū Vēyin̄cukōvāli.Ippuḍu garaṁ masālā vēsi bāgā kalupukōvāli. Munduga Ūḍikin̄cina ānamu tīskuni andulō vēsukuni bāgā kalupukōvāli. Uppu, kāraṁ, masālā paṭṭēlā bāgā kalupukuṇṭū 2 nimiṣālu vēyin̄cukōvāli. Vēḍi vēḍigā unna annaṁ mīda kon̄ceṁ kottimera calli sṭav āph cēsi pān tīsi pakkana peṭṭāli. 
 
అంతేనండి ఏంటో రుచికరమైన గుడ్డు ఫ్రైడ్ రైస్ తయారుగా ఉంది. వేడి వేడిగా వడ్డించుని తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందు రోజు రాత్రి మిగిలిన అన్నం ఇలా చేసారంటే అందరు తప్పకుండ తింటారు. అన్నం కూడా వేస్ట్ అవ్వడు. గుడ్డు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. పిల్లలు గుడ్డు తినను అంటే ఇలా చేసి పెట్టారు అంటే తప్పకుండ తింటారు. ప్రొటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలి ఆరోగ్యంగా ఉంటారు. అన్నీ పోషకాలు అందితేనే పిల్లలైనా, పెద్దలైనా ఆరోగ్యంగా ఉంటారు. తప్పకుండ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
Antēnaṇḍi ēṇṭō rucikaramaina phraiḍ rais tayārugā undi. Vēḍi vēḍigā vaḍḍin̄cuni tinaṇḍi maḷḷī maḷḷī tinālanipistundi. Mundu rōju rātri migilina annaṁ ilā cēsāraṇṭē andaru tappakuṇḍa tiṇṭāru. Guḍḍu uṇḍaṭaṁ valla ārōgyāniki man̄cidi. Pillalu guḍḍu tinanu aṇṭē ilā cēsi peṭṭāru aṇṭē tappakuṇḍa tiṇṭāru. Proṭīn kūḍā uṇṭundi kābaṭṭi pillali ārōgyaṅgā uṇṭāru. Annī pōṣakālu anditēnē pillalainā, peddalainā ārōgyaṅgā uṇṭāru. Annaṁ kūḍā vēsṭ avvaḍu. Tappakuṇḍa ṭrai cēsi elā undō ceppaṇḍi.

చిట్కా | Ciṭkā::
 • ఇలా సిద్ధంగా ఉన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ పైనా ఒక సగం ముక్క నిమ్మకాయ పిండితే చాల రుచిగా ఉంటుంది. జీర్ణం కూడా బాగా అవుతుంది. కారం కూడా తగ్గుతుంది కాబట్టీ పిల్లకు స్పైసీగా అనిపించదు
 • Ilā sid'dhaṅgā unnā eg phraiḍ rais painā oka sagaṁ mukka nim'makāya piṇḍitē cāla rucigā uṇṭundi. Jīrṇaṁ kūḍā bāgā avutundi. Kāraṁ kūḍā taggutundi kābaṭṭī pillaku spaisīgā anipin̄cadu

Comments