గారెలు తయారీ విధానం | ఇంట్లోనే మినప గారెలు రెసిపీ | మినప వడ తయారీ విధానం | మినప గారెలు తయారీ విధానం Gārelu tayārī vidhānaṁ | iṇṭlōnē minapa gārelu resipī | minapa vaḍa tayārī vidhānaṁ | minapa gārelu tayārī vidhānaṁ


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu :
  • మినపగుళ్లు - 2 గాజులు | Minapaguḷlu - 2 gājulu
  • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
  • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
  • అల్లం - 10గ్రా | allaṁ - 10grā
  • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • డీప్ ఫ్రై కోసం నూనె  | ḍīp phrai kōsaṁ nūne
 
ముందుగ మినపగుళ్లు తీస్కుని బాగా కడిగి ఒక 6-8గంటలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి. తరువాత బాగా కడిగి నీళ్లు వాడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా అల్లం కడిగి అల్లం, పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్ లో వేసుకుని, అందులో పక్కన పెట్టుకున్న మినపగుళ్లు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ లో పిండి వేస్తే నీరు అస్సలు వేసుకోకూడదు. మిక్సీ లో వేసుకునెప్పుడు కొంచెం 2-3 స్పూన్లు నీళ్ళు కలుపుకోవాలి. అప్పుడూ పిండి మెత్తగా వస్తుంది. కొంచెం బరకగా తినే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం మెత్తగా చేసుకొని పిండి బద్దలుగా ఉన్నపుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు పిండి తీసి ఒక గిన్నెలో పెట్టుకుని, మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా ముందు రోజు పిండి చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. గారెలు వేసుకునే గంట ముందు పిండి తీసి బయట పెట్టుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల గారెలు కరకరలాడుతూ ఉంటాయి. పైగా నునే కూడా ఎక్కువ పీల్చావు.
Munduga minapaguḷlu tīskuni bāgā kaḍigi oka 6-8gaṇṭalu nīḷlallō nānabeṭṭukōvāli. Taruvāta bāgā kaḍigi nīḷlu vāḍakaṭṭi pakkana peṭṭukōvāli. Ippuḍu cinnagā allaṁ kaḍigi allaṁ, paccimirapakāyalu oka miksī jār lō vēsukuni andulō pakkana peṭṭukunna minapaguḷlu kūḍā vēsukōvāli. Kon̄ceṁ uppu vēsi bāgā mettagā rubbukōvāli. Graiṇḍar lō piṇḍi vēstē nīru as'salu vēsukōkūḍadu. Miksī lō vēsukuneppuḍu kon̄ceṁ 2-3 spūnlu nīḷḷu kalupukōvāli. Appuḍū piṇḍi mettagā vastundi. Kon̄ceṁ barakagā tinē alavāṭu unna vāḷḷu kon̄ceṁ mettagā cēsukoni piṇḍi baddalugā unnapuḍu tīsēsukōvaccu. Ippuḍu piṇḍi tīsi oka ginnelō peṭṭukuni, Mūta peṭṭi phrij‌lō peṭṭukōvāli. Ilā mundu rōju piṇḍi cēsukoni phrij lō peṭṭukuṇṭē gārelu cālā bāgā vastāyi. Gārelu vēsukunē gaṇṭa mundu piṇḍi tīsi bayaṭa peṭṭukōvāli. Ilā ceyyaḍaṁ valla gārelu karakaralāḍutū uṇṭāyi. Paigā nunē kūḍā ekkuva pīlcāvu.

    

గారెలు వేసుకునే ముందు ఒక ఉల్లిపాయ సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. కొంచెం కొత్తిమీరా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి.
Gārelu vēsukunē mundu oka ullipāya sannagā cinna mukkalugā tarugukōvāli. Kon̄ceṁ kottimīrā, ullipāya mukkalu vēsukuni piṇḍini bāgā kalupukōvāli.
ఇప్పుడు పొయ్యి వెలిగించి ఓక కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. పోయ్యి అధిక జ్వాల లో ఉండాలి. నునే బాగా వేడెక్కినా, గారెలు మడిపోతున్నాయి అనిపించిన మధ్యమ జ్వాల లోకి మార్చుకోవాలి. గారెలు ఎక్కువ మంటలో పెట్టి వేస్తే లోపల కూడా బాగా ఊడుకుతాయి. చేతితో అలవాటు ఉంటె కొంచెం పిండి తీస్కుని ఇలా పల్చగా చేసి మద్యలో చిల్లు పెట్టి నునే లోకి వేసుకోవాలి. మద్యలో చిల్లు పెట్టడం వల్ల గారెలు మద్యలోకి నువ్వు వెళ్లి బాగా ఊడుకుతాయి. చేతితో వెయ్యడం అలవాటు లేని వారు ఒక పాలిథిన్ కవర్ (లేదంటే అరటి ఆకు) తీస్కుని దాని మీద పైన కొంచెం నునే రాసి కొంచెం పిండి తీస్కుని బంతి లాగ చేసి దానిని కవర్ లేడా అరటి ఆకు మీద పెట్టి మెత్తగా ఇలా ప్రెస్ చేసి మద్యలో చిల్లు పెట్టి నూనె లోకి వేసుకోవాలి. ఇప్పుడు రంగు మారి ఎర్రు రంగు వస్తుంది. ఒక వైపు వేగిన తరువాత మరో వైపు తిప్పి వేయించుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన గారెలు సిద్దంగా ఉన్నాయి. తప్పకుండ చేసి ఎలా వచ్చాయో చెప్పండి.
Ippuḍu poyyi veligin̄ci ōka kaḍāyi peṭṭi andulō nūne pōsi vēḍi ceyyāli. Pōyyi adhika jvāla lō uṇḍāli. Nunē bāgā vēḍekkinā, gārelu maḍipōtunnāyi anipin̄cina madhyama jvāla lōki mārcukōvāli. Gārelu ekkuva maṇṭalō peṭṭi vēstē lōpala kūḍā bāgā ūḍukutāyi. Cētitō alavāṭu uṇṭe kon̄ceṁ piṇḍi tīskuni ilā palcagā cēsi madyalō cillu peṭṭi nunē lōki vēsukōvāli. Madyalō cillu peṭṭaḍaṁ valla gārelu madyalōki nuvvu veḷli bāgā ūḍukutāyi. Cētitō veyyaḍaṁ alavāṭu lēni vāru oka pālithin kavar (lēdaṇṭē ārati āku) tīskuni dāni mīda painā kon̄ceṁ nunē rāsi kon̄ceṁ piṇḍi tīskuni banti lāga cēsi dāni kavar lēda ārati āku mīda peṭṭi meṭṭagā ilā pres cēsi madyalō cillu peṭṭi nūne lōki vēsukōvāli. Ippuḍu raṅgu mari erru raṅgu vastundi. Oka vaipu vēgina taruvāta marō vaipu tippi vēyimchukovali. Antēnaṇḍi entō rucikaramaina gārelu siddaṅgā unnāyi. Tappakuṇḍa cēsi elā vaccāyō ceppaṇḍi.

Comments