కొబ్బరి అన్నం తయారీ విధానం | కొబ్బరితో ఇలా చేసి చూడండి | రాత్రి మిగిలిన అన్నంతో ఇలా చేసి చూడండి Kobbari annaṁ tayārī vidhānaṁ | kobbaritō ilā cēsi cūḍaṇḍi | Rātri migilina annantō ilā cēsi cūḍaṇḍi

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • ఆవాలు - 1స్పూను | āvālu - 1spūnu
 • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
 • నూనె - 2-3 స్పూన్లు | nūne - 2-3 spūnlu
 • వేరుశెనగ గుల్లు - 2 స్పూన్లు | vēruśenaga gullu - 2 spūnlu
 • సెనగ పప్పు - 2 స్పూన్లు | senaga pappu - 2 spūnlu
 • మినప గుళ్లు - 2 స్పూన్లు | minapa guḷlu - 2 spūnlu
 • తురిమిన కొబ్బరి - 1 కప్పు | turimina kobbari - 1 kappu
 • ఉడికించిన అన్నం - 2 కప్పులు | uḍikin̄cina annaṁ - 2 kappulu
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర కొంచెం | kottimīra kon̄ceṁ
 • జీడిపప్పు - 2 స్పూన్లు | jīḍipappu - 2 spūnlu
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • యెండు మిరపకాయలు - 2 | yeṇḍu mirapakāyalu - 2
 • అల్లం చిన్న ముక్క (2గ్రా) | allaṁ cinna mukka (2grā)
  
ముందుగ పొయ్యి వెలిగించి కడాయి/పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సెనగపప్పు, వేరుసెనగగుళ్లు, మిరియాలు, మినపప్పు వేసి వేయాలి. పప్పులు బాగా వేగిన తరువాత అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్పకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, వేసి వేయాలి. అన్నీ బాగా వేగిన తరువాత అందులో యెందు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, తురిమిన కొబ్బరి వేసి 2 నిమిషాలు వేయాలి (కొబ్బరి చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ లో మెత్తగా చేసుకోవచ్చు. నీరు అస్సలు వేయకూడదు). పచ్చి కొబ్బరిలో రాగి, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మరియు జింక్ చాలా పుష్కలంగా ఉన్నాయి.
Munduga poyyi veligin̄ci kaḍāyi/pān peṭṭi andulō nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍekkina taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyiṁcukōvāli. Ippuḍu senagapappu, vērusenagaguḷlu, miriyālu, minapappu vēsi vēyāli. Pappulu bāgā vēgina taruvāta allaṁ cinna mukkalugā kaṭ cēsukoni vēsukōvāli. Paccimirpakāyalu cinna mukkalugā kaṭ cēsukoni vēsukōvāli. Ippuḍu jīḍipappu, vēsi vēyāli. Annī bāgā vēgina taruvāta andulō yendu mirapakāyalu, karivēpāku vēsi bāgā kalupukōvāli. Ippuḍu uppu, turimina kobbari vēsi 2 nimiṣālu vēyāli (kobbari cinna mukkalu cēsukoni miksī lō mettagā cēsukōvaccu. Nīru as'salu vēyakūḍadu). Pacci kobbarilō rāgi, selīniyaṁ, airan, phāsparas, poṭāṣiyaṁ, megnīṣiyaṁ mariyu jiṅk cālā puṣkalaṅgā unnāyi.
 
ఇప్పుడు అందులో ఉడకబెట్టిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలుపుతూ 2 నిమిషాలు వేయించుకోవాలి. చివరగా చిన్నగా తరిగిన కొత్తమీర వేసి బాగా కలుపుకోవాలి.
అంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం తాయారు. పప్పులు ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రోజు వేరేగ చెయ్యాలి అంటే కొత్తగా ఇలా ప్రయత్నించండి చేయండి. చాల తక్కువ సమయములో సిద్ధం చేసుకోవచ్చు. కొబ్బరి చాలా మంచిది ఆరోగ్యానికి. జుట్టు పెరుగుతుంది, మెరిసే చర్మానికి కొబ్బరి ఒక సూపర్‌ఫుడ్. కొబ్బరిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ మరియు కొవ్వు అధికంగా ఉంటాయి, ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటుంది. తప్పకుండ ట్రై చేసి వ్యాఖ్య చెయ్యండి.
Ippuḍu andulō uḍakabeṭṭina annaṁ vēsi bāgā kalupukōvāli. Annaṁ bāgā kaluputū 2 nimiṣālu vēyin̄cukōvāli. Civaragā cinnagā tarigina kottamīra vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina kobbari annaṁ tāyāru. Pappulu uṇḍaṭaṁ valla pillalu cālā iṣṭaṅgā tiṇṭāru. Rōju vērēga ceyyāli aṇṭē kottagā ilā prayatnin̄caṇḍi cēyaṇḍi. Cāla takkuva samayamulō sid'dhaṁ cēsukōvaccu. Kobbari cālā man̄cidi ārōgyāniki. Juṭṭu perugutundi, merisē carmāniki kobbari oka sūpar‌phuḍ. Kobbarilō piṇḍi padārthālu takkuvagā uṇṭāyi mariyu phaibar mariyu kovvu adhikaṅgā uṇṭāyi, idi raktanlō cakkera niyantraṇaku prayōjanakaraṅgā uṇṭundi. Tappakuṇḍa ṭrai cēsi vyākhya ceyyaṇḍi.

Comments