పెసరట్టు తయారీ విధానం | పెసరట్టు దోస వంటకం | పెసరట్టు వంటకం | ఆరోగ్యకరమైన మూంగ్ దాల్ దోస రెసిపీ Pesaraṭṭu tayārī vidhānaṁ | pesaraṭṭu dōsa vaṇṭakaṁ | pesaraṭṭu vaṇṭakaṁ | ārōgyakaramaina mūṅg dāl dōsa resipī


పెసలులో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవానికి గుండెపోటు నుండి రక్షించవచ్చు, జీర్ణ ఆరోగ్యానికి సహాయపడవచ్చు, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు "చెడు" LDL కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పెసలులో ఫోలేట్, విటమిన్ B9 లేదా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, మీ శరీరం కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.
Pesalulō pōṣakālu mariyu yāṇṭī'āksiḍeṇṭlu adhikaṅgā uṇṭāyi, ivi ārōgya prayōjanālanu andistāyi. Vāstavāniki, vāru guṇḍepōṭu nuṇḍi rakṣin̄cavaccu, jīrṇa ārōgyāniki sahāyapaḍavaccu, baruvu taggaḍānni prōtsahistundi mariyu"ceḍu" LDL kolesṭrāl, raktapōṭu mariyu raktanlō cakkera sthāyilanu taggistundi. Pesalulō phōlēṭ, viṭamin B9 lēdā phōlik yāsiḍ puṣkalaṅgā uṇṭundi, mī śarīraṁ kotta kaṇālanu, mukhyaṅgā erra rakta kaṇālanu utpatti cēyaḍāniki mariyu nirvahin̄caḍāniki sahāyapaḍutundi.

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • పెసలు - 2 గ్లాసులు | Pesalu - 2 glāsulu
  • బియ్యం - 5 స్పూన్లు | Biyyaṁ - 5 spūnlu
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • అల్లం - 10 గ్రా |  allaṁ - 10 grā
  • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
  • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
  • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
  • నూనె - 1 చెంచా (ప్రతి దోసెకు) | nūne - 1 cen̄cā (prati dōseku)
ముందుగ పెసలు, బియ్యము తీస్కుని బాగా కడిగి పెసలు మునిగే వరకు నీరు పోసి ఒక 6-8 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత బాగా కడిగి నీరు వడ కట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో పెసలు వేసుకుని, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని బాగా మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. చిన్నగా నీరు చేర్చుకుంటూ మెట్టగా పిండిని చేసుకోవాలి. ముందు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దోస పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ హీట్ అయ్యిన తరువాత పెసరపిండి తీసుకుని బాగా కలిపి దోసలాగా వేసుకోవాలి. ఓక చెంచా నూనె దోస చుట్టు వేసుకోవాలి. దోస మద్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగిన తర్వాత ఇలా మద్యలోకి మడుచుకోవాలి. దోస వేగిన తర్వాత రెండో వైపు తిప్పి మళ్లీ వేగనివ్వాలి. అంతేనండి ఎంతో రుచికరమైన పెసరట్టు సిద్దంగా ఉంది. పెసరట్టు అల్లం చట్నీ,   కొబ్బరి చట్నీ లోకి కలిపి తింటే చాలా బాగుంటుంది. చాల ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పెసరట్టు. తప్పకుండ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
Munduga pesalu, biyyamu tīskuni bāgā kaḍigi pesalu munigē varaku nīru pōsi oka 6-8gaṇṭalu nānabeṭṭukōvāli. Taruvāta bāgā kaḍigi nīru vāḍa kaṭṭukōvāli. Ippuḍu miksī jār lō pesalu vēsukuni, allaṁ, paccimirci, jīlakarra vēsukuni bāgā mettani piṇḍigā rubbukōvāli. Cinnagā nīru cērcukuṇṭū meṭṭagā  piṇḍini cēsukōvāli. Mundu oka ullipāyani sannagā tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci dōsa pān peṭṭi vēḍi cēsukōvāli. Pān hīṭ ayyinā taruvāta pesarapiṇḍi tīsukuni bāgā kalipi dōsalāgā vēsukōvāli. Ōka cen̄cā nūne dōsa cuṭṭu vēsukōvāli. Dōsa madyalō sannagā tarigina ullipāya mukkalu vēsukuni vēgina tarvāta ilā madyalōki maḍucukōvāli. Dōsa vēgina tarvāta reṇḍō vaipu tippi maḷlī vēganivvāli. Antēnaṇḍi entō rucikaramaina pesaraṭṭu siddaṅgā undi. Pesaraṭṭu allaṁ caṭnī,  kobbari caṭnī lōki kalipi tiṇṭē cālā bāguṇṭundi. Cāla ārōgyakaramaina mariyu rucikaramaina pesaraṭṭu. Tappakuṇḍa ṭrai cēsi elā undō ceppaṇḍi.

Comments