ప్రోటీన్ దోస | మొలకలతో ఆరోగ్యకరమైన దోసె | సెనగలు & పెసలు మొలకలతో చేసిన దోసె Prōṭīn dōsa | molakalatō ārōgyakaramaina dōse | senagalu& pesalu molakalatō cēsina dōse

చిక్‌పీస్/సెనగలు & మూంగ్ పప్పు/పెసలు మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిక్‌పీస్‌/సెనగలులో ఫైబర్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి మరియు తక్కువ GI కలిగి ఉంటాయి. చిక్‌పీస్ యొక్క సంభావ్య ప్రయోజనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి, బరువును నిర్వహించడంలో మరియు గుండె మరియు ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడతాయి. చిక్‌పీస్ బహుముఖమైనది, కాబట్టి మీరు వాటిని చాలా రుచికరమైన లేదా తీపి భోజనం మరియు స్నాక్స్‌లకు జోడించవచ్చు.ముంగ్ బీన్స్‌లో/పెసలు పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవానికి, అవి హీట్ స్ట్రోక్ నుండి రక్షించవచ్చు, జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి మరియు "చెడు" LDL కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
Cik‌pīs/senagalu& mūṅg pappu/pesalu molakalu ārōgyāniki cālā man̄cidi. Cik‌pīs‌/Senagalulō phaibar, prōṭīn mariyu ārōgyakaramaina kovvulu adhikaṅgā uṇṭāyi mariyu takkuva GI kaligi uṇṭāyi. Cik‌pīs yokka sambhāvya prayōjanālu raktanlō cakkeranu niyantrin̄caḍanlō sahāyapaḍatāyi, baruvunu nirvahin̄caḍanlō mariyu guṇḍe mariyu prēgula ārōgyāniki tōḍpaḍatāyi. Cik‌pīs bahumukhamainadi, kābaṭṭi mīru vāṭini cālā rucikaramaina lēdā tīpi bhōjanaṁ mariyu snāks‌laku jōḍin̄cavaccu.Muṅg bīns‌/Pesalulō pōṣakālu mariyu yāṇṭī'āksiḍeṇṭlu adhikaṅgā uṇṭāyi, ivi ārōgya prayōjanālanu andistāyi. Vāstavāniki, avi hīṭ sṭrōk nuṇḍi rakṣin̄cavaccu, jīrṇa ārōgyāniki sahāyapaḍatāyi, baruvu taggaḍānni prōtsahistāyi mariyu"ceḍu" LDL kolesṭrāl, raktapōṭu mariyu raktanlō cakkera sthāyilanu taggistāyi.
  

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • సెనగలు - 2 కప్పులు | Senagalu - 2 kappulu
  • పెసలు - 2 కప్పులు | pesalu - 2 kappulu
  • అల్లం - 10 గ్రా | allaṁ - 10 grā
  • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
  
ముందుగ పెసలు, సెనగలు తీస్కుని బాగా కడిగి పెసలు మునిగే వరకు నీరు పోసి ఒక 6-8 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత బాగా కడిగి నీరు వడ కట్టుకోవాలి. ఇప్పుడు ఓక గుడ్డ లేదా బాక్స్ లో పెట్టి మొలకలు ఎత్తించాలి.మొలకలు రావడానికి ఒక 12-24గం పడుతోంది. లేదంటే బయట మొలకలు తీస్కుని కుడా వంటకం ప్రయత్నించండి. ఇప్పుడు మిక్సీ జార్ లో పెసలు, సెనగలు మొలకలు వేసుకుని, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని బాగా మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. చిన్నగా నీరు చేర్చుకుంటూ మెత్తగా పిండిని చేసుకోవాలి. ముందు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దోస పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ హీట్ అయ్యిన తరువాత పిండి తీసుకుని బాగా కలిపి దోసలాగా వేసుకోవాలి. ఓక చెంచా నూనె దోస చుట్టు వేసుకోవాలి. దోస మద్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగిన తర్వాత ఇలా మద్యలోకి మడుచుకోవాలి. దోస వేగిన తర్వాత రెండో వైపు తిప్పి మళ్లీ వేగనివ్వాలి. అంతేనండి ఎంతో రుచికరమైన మొలకలు దోస సిద్దంగా ఉంది. మొలకలు దోస కొబ్బరి చట్నీ లోకి కలిపి తింటే చాలా బాగుంటుంది. చాల ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మొలకలు దోస. తప్పకుండ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
Munduga pesalu, senagalu tīskuni bāgā kaḍigi pesalu munigē varaku nīru pōsi oka 6-8 gaṇṭalu nānabeṭṭukōvāli. Taruvāta bāgā kaḍigi nīru vaḍa kaṭṭukōvāli. Ippuḍu ōkā guḍḍa lēdā bāks lō peṭṭi molakalu ettin̄cāli.Molakalu rāvaḍāniki oka 12-24gaṁ paḍutōndi. Lēdaṇṭē bayaṭa molakalu tīskuni kuḍā vaṇṭakaṁ prayatnin̄caṇḍi. Ippuḍu miksī jār lō pesalu, senagalu molakalu vēsukuni, allaṁ, paccimirci, jīlakarra vēsukuni bāgā mettani piṇḍigā rubbukōvāli. Cinnagā nīru cērcukuṇṭū mettagā piṇḍini cēsukōvāli. Mundu oka ullipāyani sannagā tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci dōsa pān peṭṭi vēḍi cēsukōvāli. Pān hīṭ ayyina taruvāta piṇḍi tīsukuni bāgā kalipi dōsalāgā vēsukōvāli. Ōka cen̄cā nūne dōsa cuṭṭu vēsukōvāli. Dōsa madyalō sannagā tarigina ullipāya mukkalu vēsukuni vēgina tarvāta ilā madyalōki maḍucukōvāli. Dōsa vēgina tarvāta reṇḍō vaipu tippi maḷlī vēganivvāli. Antēnaṇḍi entō rucikaramaina molakalu dōsa siddaṅgā undi. Molakalu dōsa kobbari caṭnī lōki kalipi tiṇṭē cālā bāguṇṭundi. Cāla ārōgyakaramaina mariyu rucikaramaina molakalu dōsa. Tappakuṇḍa ṭrai cēsi elā undō ceppaṇḍi.

Comments