ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం | ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన లడ్డూ | కాల్షియమ్, హిమోగ్లోబిన్, ప్రోటీన్ కోసం ఒక లడ్డూ రోజు తినండి Prōṭīn laḍḍū tayārī vidhānaṁ | ārōgyakaramaina mariyu rucikaramaina laḍḍū | kālṣiyam, himōglōbin, prōṭīn kōsaṁ oka laḍḍū rōju tinaṇḍi


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
  • నువ్వులు - 500గ్రా | nuvvulu - 500grā
  • వేరుసెనగ గుల్లు - 500గ్రా | vērusenaga gullu - 500grā
  • అవిసా గింజల - 500 గ్రా | avisā gin̄jala - 500 grā
  • బెల్లం - 750 గ్రా | bellaṁ - 750 grā
  • యాలకులు - 10 | yālakulu - 10
  
ముందుగా ఒక కడాయి/పాన్ పెట్టి పొయ్యి  వెలిగించి మీడియం మంటలో పెట్టాలి.ఇప్పుడు కడాయి /పాన్ లో నువ్వులు పోసి వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. నువ్వులు కొంచెం రంగు మారగానే తీసి ఒక ప్లేట్ లో పోసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో వేరుసెనగగుల్లు పోసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత వేరుసెనగగుల్లు తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అవిసగింజలు, యాలుకలు పాన్ లో పోసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అవి కూడా చల్లారనివ్వాలి.
Mundugā oka kaḍāyi/pān peṭṭi Poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭalō peṭṭāli.Ippuḍu kādayi/pān lō nuvvulu pōsi vēyin̄cukōvāli. Man̄ci vāsana vastundi. Nuvvulu kon̄ceṁ raṅgu māragānē tīsi oka plēṭ lō pōsi callāranivvāli. Ippuḍu kaḍāyilō vērusenagagullu pōsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta vērusenagagullu tīsi pakkana peṭṭi callāranivvāli. Ippuḍu avisagin̄jalu, yālukalu pān lō pōsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta avi kūḍā callāranivvāli.
  
ఇప్పుడు బెల్లం తీస్కుని తురుముకోవాలి. లేడా చిన్న ముక్కలూ చేసుకొని మెత్తగా చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పొరపాటున కూడా నీరు కలపకండి. (బెల్లము బదులుగ బెల్లం పొడి కూడా ఉపయోగించవచ్చు.) ఇప్పుడు అవిసగింజలు, నువ్వులు, వేరుసెనగగుల్లు చల్లారితే మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిలో బెల్లం పేస్ట్ / బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు గా చుట్టుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన మరియూ ఆరోగ్యకరమైన లడ్డూ తయారుగా ఉంది. పిల్లలకు కాల్షియం తక్కువగా ఉంటే నువ్వులు తప్పకుండా తినాలి. ఇలా చేసి రోజు ఒక లడ్డూ పెట్టి చూడండి. తప్పకుండ కాల్షియం పెరుగుతుంది. అలాగే అవిసగింజలు గుండెకి మంచి చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వేరుసెనగ గుల్లు మంచి కొవ్వు కూడా. తప్పకుండ చేసి చూడండి.
Ippuḍu bellaṁ tīskuni turumukōvāli. Lēḍā cinna mukkalū cēsukoni mettagā cēsukoni mettani pēsṭ lāgā cēsukōvāli. Porapāṭuna kūḍā nīru kalapakaṇḍi. (Bellamu baduluga bellaṁ poḍi kūḍā upayōgin̄cavaccu.) Ippuḍu avisagin̄jalu, nuvvulu, vērusenagagullu callāritē miksīlō poḍi cēsukōvāli. Ippuḍu ā poḍilō bellaṁ pēsṭ/ bellaṁ poḍi vēsi bāgā kalupukōvāli. Ippuḍu cinna cinna uṇḍalu gā cuṭṭukōvāli. Aṇṭenaṇḍi ēṇṭō rucikaramaina mariyū ārōgyakaramaina laḍḍū tayārugā undi. Pillalaku kālṣiyaṁ takkuvagā uṇṭē nuvvulu tappakuṇḍā tināli. Ilā cēsi rōju oka laḍḍū peṭṭi cūḍaṇḍi. Tappakuṇḍa kālṣiyaṁ perugutundi. Alāgē avisagin̄jalu guṇḍeki manchi cēstāyi. Alāgē kolesṭrāl taggutundi. Vērusenaga gullu man̄ci kovvu kūḍā. Tappakuṇḍa cēsi cūḍaṇḍi.

Comments