తోటకూర రొయ్యల కూర | కూరలో ప్రొటీన్లు, విటమిన్లు & మినరల్స్ ఉంటాయి | రొయ్యలు తోట కూర Tōṭakūra royyala kūra | kūralō proṭīnlu, viṭaminlu& minarals uṇṭāyi | royyalu tōṭa kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu

 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • టమోటా - 1 (ఐచ్ఛికం) | ṭamōṭā - 1 (aicchikaṁ)
 • తోటకూర - 250 గ్రా | tōṭakūra - 250 grā
 • రొయ్యలు - 250 గ్రా | royyalu - 250 grā
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • పసుపు - 1 చెంచా | pasupu - 1 cen̄cā
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • పుదీనా ఆకులు కొన్ని | pudīnā ākulu konni

  

రకం - 1 | Rakaṁ - 1:
ముందుగ స్టవ్ వెలిగించి ఓక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత అందులో టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమోటా ముక్కలూ వేగిన తరువాత అందులో తోటకూర వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడూ అందులో అల్లం వెల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తరువాత బాగా కడిగి పక్కన పెట్టుకునే పచ్చి రొయ్యలు వేసుకోవాలి. కొంచెం సేపటికి రొయ్యల నుండి నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం మగ్గే దాక కలుపుతూ చూసుకోవాలి.ఇపుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక కప్పు నీరు పోసుకుని బాగా ఊదికించాలి. కూర చిక్కబడుతూ ఉండగా అందులో పుదీనా అకులు, కరివేపాకు, గరం మసాలా వేసి 2 నిమిషాలు వేయించాలి. చివరిలో కొత్తిమీర ఆకులు వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన తోటకూర రొయ్యలు కూర సిద్దం. వేడి వేడి అన్నంలోకి తిని చూడండీ మల్లి మల్లి తినాలి అనిపిస్తుంది. తోటకూర తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. రక్తహీనత ఉన్నవారికి తోటకూర తినడం చాల అవసరం. ఎందుకంటె అదీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, మరియు సులభంగా జీర్ణం అవుతుంది. రొయ్యలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రొయ్యలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి, అయితే సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. విటమిన్లు & మినరల్స్ యొక్క గొప్ప మూలం. ఈ  అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉన్నాయి. బలమైన కండరాలు & ఎముకలను నిర్మిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సంభావ్యంగా క్యాన్సర్ నివారిస్తుంది.
Munduga sṭav veligin̄ci ōka pān peṭṭi andulō nūne vēsi vēḍi cēsukōvāli. Nūne vēḍi ayyāka andulō cinnagā tarigina ullipāya mukkalu vēsukuni vēyin̄cukōvāli. Ullipāya vēgina taruvāta andulō ṭamōṭā mukkalu vēsi vēyiṁ cukōvāli. Ṭamōṭā mukkalū vēgina taruvāta andulō tōṭakūra vēsi 2 nimiṣālu vēyin̄cāli. Ippuḍū andulō allaṁ velli mudda vēsi pacci vāsana pōyēdākā vēyin̄cukōvāli. Taruvāta bāgā kaḍigi pakkana peṭṭukunē pacci royyalu vēsukōvāli. Kon̄ceṁ sēpaṭiki royyala nuṇḍi nīru vastundi. Ā nīru mottaṁ maggē dāka kaluputū cūsukōvāli.Ipuḍu kon̄ceṁ pasupu, uppu, kāraṁ vēsi bāgā kalupukōvāli. Taruvāta oka kappu nīru pōsukuni bāgā ūdikin̄cāli. Kūra cikkabaḍutū uṇḍagā andulō Pudīnā akulu, karivēpāku, garaṁ masālā vēsi 2 nimiṣālu vēyin̄cāli. Civarilō koṭṭimēra aakulu vēsukuni kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina tōṭakūra royyalu kūra siddam. Vēḍi vēḍi annanlōki tini cūḍaṇḍī malli malli tināli anipistundi. Tōṭakūra tinaḍaṁ valla manaṁ ārōgyaṅgā uṇḍēnduku kāvālsina pōṣakālu dorukutāyi. Raktahīnata unnavāriki tōṭakūra tinaḍaṁ cāla avasaraṁ. Endukaṇṭe adī rōganirōdhaka śaktini pen̄cutundi.Viṭamin e, viṭamin ke, viṭamin bi, poṭāṣiyaṁ samr̥d'dhigā uṇṭāyi. proṭīnlu samr̥d'dhigā uṇṭāyi. Ceḍu kolesṭrāl‌nu taggistundi. Kālṣiyaṁ samr̥d'dhigā uṇṭundi, mariyu sulabhaṅgā jīrṇaṁ avutundi. Royyalu baruvu taggaḍāniki sahāyapaḍutundi. Royyalu prōṭīn‌tō niṇḍi uṇṭāyi.Viṭaminlu& minarals yokka goppa mūlaṁ. Ī avasaramaina viṭaminlu mariyu khanijālatō niṇḍi unnāyi. Balamaina kaṇḍarālu& emukalanu nirmistundi. Guṇḍe ārōgyānni prōtsahistundi. Sambhāvyaṅgā kyānsar nivāristundi. 
రకం 2 | Rakaṁ 2:
ముందుగా ఒక పాన్ తీస్కుని అందులో కడిగిన రొయ్యలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి మీడియం మంట మీద ఆ పాన్ పెట్టి చిన్నగా రొయ్యలు ఊడించుకోవాలి. రొయ్యల నుండి నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం తగ్గే వరకు ఉడకనివ్వాలి. రొయ్యలు రంగు మారిన తరువాత నీరు లేనపుడు చూసి రొయ్యలు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడూ ఓక పాన్ తీస్కుని స్టవ్ మీద మీడియం మంటలో పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి వేడి అయ్యినా తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ఊడికి నా తరువాత అందులో టమోటా ముక్కలను వేసి వేయించాలి. తరువాత అందులో తోటకూర వేసి 2నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడూ ఊడికించి పక్కన పెట్టుకునే రొయ్యలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. చివరగా గరం మసాలా, కరివేపాకు, పొడీన ఆకులు వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ఆకులు చల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి తోటకూర రొయ్యలు కూర సిద్దంగా ఉందీ. అన్నంతో కలిపి వద్దించుకుని తిని చూడండి. మల్లి మల్లి చేస్కుని తింటారు.
Mundugā oka pān tīskuni andulō kaḍigina royyalu vēsukōvāli. Sṭav veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda ā pān peṭṭi cinnagā royyalu ūḍin̄cukōvāli. Royyala nuṇḍi nīru vastundi. Ā nīru mottaṁ taggē varaku uḍakanivvāli. Royyalu raṅgu mārina taruvāta nīru lēnapuḍu cūsi royyalu tīsi oka plēṭ lō peṭṭukōvāli. Ippuḍū ōka pān tīskuni sṭav mīda mīḍiyaṁ maṇṭalō peṭṭi vēḍi cēyāli. Andulō nūne vēsi vēḍi ayyinā taruvāta andulō ullipāya mukkalu vēsi vēyin̄cāli. Ullipāya ūḍiki nā taruvāta andulō ṭamōṭā mukkalanu vēsi vēyin̄cāli. Taruvāta andulō tōṭakūra vēsi 2nimiṣālu vēyin̄cukōvāli. Ippuḍu kon̄ceṁ pasupu, uppu, kāraṁ vēsi bāgā kalupukōvāli. Ippuḍū ūḍikin̄ci pakkana peṭṭukunē royyalu andulō vēsi bāgā kalupukōvāli. Ippuḍu allaṁ velli mudda vēsi pacci vāsana pōyē varaku vēyin̄cāli. Civaragā garaṁ masālā, poḍīna ākulu vēsi bāgā kalupukōvāli. 2 Nimiṣāla taruvāta sṭav āph cēsi koṭṭimīra aakulu calli gārniṣ cēsukōvāli. Antēnaṇḍi tōṭakūra royyalu kūra siddaṅgā undī. Annantō kalipi vaddin̄cukuni tini cūḍaṇḍi. Malli malli cēskuni tiṇṭāru.

Comments