ఉండ్రాలు, కుడుములు తయారీ విధానం | పప్పు ఉండ్రాళ్లు, కుడుములు ఇలా చేయండి | బెల్లం కుడుములు ఉండ్రాల్లు వంటకం | వినాయక చవితి ప్రసాదం రెసిపీ Uṇḍrālu, kuḍumulu tayārī vidhānaṁ | pappu uṇḍrāḷlu, kuḍumulu ilā cēyaṇḍi | bellaṁ kuḍumulu uṇḍrāllu vaṇṭakaṁ | vināyaka caviti prasādaṁ resipī

  

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • బియ్యం పిండి - 1 కప్పు | Biyyaṁ piṇḍi - 1 kappu
  • పాలు - 20 మి.లీ | pālu - 20 mi.Lī
పచ్చి ఉండ్రాళ్లు తాయారు చేసుకోవాలి అంటే ముందు బియ్యం పిండి తీస్కుని అందులో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడూ పిండిని ఒక ముద్దలా కలుపుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పాలు ఒక్కసారి పోస్తే పిండి పల్చగా ఐపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. చాలా తేలికగా పచ్చి ఉండ్రాళ్లు చేసి వినాయక చవితి రోజు వినాయకునికి పూజలో వినయోగించవచ్చు. ఈ పచ్చి ఉండ్రాళ్ళు అంటే వినాయకునికి ఇష్టము కాబట్టీ పూజలో నివేదన చెయ్యవచ్చు. లేదంటే పూజలో అక్షింతలు బదులుగా ఈ ఉండ్రాళ్లతో పూజ చేస్తారు.
pacci uṇḍrāḷlu tāyāru cēsukōvāli aṇṭē mundu biyyaṁ piṇḍi tīskuni andulō kon̄ceṁ kon̄ceṁ pālu pōsukuṇṭū kalupukōvāli. Ippuḍū piṇḍini oka muddalā kalupuni cinna cinna uṇḍalugā cēsukōvāli. Pālu okkasāri pōstē piṇḍi palcagā aipōtundi. Kabaṭṭi kon̄ceṁ kon̄ceṁ pōsukuṇṭū piṇḍi kalupukōvāli. Cālā tēlikagā pacci uṇḍrāḷlu cēsi vināyaka caviti rōju vināyakuniki pūjalō vinayōgin̄cavaccu. Ī pacci uṇḍrāḷḷu aṇṭē vināyakuniki isthāṁ kābaṭṭī pūjalō nivēdana ceyyavaccu. Lēdaṇṭē pūjalō akṣintalu badulugā ī uṇḍrāḷlatō pūja cēstāru.

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • బియ్యం పిండి - 500 గ్రా | biyyaṁ piṇḍi - 500 grā
  • బెల్లం - 500గ్రా | bellaṁ - 500grā
  • యాలుకలు - 10 | yālukalu - 10
  • సెనగపప్పు - 100గ్రా | senagapappu - 100grā
  • నెయ్యి - 50గ్రా | neyyi - 50grā
  • అవసరమైనంత నీరు | avasaramainanta nīru
 
ముందుగ పియ్యం తీస్కోవాలి. బియ్యం పిండి ఇంట్లో సిద్దం చేసుకోవాలి అంటే ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీరు వడకట్టి ఒక జల్లెడ (చిల్లుల గిన్నె) లేదు ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. తడి ఆరిపోయి బియ్యం కొంచెం పొడిగా ఉన్నపుడు మిక్సీ వేసుకుని పిండి జల్లించుకోవాలి. పిండి వేసుకునేప్పుడు అందులో నీళ్ళు వెయ్యకూడదు. పొడి పిండి వేసుకోవాలి. ఇప్పుడు పిండి జల్లించుకుంటే బరకలు లేకుండా చాలా మెత్తగా పిండి వస్తుంది. ఇప్పుడు పిండి ఒక పెద్ద ప్లేట్ లో పోసుకుని అరనివ్వాలి. మూట లేకుండా 6-8గంటలు ఆరనివ్వాలి. ఇప్పుడు పిండి ఎక్కువ నేలలు నిలువ ఉంటాయి.
Munduga piyyaṁ tīskōvāli. Biyyaṁ piṇḍi iṇṭlō siddaṁ cēsukōvāli aṇṭē mundugā biyyaṁ nānabeṭṭukōvāli. Ippuḍu nīru vaḍakaṭṭi oka jalleḍa (cillula ginne) lēdu oka guḍḍa mīda ārabeṭṭukōvāli. Taḍi āripōyi biyyaṁ kon̄ceṁ poḍigā unnapuḍu miksī vēsukuni piṇḍi jallin̄cukōvāli. Piṇḍi vēsukunēppuḍu andulō nīḷḷu veyyakūḍadu. Poḍi piṇḍi vēsukōvāli. Ippuḍu piṇḍi jallin̄cukuṇṭē barakalu lēkuṇḍā cālā mettagā piṇḍi vastundi. Ippuḍu piṇḍi oka pedda plēṭ lō pōsukuni aranivvāli. Mūṭa lēkuṇḍā 6-8gaṇṭalu āranivvāli. Ippuḍu piṇḍi ekkuva nēlalu niluva uṇṭāyi.
  
ముందుగ సెనగపప్పుని 4-6గంటలు నానబెట్టుకోవాలి.ఇప్పుడు ముందుగ పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నీళ్ళు పోసుకోవాలి. ఒక 300ml నీరు పోసుకుని, బెల్లము తురుము లేడా బెల్లము చితకొట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బెల్లం పాకం అయిన తరువాత అందులో యాలుకలపొడి, నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నీరు వడకట్టి కడిగి సెనగపప్పు వేసుకోవాలి. చివరిగా బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకు బియ్యం పిండి కొంచెం ఎక్కువ పట్టొచ్చు లేదు కొంచెం మిగిలి పోవచ్చు. మనం వాడిన బెల్లం బట్టి పిండి పడుతోంది. పిండి ఇలా గట్టిగ అయ్యెడాకా బియ్య పిండి వేసుకుని కలుపుకోవాలి. తరువాత పొయ్యి ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తరువాత చేతితో పిండిని గట్టిగా కలుపుకోవాలి.
Munduga senagapappuni 4-6gaṇṭalu nānabeṭṭukōvāli.Ippuḍu munduga poyyi veligin̄ci oka pān peṭṭi andulō nīḷḷu pōsukōvāli. Oka 300ml nīru pōsukuni, bellamu turumu lēḍā bellamu citakoṭṭi bāgā maraganivvāli. Ippuḍu bellaṁ pākaṁ ayina taruvāta andulō yālukalapoḍi, neyyi vēsukōvāli. Ippuḍu nīruvaḍakaṭṭi kaḍigi senagapappu vēsukōvāli. Civarigā biyyaṁ piṇḍi kon̄ceṁ kon̄ceṁ vēsukuṇṭū piṇḍi āpakuṇḍā kalupukuṇṭū uṇḍāli. Manaku biyyaṁ piṇḍi kon̄ceṁ ekkuva paṭṭoccu lēdu kon̄ceṁ migili pōvaccu. Manaṁ vāḍina bellaṁ baṭṭi piṇḍi paḍutōndi. Piṇḍi ilā gaṭṭiga iyyedākā biyya piṇḍi vēsukuni kalupukōvāli. Taruvāta poyyi āph cēsi pān pakkana peṭṭukōvāli. Kon̄ceṁ vēḍi taggina taruvāta cētitō piṇḍini gaṭṭigā kalupukōvāli.
  
ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నెయ్యి రాశి పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. కుడుములు కావాలి అనుకుంటే అదే పిండి ఇలా పల్చగా చేసుకోవాలి. కుడ్మూలైనా, ఉండ్రాళ్లు అయినా ఇడ్లీ ప్లేట్‌లో నెయ్యి రాశి పెట్టుకుని ఇడ్లీ పాన్‌లో 15నిమిషాలు ఉండకనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ పాన్ ఊడికైనా తరువాత విజిల్ వస్తుంది కాబట్టీ వెయిట్ చేయాల్సిన పని లేదు. 
Ippuḍu iḍlī plēṭlō neyyi rāśi piṇḍini cinna uṇḍalugā cēsukōvāli. Kuḍumulu kāvāli anukuṇṭē adē piṇḍi ilā palcagā cēsukōvāli. Kuḍmūlainā, uṇḍrāḷlu ayinā iḍlī plēṭ‌lō nīy rāsaka peṭṭukuni iḍlī pān‌lō 15nimiṣālu uṇḍakanivvāli. Ippuḍu iḍlī pān ūḍikainā taruvāta vijil vastundi kābaṭṭī veyiṭ cēyālsina pani lēdu. 

 

విజిల్ వచ్చాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. వెంటనే తియ్యకూడదు. ఇప్పుడు ఊడికైన తరువాత ఇలా రంగు మారి మంచి వాసన వస్తుంది. బాగ నిగ నిగలాడు బలే ఉంది చూడండీ. ఏమైన పచ్చిగా ఉంటే లోపల ఆవిరికి (ఆ వేదిక) ఊడికిపోతుంది. 
Vijil vachaka poyyi āph cēsukōvāli. Veṇṭanē tiyyakūḍadu. Ippuḍu ūḍikainā taruvāta ilā raṅgu māri man̄ci vāsana vastundi. Bāga niga nigalāḍu balē undi cūḍaṇḍī. Ēmaina paccigā uṇṭē lōpala āviriki (ā vēdika) ūḍikipōtundi.

 
మనం నెయ్యి రాసము కాబట్టి అంటుకోకుండా చక్కగా వస్తుంది.కాబట్టి ఒక 10 నిమిషాలు తరువాత ఓపెన్ చేసి చూసుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన ఉండ్రాళ్లు, కుడుములు సిద్దంగా ఉన్నాయి. వినాయకునికి ఈ ఉండ్రాళ్ళు కుడుములు చాల ఇష్టం అండీ.
Manaṁ neyyi rāsamu kābaṭṭi aṇṭukōkuṇḍā cakkagā vastundi. Kabātṭi oka 10 nimiṣālu taruvāta ōpen cēsi cūsukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina uṇḍrāḷlu, kuḍumulu siddaṅgā unnāyi. Vināyakuniki ī uṇḍrāḷḷu kuḍumulu cāla istāṁ andi. 
 
వినాయకచవితి తప్పకుండ నివేదన చేస్తారు. అంతేకాదండి చాలా రుచిగా ఉంటుంది. మద్యలో పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. తప్పకుండ ఈ రెసిపీ చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి.
Vināyakacaviti tappakuṇḍa nivēdana cēstāru. Antēkādaṇḍi cālā rucigā uṇṭundi. Madyalō pappulu tagulutū cālā bāguṇṭundi. Tappakuṇḍa ī resipī cēsi cūḍaṇḍi elā undō ceppaṇḍi.
 

Comments