వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి చూడండి | వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం | నిన్న రాత్రి అన్నం ఇలా చేసి చూడండీ అసలు వదలరు Vej phraiḍ rais ilā cēsi cūḍaṇḍi | vej phraiḍ rais tayārī vidhānaṁ | ninna rātri annaṁ ilā cēsi cūḍaṇḍī asalu vadalaru


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • ఉల్లిపాయ - 1 | Ullipāya - 1
 • బంగాళదుంప - 2 | baṅgāḷadumpa - 2
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • పచ్చిమిర్చి - 1 | paccimirci - 1
 • కారం - 2 స్పూన్లు | karam - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట - 1 స్పూన్ | allaṁ vellulli pasṭe - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • షాజీరా - 1 స్పూన్ | ṣājīrā - 1 spūn
 • బే ఆకు - 2 | bē āku - 2
 • అనస పుష్పం - 1 | anasa puṣpaṁ - 1
 • దాల్చిన చెక్క - 1 | dālcina cekka - 1
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • మిరియాలు - 3 | miriyālu - 3
 • యాలుకలు - 2 | yālukalu - 2
 • జాజి కాయ - 1 | Jāji kāya - 1
 • అన్నం - 2 కప్పులు | annaṁ - 2 kappulu
 • కరివేపాకు కొంచెం | Karivēpāku kon̄ceṁ
 • కొత్తిమీర కొంచెం | kottimīra kon̄ceṁ
  
ముందుగ పొయ్యి వెలిగించి ఒక కడాయి/పాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. తరువాత లవంగాలు, ఆనాస పువ్వు, బే ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలుకలు, జాజి కాయ వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో తరిగినా, ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిరపకాయ ముక్కలూ, టమాటా, బంగాళదుంప ముక్కలూ వేసి బాగా వేయించుకోవాలి. ముక్కలూ బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే దాక వేయాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
Munduga poyyi veligin̄ci oka kaḍāyi/pān peṭṭi vēḍi cēyāli. Andulō nūne vēsi vēḍi ceyyāli. Taruvāta lavaṅgālu, ānāsa puvvu, bē āku, dālcina cekka, miriyālu, yālukalu, jāji kāya vēsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta andulō tariginā, ullipāya mukkalū, paccimirapakāya mukkalū, ṭamāṭā, baṅgāḷadumpa mukkalū vēsi bāgā vēyin̄cukōvāli. Mukkalū bāgā vēgina taruvāta andulō allaṁ velli mudda vēsi paccivāsana pōyē dāka vēyāli. Ippuḍu uppu, pasupu vēsi bāgā kalupukōvāli.
  
తరువాత కారం, షాజీరా, కరివేపాకు వేసి 2నిమిషాలు కలుపుకుంటూ వేయాలి.ఇప్పుడు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగ ఉడికించిన అన్నం తీస్కుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా పట్టేలా బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్న అన్నం మీద కొంచెం కొత్తిమెర చల్లి స్టవ్ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టాలి. అంతేనండి ఏంటో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారుగా ఉంది. వేడి వేడిగా వడ్డించుకుని తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందు రోజు రాత్రి మిగిలిన అన్నం ఇలా చేసారంటే అందరు తప్పకుండ తింటారు. అన్నం కూడా వేస్ట్ అవ్వడు. తప్పకుండ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
Taruvāta kāraṁ, ṣājīrā, karivēpāku vēsi 2nimiṣālu kalupukuṇṭū vēyāli.Ippuḍu garaṁ masālā vēsi bāgā kalupukōvāli. Munduga ūdikinchina ānnamu tīskuni andulō vēsukuni bāgā kalupukōvāli. Uppu, kāraṁ, masālā paṭṭēlā bāgā kalupukuṇṭū 2 nimiṣālu vēyin̄cukōvāli. Vēḍi vēḍigā unna annaṁ mīda kon̄ceṁ kottimera calli sṭav āph cēsi pān tīsi pakkana peṭṭāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina phraiḍ rais tayārugā undi. Vēḍi vēḍigā vaḍḍin̄cukuni tinaṇḍi maḷḷī maḷḷī tinālanipistundi. Mundu rōju rātri migilina annaṁ ilā cēsāraṇṭē andaru tappakuṇḍa tiṇṭāru. Annaṁ kūḍā vēsṭ avvaḍu. Tappakuṇḍa ṭrai cēsi elā undō ceppaṇḍi.

Comments