అరటికాయ కూర తయరీ విధానం | పచ్చి అరటికాయతో ఇలా చేసి చూడండి | ఆరోగ్యకరమైన కూర అరటికాయ వంటకం Ārati kāya kūra tayarī vidhānaṁ | pacci araṭikāyatō ilā cēsi cūḍaṇḍi | ārōgyakaramaina kūra araṭikāya vaṇṭakaṁ

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • అరటికాయ - 2 | Araṭikāya - 2
  • ఆవలు - 1 స్పూను | āvalu - 1 spūnu
  • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
  • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
  • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
  • అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ - 1 స్పూన్ | allaṁ paccimirapakāya pēsṭ - 1 spūn
  • సెనగపప్పు - 1 స్పూన్ | senagapappu - 1 spūn
  • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
  • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
  • కారం - 1 స్పూన్ | kāraṁ - 1 spūn
 
అర‌టి కాయ‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అందులో పుష్క‌లంగా ఉంటే పొటాషియం బ్రెయిన్‌ను చురుగ్గా మారుస్తుంది.మ‌రియు మ‌తిమ‌రుపును నివారిస్తుంది.బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు అర‌టి కాయ‌తో త‌యారు చేసిన వంట‌ల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం. అరటి కాయను మన భోజనంలో వాడితే అతి ఆకలి తగ్గు ముఖం పడుతుంది.అదే స‌మ‌యంలో శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ఎముకల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్ట‌డంలోనూ అర‌టి కాయ స‌హాయ‌ప‌డుతుంది. అర‌టి కాయ‌ల్లో ఫైబ‌ర్ కంటెంట్, విటమిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది.అందు వ‌ల్ల‌, వీటిని డైట్‌లో చేర్చుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది
Ara‌ṭi kāya‌nu ḍaiṭ‌lō cērcukōva‌ḍaṁ va‌lla andulō puṣka‌laṅgā uṇṭē poṭāṣiyaṁ breyin‌nu curuggā mārustundi.Ma‌riyu ma‌tima‌rupunu nivāristundi.Ba‌ruvu ta‌ggāli ani bhāvin̄cē vāru ara‌ṭi kāya‌tō ta‌yāru cēsina vaṇṭa‌la‌nu tīsukōva‌ḍaṁ utta‌maṁ. Araṭi kāyanu mana bhōjananlō vāḍitē ati āka’li taggu mukhaṁ paḍutundi.Adē sa‌ma‌yanlō śa‌rīranlō pēruku pōyina kovvu kūḍā ka‌rugutundi. Emukala ba‌la‌hīna‌ta‌ku cek peṭṭa‌ḍanlōnū ara‌ṭi kāya sa‌hāya‌pa‌ḍutundi. Ara‌ṭi kāya‌llō phaiba‌r kaṇṭeṇṭ, viṭamin si sa‌mr̥d'dhigā uṇṭundi.Andu va‌lla‌, vīṭini ḍaiṭ‌lō cērcukuṇṭē ma‌la‌ba‌d'dha‌kaṁ sa‌ma‌sya dūraṁ avutundi
 
ముందుగ అరటికాయలు ఉడకబెట్టువాలి. కొంచెం నీరు పోసి కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు విజిల్ ఆరిన తరువాత అరటికాయలు పయిన తొక్క తీయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు అందులో సెనగపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకుని అందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఓక చెంచా అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.
Munduga araṭikāyalu uḍakabeṭṭuvāli. Kon̄ceṁ nīru pōsi kukkar lō 2 vijils vaccēdākā uḍakanivvāli. Ippuḍu vijil ārina taruvāta araṭikāyalu payina tokka tīyāli. Ippuḍu poyyi veligin̄ci pān peṭṭi andulō nūne pōsi vēḍi cēsukōvāli. Nūne vēḍi ayyinā taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cāli. Ippuḍu andulō senagapappu vēsi vēyin̄cāli. Taruvāta ullipāyani cinna mukkalugā kōsukuni andulō vēsukuni bāgā vēyin̄cukōvāli. Ippuḍu ōka cen̄cā allaṁ, paccimirapakāya pēsṭ vēsi bāgā vēyin̄cāli. Paccivāsana pōyē varaku vēyin̄cāli. Ippuḍu uppu, pasupu vēsi kalupukōvāli.
 
చివరిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా అరటికాయని చిన్న ముక్కలుగా కోసి అందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన అరటికాయ కూర సిద్దంగా ఉంది. నోటికి రుచిగా చాల బాగుంటుంది. తప్పకుండ వండి ఎలా ఉందో చెప్పండి. చివరిలో ఒక చెక్క నిమ్మ రసం వేస్తే చాలా బాగుంటుంది అండీ. నిమ్మకాయ రసం తప్పకుండ వెయ్యాలి అని ఏమి లేదు అండీ. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోయిన బాగుంటుంది.
Civarigā uḍakabeṭṭi pakkana peṭṭukunnā araṭikāyani cinna mukkalugā kōsi andulō vēsukuni bāgā vēyin̄cukōvāli. Civaragā kon̄ceṁ karivēpāku, kāraṁ vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina araṭikāya kūra siddaṅgā undi. Nōṭiki rucigā cāla bāguṇṭundi. Tappakuṇḍa vaṇḍi elā undō ceppaṇḍi. Civarilō oka cekka nim'ma rasaṁ vēstē cālā bāguṇṭundi aṇḍī. Nim'makāya rasaṁ tappakuṇḍa veyyāli ani ēmi lēdu aṇḍī. Mīku naccitē vēsukōṇḍi. Lēkapōyina bāguṇṭundi.

Comments