బీరకాయ కూర తయారీ విధానం | బీరకాయతో ఇలా కూర చేసి చూడండి | రుచికరమైన బీరకాయ కూర వంటకం | Bīrakāya kūra tayārī vidhānaṁ | | bīrakāyatō ilā kūra cēsi cūḍaṇḍi | rucikaramaina bīrakāya kūra vaṇṭakaṁ


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • బీరకాయ - 500 గ్రా | Bīrakāya - 500 grā
 • అవాలు  - 1 చెంచా | āvalu - 1 cen̄cā
 • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
 • సెనగపప్పు - 1 స్పూన్ | senagapappu - 1 spūn
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • పసుపు - 1 చెంచా | pasupu - 1 cen̄cā
 • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • ధనియాలు - 2 స్పూన్లు | dhaniyālu - 2 spūnlu
 • ఎండు మిరపకాయలు - 5 | eṇḍu mirapakāyalu - 5
 • తాజా కొబ్బరి - 50 గ్రా | tājā kobbari - 50 grā
 • నువ్వులు - 2 స్పూన్లు | nuvvulu - 2 spūnlu
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • వెల్లుల్లిపాయ రెమ్మలు - 6 | vellullipāya rem'malu - 6
  
ముందుగ బీరకాయ పొట్టు తీసి బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. ఈ లోపు ఒక చిన్న పాన్ తీస్కుని అందులో ధనియాలు వేయించుకోవాలి. తరువాత నువ్వులు కూడా కొద్దిగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. ధనియాలు, నువ్వులు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ధనియాలు, నువ్వులు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టుకుని ఇప్పుడు జార్లో తాజా కొబ్బరి ముక్కల వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ బాగా ఊడికిన తరువాత అందులో బీరకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు (1/2 స్పూన్) వేస్తే బాగా నీరు వచ్చి కూర మెత్తగా మగ్గిపోతుంది. ఇపుడు పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. రుచి చూసి కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. బీరకాయ మగ్గి పోయి కొంచెం కూర అవుతుంది. అందుకే మనం ఉప్పు, కారం చివరిలో వేసుకోవడం వల్ల రుచికి సరిపడా ఉంటుంది. కూర మగ్గి నూనె బయటికి వస్తున్నా సమయంలో ముందుగా రుబ్బి పక్కన పెట్టుకునే ధనియాలు పొడి, కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యిన తర్వాత అందులో కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ దించె ముందు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన బీర్కాయ కూర సిద్దంగా ఉంది. వేడి వేడి అన్నంలో తిని చూడండీ రోజు కన్నా ఒక ముద్ద ఎక్కువ తింటారు. వెల్లులి వేయడం వల్ల మాంచి వాసన వస్తుంది. బీరకాయ అంటే ఇస్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి బాగా నచ్చుతుంది. తప్పకుండ చేసి ఎలా ఉందో చెపండి.
munduga bīrakāya poṭṭu tīsi bāgā kaḍigi cinna mukkalugā kōsukoni pakkana peṭṭukōvāli. Oka ullipāya cinna mukkalugā tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pān peṭṭi andulō nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍi ayyinā taruvāta andulō āvālu, jīlakarra, senagapappu vēsi bāgā vēyin̄cāli. Ippuḍu ullipāya mukkalu vēsi bāgā kalupukuni vēyin̄cukōvāli. Ī lōpu oka cinna pān tīskuni andulō dhaniyālu vēyin̄cukōvāli. Taruvāta nuvvulu kūḍā koddigā vēyin̄cukōvāli. Man̄ci vāsana vastundi. Dhaniyālu, nuvvulu callāranivvāli. Ippuḍu oka jār lō vēyin̄cina dhaniyālu, nuvvulu, eṇḍu mirapakāyalu, vellulli rem'malu vēsi mettagā poḍi paṭṭukōvāli. Ā poḍini pakkana peṭṭukuni ippuḍu jar lō tājā kobbari mukkala vēsi mettagā pēsṭ lāgā paṭṭukuni pakkana peṭṭukōvāli. Ullipāya bāgā ūdikina taruvāta andulō bīrakāya mukkalu vēsukuni bāgā magganivvāli. Kon̄ceṁ uppu (1/2 spūn) vēstē bāgā nīru vacci kūra mettagā maggipōtundi. Ipuḍu pasupu, kāraṁ vēsi bāgā kalupukōvāli. Ruci cūsi kāvālaṇṭē kon̄ceṁ uppu kūḍā vēsukōvaccu. Bīrakāya maggi pōyi kon̄ceṁ kūra avutundi. Andukē manaṁ uppu, kāraṁ civarilō vēsukōvaḍaṁ valla ruciki saripaḍā uṇṭundi. Kūra maggi nunē bayaṭiki vastuna samayanlō mundugā rubbi pakkana peṭṭukunē dhaniyālu poḍi, kobbari vēsi bāgā kalupukōvāli. Kon̄ceṁ phrai ayyina tarvāta andulō karivēpāku vēsi bāgā kalupukōvāli. Civaragā sṭav āph cēsi pyān din̄cemundu kottimīra vēsi gārniṣ cēsukōvāli. Antēnaṇḍi entō rucikaramaina bīrkāya kūra siddaṅgā undi. Vēḍi vēḍi annanlō tini cūḍaṇḍī rōju kannā oka mudda ekkuva tiṇṭāru. Velluli vēyaḍaṁ valla man̄chē vāsana vastundi. Bīrakāya aṇṭē isṭaṁ lēni vāḷḷaki ilā cēsi peṭṭaṇḍi bāgā naccutundi. Tappakuṇḍa cēsi elā undō cepaṇḍi.

Comments