చికెన్ బిర్యానీ తయారీ విధానం | చికెన్ బిర్యానీ ఇలా చేసి చూడండి | రుచికరమైన చికెన్ బిర్యానీ | కోడి బిర్యానీ | చికెన్ బిర్యానీ రిసిపి | చికెన్ బిర్యానీ చేయడం ఎలా | బెస్ట్ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ | ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ రిసిపి | సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ Ciken biryānī tayārī vidhānaṁ | ciken biryānī ilā cēsi cūḍaṇḍi | rucikaramaina ciken biryānī | kōḍi biryānī | ciken biryānī risipi | ciken biryānī cēyaḍaṁ elā | besṭ hōm mēḍ ciken biryānī | preṣar kukkar ciken biryānī risipi | simpul aṇḍ ṭēsṭī ciken biryānī


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • నూనె - 5 స్పూన్లు | Nūne - 5 spūnlu
 • బాస్మతి బియ్యం - 1 కిలోలు | bāsmati biyyaṁ - 1 kilōlu
 • చికెన్ - 500 గ్రా | ciken - 500 grā
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • జీడిపప్పు - 10 | jīḍipappu - 10
 • పసుపు - 2 స్పూన్లు | pasupu - 2 spūnlu
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం పొడి - 3-4 స్పూన్లు | kāraṁ poḍi - 3-4 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
 • గరం మసాలా - 2 స్పూన్లు | garaṁ masālā - 2 spūnlu
 • పెరుగు/పెరుగు - 2 స్పూన్లు | perugu/perugu - 2 spūnlu
 • అనాస పువ్వు - 1 | anāsa puvvu - 1
 • నల్ల యాలుకలు - 1 | nalla yālukalu - 1
 • నల్ల మిరియాలు - 5 | nalla miriyālu - 5
 • జాపత్రి/జాపత్రి - 1 | jāpatri/jāpatri - 1
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • దాల్చిన చెక్క - 2 |  dālcina cekka - 2
 • యాలుకలు - 2 | yālukalu - 2
 • నట్ మెగ్ / జాజికాయ - 1 | naṭ meg/ jājikāya - 1
 • కపోక్ బడ్స్ / మరాఠీ మొగ్గు - 1 | kapōk baḍs/ marāṭhī moggu - 1
 • బే ఆకు - 2 | bē āku - 2
 • షాజీరా - 1 స్పూన్ | ṣājīrā - 1 spūn
 • ఒక చిటికెడు కుంకుమపువ్వు | oka ciṭikeḍu kuṅkumapuvvu
 • ఆవు నెయ్యి - 3 స్పూన్లు | āvu neyyi - 3 spūnlu
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 • పుదీనా కొన్ని ఆకులు | pudīnā konni ākulu
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 
ముందుగ ఒక గిన్నెలో చికెన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లి ముద్ద, గరమ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుని మూట పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి (ఒక 30నిమిషాలు మారినేట్ చేసుకోవాలి). అలాగే బాస్మతి బియ్యంలో నీరు పోసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నీరు లేకుండ ఉట్టిగా కడిగిన బియ్యం పక్కన పెట్టుకోవాలి (చిల్లుల గిన్నెలో వేసి నీరు వడకట్టుకోవచ్చు ).
Munduga oka ginnelō ciken tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Andulō uppu, kāraṁ, pasupu, perugu, allaṁ velli mudda, garama masālā vēsukuni bāgā kalupukōvāli. Mukkalaku bāgā paṭṭēlā kalupukuni mūṭa peṭṭi phrij lō peṭṭukōvāli (oka 30nimiṣālu mārinēṭ cēsukōvāli). Alāgē bāsmati biyyanlō nīru pōsi bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Nīru lēkuṇḍa uṭṭigā kaḍigina biyyaṁ pakkana peṭṭukōvāli (cillula ginnelō vēsi nīru vaḍakaṭṭu kōvaccu).
 
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 1 చెంచా నెయ్యి వేసి వేడి అయ్యిన తరువాత అందులో జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి / కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి ఓక ఉల్లిపాయ సన్నగ చిలికలుగ తరుగుకుని అవి నునే లో వేయించుకోవాలి. బాగా ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తరువాత వేయించిన ఉల్లిపాయను తీసి వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయి / కుక్కర్ లో నునే వేసుకుని వేడి అయ్యిన తర్వాత అందులో ఆనాస పువ్వు, నల్ల యాలుకలు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు,నల్ల మిరియాలు, జాజికాయ, మరాఠీ మొగ్గు, బే ఆకు వేసి వేయించాలి. అందులో తరిగిన పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. బాగా వేపుడు అయ్యిన తరువాత అందులో టొమాటో ముక్కలూ వేసి మెత్తగా ఊడికించుకోవాలి. 
Ippuḍu oka pān tīsukuni andulō 1 cen̄cā neyyi vēsi vēḍi ayyina taruvāta andulō jīḍipappu vēsi vēyin̄cāli. Jīḍi pappu vēgina tarvāta tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu oka kaḍāyi/ kukkar peṭṭi sṭav veligin̄ci ōka ullipāya sannaga cilikaluga tarugukuni avi nunē lō vēyin̄cukōvāli. Bāgā muduru gōdhuma raṅgu vaccēdākā vēyin̄cukōvāli. Taruvāta vēyin̄cina ullipāya nu tīsi vērē plēṭ lō peṭṭukōvāli. Ippuḍu adē kaḍāyi/ kukkar lō nunē vēsukuni vēḍi ayyina tarvāta andulō ānāsa puvvu, nalla yālukalu, nalla miriyalu, jāpatri, lavaṅgālu, dālcina cekka, yālukalu, jājikāya, marāṭhī moggu, bē āku vēsi vēyin̄cāli. Andulō tarigina paccimirapakāya, ullipāya mukkalu vēsi vēyin̄cukōvāli. Bāgā vēpuḍu ayyina taruvāta andulō ṭomāṭō mukkalū vēsi mettagā ūḍikin̄cukōvāli. 
  
ఇప్పుడు అందులో మేరినేట్ చేసిన చికెన్ వేసి ఊడికించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కడిగి పక్కన పెట్టిన బాస్మతి బియ్యం , కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఓకా 2నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు బియ్యంలో నీరు పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యంకి(1 గ్లాసు), ఒకటిం పావు (1 గ్లాసు) + 1/4 (పావు గాజు) నీరు పోసుకోవాలి. బియ్యం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
Ippuḍu andulō mērinēṭ cēsina ciken vēsi ūḍikin̄cukōvāli. Pacci vāsana pōyēdākā uḍakanivvāli. Ippuḍu andulō kaḍigi pakkana peṭṭina bāsmati biyyaṁ, karivēpāku vēsi kalupukōvāli. Ōkā 2nimiṣālu vēyin̄cukōvāli. Ippuḍu biyyanlō nīru pōsukōvāli. Oka glāsu biyyaṅki(1 glāsu), okaṭiṁ pāvu (1 glāsu) + 1/4 (pāvu gāju) nīru pōsukōvāli. Biyyaṁ moṭṭaṁ bāgā kalisēlā kalupukōvāli.
 
రుచి చూసుకుని ఉప్పు సరిపడ వేసుకోవాలి. కొంచెం షాజీరా, పొడిన ఆకులు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. పైనా మూట పెట్టుకుని ఒక 40-50 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మద్యలో ఒక (30నిమిషాలు) తర్వాత నీరు తగ్గాక బియ్యం ఉడుకుతున్న సమయంలో ఒక్కసారి మూత తీసి కొంచెం నెయ్యి వేసి, కుంకుమ పువ్వు, వేయి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. మరల మూత పెట్టేయాలి. 
Ruci cūsukuni uppu saripaḍa vēsukōvāli. Kon̄ceṁ ṣājīrā, poḍina ākulu, kottimīra vēsukuni bāgā kalupukōvāli. Painā mūṭa peṭṭukuni oka 40-50 nimiṣālu mīḍiyaṁ maṇṭa mīda uḍakanivvāli. Madyalō oka (30nimiṣālu) tarvāta nīru taggāka biyyaṁ uḍukutunna samayanlō okkasāri mūta tīsi kon̄ceṁ neyyi vēsi, kuṅkuma puvvu, vēyi pakkana peṭṭukunna ullipāya vēsukōvāli. Marala mūta peṭṭēyāli.  
 
చివరిలో కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేయించిన జీడిపప్పు వేసి అలంకరించి 2నిమిషాలు మూట పెట్టుకుని పోయ్యి ఆఫ్ చేసుకోవాలి. అంతేనా ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ సిద్దమగా ఉంది. రుచి చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఏలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా కలర్ ఫుల్ గా మంచి వాసనతో చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా చేసారంటే మల్లీ మల్లీ చేసుకుంటారు.
Civarilō kon̄ceṁ kottimīra, pudīnā ākulu, vēyin̄cina jīḍipappu vēsi alaṅkarin̄ci 2nimiṣālu mūṭa peṭṭukuni pōyyi āph cēsukōvāli. Antēnā ghumaghumalāḍē ciken biryānī siddamagā undi. Ruci cēsi elā vaccindō ceppaṇḍi. Ēlāṇṭi phuḍ kalars vāḍakuṇḍā cālā kalar phul gā man̄ci vāsanatō ciken biryānī iṇṭlōnē cēsukōvaccu ilā cēsāraṇṭē mallī mallī cēsukuṇṭāru.

చిట్కాలు | Ciṭkālu::
1. కుక్కర్లో బిర్యానీ చేసుకోవాలి అనుకునేవారు పైనా చప్పిన విధముగా చేసుకొని కడైలో బియ్యము నీరు పోసుకునే దాక చేసుకొని తరువాత ఆ మిశ్రమాన్ని కుక్కర్ లోకి వేసుకోవాలి. మల్లె తరువాత కుదరదు కబత్తి కొత్తిమీర, పుదీనా ఆకులు, నెయ్యి, వేయించిన ఉల్లిపాయ వేసుకుని చూకర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా ఉండి తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఆవిరి తగ్గిన తరువత తీస్తే బియ్యము, ముక్కలు సరిపడ ఉడుకుతాయి. ముందుగ తీస్తే పచ్చిగాఉండే అవకాశం ఉంది. చివరిలో కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోండి. కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు గార్నిష్ చేసుకునేందుకు 2నిమిషాలు మూత పెట్టుకోవాలి. వద్దించుకునేపుడు బిర్యానీ పైనుంచి కిందవరకు కలిపి వడ్డించుకోండి. ఇలా చెయ్యడం వల్ల కొత్తిమీర, పుదీనా ఆకులు పచ్చిగా ఉండడు. మగ్గిపోతుంది. కాస్త ఉన్నా చికెన్, మసాలా అన్నీ రుచులు కలుపుతాయి. చాల రుచిగా ఉంటుంది.
1. Kukkarlō biryānī cēsukōvāli anukunēvāru painā cappina vidhamugā cēsukoni kaḍailō biyyamu nīru pōsukunē dāka cēsukoni taruvāta ā miśramānni kukkar lōki vēsukōvāli. Malle taruvāta kudaradu kabatti kottimīra, pudīnā ākulu, neyyi, vēyin̄cina ullipāya vēsukuni cūkar mūta peṭṭukōvāli. Ippuḍu 3 vijils vaccēdākā uṇḍi taruvāta pūrtigā callāranivvāli. Āviri taggina taruvata tīstē biyyamu, mukkalu saripaḍa uḍukutāyi. Munduga tīstē paccigā'uṇḍē avakāśaṁ undi. Civarilō kāvālaṇṭē kon̄ceṁ neyyi vēsukōṇḍi. Kottimīra ākulu, pudīnā ākulu gārniṣ cēsukunēnduku 2nimiṣālu mūta peṭṭukōvāli. Vaddin̄cukunēpuḍu biryānī painun̄ci kindavaraku kalipi vaḍḍin̄cukōṇḍi. Ilā ceyyaḍaṁ valla kottimīra, pudīnā ākulu paccigā uṇḍaḍu. Maggipōtundi. Kāsta unnā ciken, masālā annī ruculu kaluputāyi. Cāla rucigā uṇṭundi.

2.బియ్యం 250gm కి 1 స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. అప్పుడూ బిర్యానీలో చికెన్ మరియూ బాస్మతి బియ్యానికి సరిపోతుంది. మీరు వాడే ఉప్పు బ్రాండ్ని బట్టి లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు.
biyyaṁ 250Gm ki 1 spūn uppu vēsukōvaccu. Appuḍū biryānīlō ciken mariyū bāsmati biyyāniki saripōtundi. Mīru vāḍē uppu brāṇḍni baṭṭi lēdā mī ruciki saripaḍā uppu vēsukōvaccu.

3.మనం బిర్యానీలో ఉప్పు వేసినపుడు అన్నం కి కూడా కలిపి వెయ్యాలి. ఒక వేళ ఉప్పు ఎక్కువైతే ఓకా సగం స్లైస్ నిమ్మరసం రైస్లో చేర్చండి సరిపోతుంది.
Manaṁ biryānīlō uppu vēsinapuḍu annaṁ ki kūḍā kalipi veyyāli. Oka vēḷa uppu ekkuvaitē ōkā sagaṁ slais nim'marasaṁ raislō cērcaṇḍi saripōtundi.

4.బిర్యానీ చేసుకునే ఒక గంట ముందు బాస్మతి బియ్యము కడిగి నీరు వడకడితే బిర్యానీ చాలా బాగా వస్తుంది.
Biryānī cēsukunē oka gaṇṭa mundu bāsmati biyyamu kaḍigi nīru vaḍakaḍitē biryānī cālā bāgā vastundi.

Comments