దొండకాయ కూర తయారీ విధానం | Doṇḍakāya kūra tayārī vidhānaṁ | దొండకాయతో ఇలా కూర చేసి చూడండి | Doṇḍakāyatō ilā kūra cēsi cūḍaṇḍi


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • దొండకాయలు - 250గ్రా | Doṇḍakāyalu - 250grā
 • కొబ్బరి - 60 గ్రా | kobbari - 60 grā
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • వేరుశెనగగుల్లు - 30 గ్రా | vēruśenaga gullu - 30 grā
 • సెనగపప్పు - 2 స్పూన్లు | senagapappu - 2 spūnlu
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • ఎర్ర మిరపకాయలు - 3 | erra mirapakāyalu - 3
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
ముందుగ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు చిన్న ముక్కలూగ కోసుకున్నా దొండకాయలు వేసుకుని బాగా వేపుడు చేసుకోవాలి.
munduga poyyi veligin̄ci pān peṭṭi andulō nūne vēsi vēḍi cēsukōvāli. Ippuḍu andulō āvālu, jīlakarra, senagapappu vēsi vēyin̄cāli. Taruvāta sannaga tarigina ullipāya mukkalu vēsi bāgā vēyin̄cāli. Ippuḍu cinna mukkalūga kōsukunnā doṇḍakāyalu vēsukuni bāgā vēpuḍu cēsukōvāli.
  
ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడి అయ్యిన తరువాత సెనగపప్పు, వేరుసెనగగుల్లు వేసి వేయించాలి. బాగా వేపుడు అయ్యినా తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకా మిక్సీ జార్ లో కొబ్బరి, ఎండు మిరపకాయలు వేసి మెత్తగా పొడి లాగా పట్టుకోవాలి. దొండకాయ ముక్కలూ బాగా వేగిన తరువాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించాలి. చివరగా కొబ్బరి పొడిని వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. కొబ్బరి వేశాక కూర లో ఉప్పు సరిపోక పోవచ్చు. ఉప్పు సరిపోకపోతే రుచి చూసి కొంచెం వేసుకోండి. తరువాత వేయించి పక్కన పెట్టుకునే సెనగపప్పు, వేరుసెనగగుళ్లు వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి అలంకరించండి. అంతేనండి ఎంతో రుచికరమైన మరియూ ఆరోగ్యమైన దొండకాయ కూర సిద్దంగా ఉందీ.
ippuḍu iṅkō pān peṭṭi andulō kon̄ceṁ nūne vēsi vēḍi ayyinā taruvāta senagapappu, vērusenagagullu vēsi vēyin̄cāli. Bāgā vēpuḍu ayyinā taruvāta tīsi pakkana peṭṭukōvāli. Ōkā miksī jār lō kobbari, eṇḍu mirapakāyalu vēsi mettagā poḍi lāgā paṭṭukōvāli. Doṇḍakāya mukkalū bāgā vēgina taruvāta andulō kon̄ceṁ uppu, kāraṁ, pasupu vēsi vēyin̄cāli. Ippuḍē kon̄ceṁ karivēpāku vēsi bāgā vēyin̄cāli. Civaragā kobbari poḍini vēsi bāgā kalupukuni vēyin̄cukōvāli. Kobbari vēśāka kūra lō uppu saripōka pōvaccu. Uppu saripōkapōtē ruci cūsi kon̄ceṁ vēsukōṇḍi. Taruvāta vēyin̄ci pakkana peṭṭukunē senagapappu, vērusenagaguḷlu vēsi kalupukōvāli. Civarigā kottimīra vēsi alaṅkarin̄caṇḍi. Antēnaṇḍi ēṇṭō rucikaramaina mariyū ārōgyamaina doṇḍakāya kūra siddaṅgā undī.

Comments