గోంగూర పచ్చడి తయారీ విధానం | గోంగూర పచ్చడి ఎలా చెయ్యాలి | గోంగూర పచ్చడి వంటకం Gōṅgūra paccaḍi tayārī vidhānaṁ | gōṅgūra paccaḍi elā ceyyāli | gōṅgūra paccaḍi vaṇṭakaṁ ​


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • గోంగూర - 250gm | Gōṅgūra - 250gm
 • పచ్చి మిరపకాయలు - 2 | pacci mirapakāyalu - 2
 • ధనియాలు - 3 స్పూన్లుdhaniyālu - 3
 • మెంతులు - 1/2 స్పూను | Mentulu - 1/2 spūnu
 • ఎర్ర ఎండు మిరపకాయలు - 10 | erra eṇḍu mirapakāyalu - 10
 • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
 • నువ్వులు - 2 స్పూన్లు (ఐచ్ఛికం) | Nuvvulu - 2 spūnlu (aicchikaṁ)
 • వెల్లుల్లి రెమ్మలు - 10 | vellulli rem'malu - 10
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • సెనగపప్పు - 1 స్పూన్ | Senagapappu - 1 spūn
 • ఉల్లిపాయ - 1 (ఐచ్ఛికం) | ullipāya - 1 (aicchikaṁ)
  
ముందుగ గోంగూర బాగా కడిగి ఆకలు తెంపి పక్కన అరబెట్టుకోవాలి. ఈలోపు ఒక పాన్ తీస్కుని పొయ్యి వెలిగించి వేడి చేసుకోవాలి. వేడి అయ్యిన తరువాత అందులో ధనియాలు, మెంతులు వేసి వేయించాలి. ఫ్రై అయ్యిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు ఓక 2నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మాడిపోకుండా ముందే చూసుకుని మిరపకాయలు తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. త్వరగా మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించకూడదు. ఇప్పుడు అదే పాన్ లో జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇష్టం ఉన్నా వారు నువ్వులు కుడా వేయించుకుని వేసుకొనవచ్చు. నువ్వులు తింటే కాల్షియం బాగుంటుంది. నువ్వులు అంటే ఇష్టం లేని వారికి తినిపించాలి అంటే ఇలా వాడక తప్పదు. అంతేకాదండి గోంగూర చాల పుల్లగా ఉంటుంది. నువ్వులు వేసుకోడం వల్ల ఆ పులుపు కొంచెం తగ్గుతుంది. ఇష్టం లేని వారు నువ్వులు వెయ్యకండి. వేయించుకున్నా జీలకర్ర, నువ్వులు తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో గోంగూర, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. గోంగూర లో నుండి నీరు వచ్చి చాలా కొంచెం అవుతుంది. నీరు తగ్గిపోయి ఆకులు మెత్తగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. 
Munduga gōṅgūra bāgā kaḍigi ākalu tempi pakkana arabeṭṭukōvāli. Īlōpu oka pan tīskuni poyyi veligin̄ci vēḍi cēsukōvāli. Veḍi ayyina taruvāta andulō dhaniyālu, mentulu vēsi vēyin̄cāli. Phrai ayyinā taruvāta oka plēṭ loki tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu yendu mirapakāyalu ōka 2nimiṣālu phrai cēsukoni tīsi pakkana peṭṭukōvāli. Māḍipōkuṇḍā mundē cūsukuni mirapakāyalu tīsi plēṭ‌lō peṭṭukōvāli. Tvaragā māḍipōtāyi kābaṭṭi ekkuvasēpu vēyiṁ cakūḍadu. Ippuḍu adē pān lō jīlakarra vēsukuni vēyin̄cukōvāli. Iṣṭaṁ unnā vāru nuvvulu kuḍā vēyin̄cukuni vēsukonavaccu. Nuvvulu tiṇṭē kālṣiyaṁ bāguṇṭundi. Nuvvulu aṇṭē iṣṭaṁ lēni vāriki tinipin̄cāli aṇṭē ilā vāḍaka tappadu. Antēkādaṇḍi gōṅgūra cāla pullagā uṇṭundi. Nuvvulu vēsukōḍaṁ valla ā pulupu kon̄ceṁ taggutundi. Iṣṭaṁ lēni vāru nuvvulu veyyakaṇḍi. Vēyin̄cukunnā  jīlakarra, nuvvulu tīsi pakkana peṭṭukuni callāranivvāli. Ippuḍu oka kaḍāyilō gōṅgūra, pacci mirapakāyalu vēsi vēyin̄cāli. Gōṅgūra lō nuṇḍi nīru vacci cālā kon̄ceṁ avutundi. Nīru taggipōyi ākulu mettagā vēgina tarvāta tīsi pakkana peṭṭukuni callāranivvāli. 
 
ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు వేయించి పక్కన పెట్టిన ధనియాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెమ్మలు (8) వేసి మెత్తగ పొడి పట్టుకోవాలి. గుర్తుంచుకోండి ఇవి వేడిగా వేస్తే మెత్తగా పొడి అవ్వదు. ఇలా అయ్యిన తరువాత అందులో గోంగూర, పచ్చి మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. మీకు మెత్తగా తినడం ఇష్టం అయ్యితే రెండు సార్లు రుబ్బుకోండి.
Ī lōpu oka miksī jār tīsukuni mundu vēyinchi pakkana peṭṭina dhaniyālu, mentulu, eṇḍu mirapakāyalu, jīlakarra, nuvvulu, vellulli rem'malu (8) vēsi meṭṭagā poḍi paṭṭukōvāli. Gurtun̄cukōṇḍi ivi vēdi gā vēstē mettagā poḍi avvadu. Ilā ayyina taruvāta andulō gōṅgūra, pacci mirapakāyalu, ruciki saripaḍā uppu vēsi okkasāri miksī vēsukōvāli. Mīku mettagā tinaḍaṁ iṣṭaṁ ayyitē reṇḍu sārlu rubbukōṇḍi. 
  
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో జీలకర్ర, కరివేపాకు, సెనగపప్పు వేసి వేయించాలి. రెండు వెళ్ళుల్లి రెమ్మలు కూడా చిదిమి అందులో వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు తాలింపులో గోంగూర పచ్చడి వేసుకుని బాగా కలుపుకోవాలి. పోయ్యి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అందులో సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని వద్దించుకోవాలి. అంతేనండి చాలా రుచిగా, మంచి వాసనతో ఎపుడు తింటామా అని నోరు ఊరుతుంది. వేడి వేడి అన్నం లోకి కొంచెం నెయ్యి వేసి, గోంగూర పచ్చడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండ సిద్దం చేసి ఎలా ఉందో చెప్పడం మార్చేపో కండీ.
Ippuḍu poyyi mīda kaḍāyi peṭṭi andulō nūne vēsi vēḍi cēsukōvāli. Nūne vēḍi ayyinā taruvāta andulō jīlakarra, karivēpāku, senagapappu vēsi vēyin̄cāli. Reṇḍu veḷḷulli rem'malu kūḍā cidimi andulō vēsukōvāli. Man̄ci suvāsana vastundi. Ippuḍu tālimpulō gōṅgūra paccaḍi vēsukuni bāgā kalupukōvāli. Pōyyi āph cēsi callārina tarvāta andulō sannaga tarigina ullipāya mukkalu vēsi bāgā kalupukuni vaddin̄cukōvāli. Antēnaṇḍi cālā rucigā, man̄ci vāsanatō epuḍu tiṇṭāmā ani nōru ūrutundi. Vēḍi vēḍi annaṁ lōki kon̄ceṁ neyyi vēsi gōṅgūra paccaḍi vēsukuṇṭē cāla cāla bāguṇṭundi. Tappakuṇḍa siddaṁ cēsi elā undō ceppaḍaṁ mārcēpō kaṇḍī.

Comments