గుడ్డు కూర ఇలా చేసి చూడండి | గుడ్డు భుర్జీ తయారీ విధానం | కోడి గుడ్డుతో కూర వంటకం Guḍḍu kūra ilā cēsi cūḍaṇḍi | guḍḍu bhurjī tayārī vidhānaṁ | kōḍi guḍḍutō kūra vaṇṭakaṁ


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • గుడ్లు - 3 | guḍlu - 3
 • టమోటా - 2 | ṭamōṭā - 2
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • పచ్చిమిరపకాయలు - 2 | paccimirapakāyalu - 2
 • ఉప్పు రుచికి సరిపడ | uppu ruciki saripaḍa
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
  
ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టి మాధ్యమం/చిన్నా మంట మీద వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వెది అయ్యిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగ తర్గిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ మద్యలోకి కోసి ముక్కలు వేసి పచ్చి వాసన పోయే దాక వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయకి ఉప్పు, కారం బాగా కలిపిన తరువాత అందులో కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయే దాక వేయించుకోవాలి. ఈలోపు టొమాటోని ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు
అందులో టమోటా పేస్ట్ వేసి బాగా వేపుడు చేసుకోవాలి. టమోటా నీరు తగ్గి కూర చిక్కబడి ఎరుపు రంగు వస్తుంది.
Mundugā oka kaḍāyi poyyi mīda peṭṭi mādhyamaṁ/cinnā maṇṭa mīda vēḍi cēsukōvāli. Ippuḍu nūne vēsi vēḍi cēsukōvāli. Nūne vedi ayyina tarvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cāli. Ippuḍu sannaga targina ullipāya mukkalu, Paccimirapakāya madyalōki kōsi mukkalu vēsi pacci vāsana pōyē dāka vēyiṁ cukōvāli. Ullipāya mukkalu bāgā vēgina taruvāta andulō kon̄ceṁ uppu, pasupu, kāraṁ vēsi bāgā kalupukōvāli. Ullipāya ki uppu, kāraṁ bāgā kalipina taruvāta andulō karivēpāku, allanvellulli pēsṭ vēsi bāgā vēyin̄cāli. Pacci vāsana pōyē dāka vēyin̄cukōvāli. Īlōpu ṭomāṭōni mukkalugā kōsukoni miksī jārlō vēsi pēsṭ lāgā paṭṭukōvāli. Ippuḍu andulō ṭamōṭā pēsṭ vesi bāgā vēpuḍu cēsukōvāli. Ṭamōṭā nīru taggi kūra cikkabaḍi erupu raṅgu vastundi.
 
టమోటా బాగా ఊడికిన తరువాత అందులో గుడ్డలి పగలగొట్టి అందులో వేసుకోవాలి. 2నిమిషాలు ఊడిన తర్వాత మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. చిన్న చిన్నగా కలుపుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా వస్తుంది. కలుపుకుంటూ పచ్చి వాసన పోయేదాకా ఊడించుకోవాలి. ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉంటే ముక్కలాగా వస్తుంది. కూర బాగా వేపుడు అయ్యిన తర్వాత అందులో కొంచెం గరమ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
Ṭamōṭā bāgā ūḍikina taruvāta andulō guḍḍali pagalagoṭṭi andulō vēsukōvāli. 2Nimiṣālu ūḍina tarvāta mellagā kalupukuṇṭū uṇḍāli. Cinna cinnagā kalupukōvāli. Ilā cinna mukkalugā vastundi. Kalupukuṇṭū pacci vāsana pōyēdākā ūḍin̄cukōvāli. Ilā cinnagā kalupukuṇṭū uṇṭē mukkalāgā vastundi. Kūra bāgā vēpuḍu ayyina tarvāta andulō kon̄ceṁ garama masālā vēsi bāgā kalupukōvāli.
 
గుడ్డు బాగా వేపుడు అయ్యిన తరువాత ఒకసారి రుచి చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన గుడ్డు బుర్జి సిద్దంగా ఉంది. వేడి వేడి అన్నంలో, చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ గుడ్డు కూర. తప్పకుండా చేసి ఎలా ఉందో చెప్పండి.
Guḍḍu bāgā vēpuḍu ayyinā taruvāta okasāri ruci cūsukōvāli. Uppu saripōkapōtē kon̄ceṁ vēsukōṇḍi. Civarigā kottimīra vēsi alaṅkarin̄cukōvāli. Antēnaṇḍi entō rucikaramaina guḍḍu burji siddaṅgā undi. Vēḍi vēḍi annanlō, capātī lōki cālā bāguṇṭundi ī guḍḍu kūra. Tappakuṇḍā cēsi elā undō ceppaṇḍi.

Comments