కారం అన్నం తయారీ విధానం | కారంతో అన్నం కలిపి ఇలా సులువుగా బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి Kāraṁ annaṁ tayārī vidhānaṁ | kārantō annaṁ kalipi ilā suluvugā brēk phāsṭ cēsukōṇḍi ​


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • నూనె - 3-4 స్పూన్లు | Nūne - 3-4 spūnlu
 • ఆవాలు - 1 స్పూను | āvalu - 1 spūnu
 • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
 • సెనగపప్పు - 2 స్పూన్లు | senagapappu - 2 spūnlu
 • మినపగుళ్లు - 2 స్పూన్లు | minapaguḷlu - 2 spūnlu
 • వేరుసెనగ గుల్లు - 3-4 స్పూన్లు (20 గ్రా) | vērusenaga gullu - 3-4 spūnlu (20 grā)
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • పచ్చిమిరపకాయలు - 2 | paccimirapakāyalu - 2
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 1-2 స్పూన్లు | karam - 1-2 spūnlu
 • జీడి పప్పు - 3 స్పూన్లు (15 గ్రా) | jīḍi pappu - 3 spūnlu (15 grā)
 • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • నెయ్యి - 1-2 స్పూన్లు | Neyyi - 1-2 spūnlu
 • వెల్లుల్లిపాయ రెమ్మలు - 5 | Vellullipāya rem'malu - 5
 • అన్నం - 2 కప్పులు | Annaṁ - 2 kappulu
ముందుగ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత అందులో మినపగుళ్లు, సెనగపప్పు, వేరుసెనగ గుళ్లు వేసి బాగా వేయించాలి. అందులో పచ్చిమిరపకాయ చీలికలుగ కోసి వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి దంచి అందులో వేసుకుని వేయించుకోవాలి.
Munduga poyyi veligin̄ci pān peṭṭi nūne vēsi vēḍi cēsukōvāli. Ippuḍu andulō āvālu, jīlakarrā vēsi vēyin̄cukōvāli. Taruvāta andulō minapaguḷlu, senagapappu, vērusenaga guḷlu vēsi bāgā vēyin̄cāli. Andulō paccimirapakāya cilakalugā kōsi vēsukōvāli. Vellulli rem'malu poṭṭu tīsi dan̄ci andulō vēsukuni vēyin̄cukōvāli.
 
ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులో కొంచెం ఉప్పు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత అందులో వండిన అన్నము వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నానికి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిలో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోయిన పర్వలేదు. అంటేనండి ఎంతో రుచికరమైన కారం అన్నం తాయారు. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. రాత్రి అన్నం మిగిలినా, ఇంట్లో కూరగాయాలు లేకపోయిన తేలికగా చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే ఈ కారం అన్నం చాలా బాగుంటుంది. తప్పకుండ సిద్ధం చేసి ఎలా ఉందో చెప్పండి.
Ippuḍu andulō ullipāya mukkalu vēsi bāgā vēyin̄cāli. Andulō kon̄ceṁ uppu, karivēpāku, jīḍipappu vēsi vēyin̄cāli. Annī bāgā vēgina tarvāta andulō vandina annamu vēsi bāgā kalupukōvāli. Ippuḍu annāniki saripaḍā kāraṁ vēsi bāgā kalupukōvāli. Civarilō neyyi vēsi bāgā kalupukōvāli. Neyyi vēstē ruci cālā bāguṇṭundi. Neyyi lēkapōyina parvalēdu.Aṇṭēnaṇḍi entō rucikaramaina kāraṁ annaṁ tāyāru. Takkuva samayanlō cēsukōvaccu. Rātri annaṁ migilinā, iṇṭlō kūragāyālu lēkapōyina tēlikagā cēsukōvaccu. Vēḍi vēḍigā tiṇṭē ī kāraṁ annaṁ cālā bāguṇṭundi. Tappakuṇḍa sid'dhaṁ cēsi elā undō ceppaṇḍi.

Comments