తెల్ల వంకాయ పచ్చి బటానీ కూర | పచ్చి బటానీ వంకాయ కూర ఎలా చేయాలి | వంకాయ బటానీ మసాలా కూర | వంకాయ పచ్చి బటానీ కర్రీ రెసిపీ Tella vaṅkāya pacci baṭānī kūra | pacci baṭānī vaṅkāya kūra elā cēyāli | vaṅkāya baṭānī masālā kūra | vaṅkāya pacci baṭānī karrī resipī ​


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • నూనె - 3-4 స్పూన్లు | Nūne - 3-4 spūnlu
 • తెల్ల వంకాయలు/ తెల్ల గుత్తివంకాయలు - 250గ్రా | tella vaṅkāyalu/ tella guttivaṅkāyalu - 250grā
 • పచ్చి బఠానీలు - 50 గ్రా | pacci baṭhānīlu - 50 grā
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | Ruci prakāraṁ uppu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • నీరు - 1 కప్పు | nīru - 1 kappu
 • ఆమ్చూర్ - 1 చెంచా | Āmcūr - 1 cen̄cā
 
ముందుగ పచ్చి బాటని నీళ్లల్లో నానబెట్టుకోవాలి (6-8గం). ఒక కడాయి పెట్టి పొయ్యి వెలిగించి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ మగ్గి మెత్తగా అయ్యిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు బాగా కడిగి, వంకాయని ముక్కలుగా కోసుకుని అందులో వేసుకోవాలి. అలాగే నానబెట్టిన బాటని కూడా నీళ్ళు తీసేసి కూరలో వేసుకుని బాగా వేయించాలి. కొంచెం ఫ్రై అయ్యిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టుకుని ఓక 10నిమిషాలు వేయించుకోవాలి.
Munduga pacci bāṭani nīḷlallō nānabeṭṭukōvāli (6-8gaṁ). Oka kaḍāyi peṭṭi poyyi veligin̄ci andulō nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍi ayyinā taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cāli. Bāgā vēgina taruvāta andulō ullipāya mukkalu vēsi bāgā vēyin̄cāli. Ullipāya maggi mettagā ayyina taruvāta andulō allaṁ vellulli pēsṭ vēsi pacci vāsana pōyē varaku vēyin̄cāli. Ippuḍu bāgā kaḍigi vaṅkāyani mukkalugā kōsukuni andulō vēsukōvāli. Alāgē nānabeṭṭina bāṭani kūḍā nīḷḷu tīsēsi kūralō vēsukuni bāgā vēyin̄cāli. Kon̄ceṁ phrai ayyina tarvāta andulō pasupu, uppu, kāraṁ vēsi mūta peṭṭukuni ōka 10nimiṣālu vēyin̄cukōvāli.
 
తర్వత కుర లో కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆమ్చూర్ వేసుకుని బాగా కలుపుకుని ఓక 5నిమిషాలు వేయిం చుకోవాలి.
Tarvata kura lō karivēpāku vēsi vēyin̄cukōvāli. Ippuḍu āmcūr vēsukuni bāgā kalupukuni ōka 5nimiṣālu
vēyiṁ cukōvāli.
 
బాగా వేగిన తరువాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకుని బాగా మెత్తగా ఊడించుకోవాలి. పచ్చి బటానీ కుడా మెత్తగా ఉడుకుతుంది. కూర గుజ్జు గుజ్జుగా వస్తుంది నీరు పొయ్యడం వల్ల. కూర కొంచెం వేపుడులా కావాలి అనుకుంటే నీరు పొయ్యకూడదు. కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
Bāgā vēgina taruvāta andulō oka kappu nīḷḷu pōsukuni bāgā mettagā ūḍin̄cukōvāli. Pācci baṭānī kuḍā mettagā uḍukutundi. Kūra gujju gujjugā vastundi nīru poyyaḍaṁ valla. Kūra kon̄ceṁ vēpuḍulā kāvāli anukuṇṭē nīru poyyakūḍadu. Kon̄ceṁ garaṁ masālā vēsi bāgā kalupukōvāli.
  
నీరు తగ్గి ముక్క బాగా ఊడికిన తరువాత కూర గుజ్జుగా ఉంటుంది. మరి కొంచెం సేపు ఊడకనిస్తే నీరు తగ్గి నూనె బయటికి వస్తుంది. అప్పుడూ కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి. అంతేనండి రుచికరమైన వంకాయ పచ్చి బట్టని కూర సిద్దంగా ఉంది. మంచి గుమ గుమలాడే వాసనతో, చూడడానికి కళ్ళకి ఇంపుగా, అలాగే మంచే రుచితో చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూస్తే మల్లీ ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది.. వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది. జీరా రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండ చేసి ఎలా ఉందో చెప్పండి..
Nīru taggi mukka bāgā ūḍikinā taruvāta kūra gujjugā uṇṭundi. Mari kon̄ceṁ sēpu ūḍakanistē nīru taggi nūne bayaṭiki vastundi. Appuḍū kottimīra vēsi alaṅkarin̄cukōvāli. Antēnaṇḍi rucikaramaina vaṅkāya pacci baṭṭani kūra siddaṅgā undi. Man̄ci guma gumalāḍē vāsanatō cūḍaḍāniki kaḷḷaki impugā alāgē man̄cē rucitō cālā bāguṇṭundi. Okkasāri cēsi cūstē Mallī eppuḍeppuḍu tiṇṭāmā anipistundi. Vēḍi vēḍi annaṁ lōki cālā bāguṇṭundi. Jīrā rais lōki kūḍā cālā bāguṇṭundi. Tappakuṇḍa cēsi elā undō ceppaṇḍi..

Comments