బీట్రూట్ పెసరపప్పు కూర తయారీ విధానం | బీట్ రూట్ కూర ఎలా చెయ్యాలి | తరిగిన బీట్ రూట్ కూర | గ్రేటెడ్ బీట్ రూట్ కూర ఎలా చెయ్యాలి | Bīṭrūṭ pesarapappu kūra tayārī vidhānaṁ | bīṭ rūṭ kūra elā ceyyāli | tarigina bīṭ rūṭ kūra | grēṭeḍ bīṭ rūṭ kūra elā ceyyāli

కావాల్సిన పదార్దాలు:
  • బీట్రూట్ - 250 gm | Bīṭrūṭ - 250 gm
  • పెసరపప్పు  - 20 gm | pesarapappu - 20 gm
  • ఉల్లిపాయ  -1 | ullipāya -1
  • వెల్లుల్లి రెమ్మలు - 5 | vellulli rem'malu - 5
  • ఉప్పు రుచికి సరిపడా | uppu ruciki saripaḍā
  • కారం - 2 Spoons | kāraṁ - 2 Spoons
  • కొత్తిమీర కొంచెం | kottimīra kon̄ceṁ
  • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
  • నీరు  - 1 Cup | nīru - 1 Cup
  
ముందుగా ఉల్లిపాయ ని చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి పాయ రెమ్మలు తోలు తీసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు తీసుకుని బాగా కడిగి నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే బీట్రూట్ తోలు తీసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
Mundugā ullipāya ni cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Alāgē vellulli pāya rem'malu tōlu tīsi cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Pesarapappu tīsukuni bāgā kaḍigi nīṭilō nānabeṭṭukōvāli. Alāgē bīṭrūṭ tōlu tīsi turumukuni pakkana peṭṭukōvāli.
  
ముందుగా ఒక కడాయి / పాన్ తీస్కుని పొయ్యి వెలిగించి మీడియం మంట వేడి చెయ్యాలి. పాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తురిమిన బీట్రూట్ తీసి ఉల్లిపాయ ఉడికిన తరువాత పాన్ లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ లో పెసరపప్పు వేసి ఒక కప్ నీరు పోసి మూత పెట్టి ఒక 5నిముషాలు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత నీరు వడకట్టి పెసరపప్పు పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ బాగా వేయించుకోవాలి. నీరు తగ్గి బీట్రూట్ బాగా ఉడుకుతుంది.
Mundugā oka kaḍāyi/ pān tīskuni poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa vēḍi ceyyāli. Pān vēḍi ayyina taruvāta andulō nūne vēsi vēḍi ceyyāli. Vēḍi ayyina taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta andulō ullipāya mukkalu, vellulli mukkalu vēsi bāgā vēyin̄cukōvāli. Turimina bīṭrūṭ tīsi ullipāya uḍikina taruvāta pān lō vēsi vēyin̄cukōvāli. Ippuḍu iṅkō pān lō pesarapappu vēsi oka kap nīru pōsi Mūta peṭṭi oka 5Nimuṣālu uḍikin̄cukōvāli. Pappu uḍikina taruvāta nīru vaḍakaṭṭi pesarapappu pakkana peṭṭukōvāli. Bīṭrūṭ bāgā vēyin̄cukōvāli. Nīru taggi bīṭrūṭ bāgā uḍukutundi.
 
ఇప్పుడు అందులో కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసి ఒక 5 నిముషాలు ఉడికించుకోవాలి. బాగా కలిసిన తరువాత చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కూర బాగా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం నీరు పోసుకోవాలి. లేదంటే నీరు పొయ్యాల్సిన అవసరం లేదు. అంతేనండి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బీట్రూట్ పెసరపప్పు కూర తయారుగా ఉంది. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి.
Ippuḍu andulō karivēpāku vēsi bāgā vēyin̄cukōvāli. Uppu, kāraṁ, pasupu vēsi bāgā kalupukōvāli. Taruvāta mundugā uḍikin̄ci pakkana peṭṭukunna pesarapappu vēsi oka 5 nimuṣālu uḍikin̄cukōvāli. Bāgā kalisina taruvāta civarigā kottimīra vēsi bāgā kalupukōvāli. Kūra bāgā mettagā kāvāli anukuṇṭē kon̄ceṁ nīru pōsukōvāli. Lēdaṇṭē nīru poyyālsina avasaraṁ lēdu. Antēnaṇḍi rucikaramaina mariyu ārōgyakaramaina bīṭrūṭ pesarapappu kūra tayārugā undi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi.

Comments