బియ్యం పిండి చెక్కల తయారీ విధానం | బియ్యం పిండితో చెక్కలు ఇలా చేసి చూడండి | కరకరలాడే చెక్కలు తయారీ విధానం | నువ్వుల చెక్కలు తయారీ విధానం | పప్పు చెక్కలు రెసిపీ | కరకరలాడే పప్పు చెక్కలు ఎలా చెయ్యాలి | పప్పు చెక్కలు | Biyyaṁ piṇḍi cekkala tayārī vidhānaṁ | biyyaṁ piṇḍitō cekkalu ilā cēsi cūḍaṇḍi | karakaralāḍē cekkalu tayārī vidhānaṁ | nuvvula cekkalu tayārī vidhānaṁ | pappu cekkalu resipī | karakaralāḍē pappu cekkalu elā ceyyāli | pappu cekkalu

కావలసిన పదార్దాలు:
  • బియ్యం పిండి - 500 గ్రా | Biyyaṁ piṇḍi - 500 grā
  • పెసరపప్పు - 30 గ్రా | pesarapappu - 30 grā
  • నువ్వులు - 20 గ్రా | nuvvulu - 20 grā
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • పచ్చి మిర్చి పేస్ట్ - 20 గ్రా | pacci mirci pēsṭ - 20 grā
  • అవసరమైనంత నీరు | avasaramainanta nīru
  • వేయించడానికి సరిపడా నూనె | vēyiṁcaḍāniki saripaḍā nūne
  
ముందుగా సెనగపప్పు తీస్కుని బాగా కడిగి నీరు పోసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం పిండి తీస్కుని పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండి ఇంట్లో తయారీ చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ముందుగా బియ్యం తీస్కుని కడిగి నీటిలో 8-12 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీరు వడకట్టి ఒక గుడ్డ మీదపరిచి ఆరబెట్టుకోవాలి. తడి ఆరిపోయి బియ్యం కొంచెం పొడిగా ఉన్నపుడు గ్రైండ్ చేసుకుని పిండి పట్టుకోవాలి. పిండి జల్లించుకుని ఒక పళ్లెంలో ఆరబెట్టుకోవాలి, 4 గంటలు ఆరబెట్టుకుంటే బియ్యం పిండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. లేదంటే కొంచెం తడిగా ఉండటం వల్ల పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరబెట్టుకోడం మంచిది. ఇలా ఆరబెట్టడం వల్ల చెక్కలు కరకరలాడుతూ వస్తాయి. బియ్యం పిండి ఇంట్లో చేసుకోలేని వాళ్ళు బయట బియ్యం పిండి కొనుకోవచ్చు. 
Mundugā senagapappu tīskuni bāgā kaḍigi nīru pōsi oka 4 gaṇṭalu nānabeṭṭukōvāli. Biyyaṁ piṇḍi tīskuni pakkana peṭṭukōvāli. Biyyaṁ piṇḍi iṇṭlō tayārī cēsukōvāli aṇṭē ī vidhaṅgā cēsukōṇḍi. Mundugā biyyaṁ tīskuni kaḍigi nīṭilō 8-12 gaṇṭalu nānabeṭṭukōvāli. Taruvāta nīru vaḍakaṭṭi oka guḍḍa mīdaparici ārabeṭṭukōvāli. Taḍi āripōyi biyyaṁ kon̄ceṁ poḍigā unnapuḍu graiṇḍ cēsukuni piṇḍi paṭṭukōvāli. Piṇḍi jallin̄cukuni oka paḷlenlō ārabeṭṭukōvāli, 4 gaṇṭalu ārabeṭṭukuṇṭē biyyaṁ piṇḍi ekkuva rōjulu niluva uṇṭundi. Lēdaṇṭē kon̄ceṁ taḍigā uṇḍaṭaṁ vāḷḷa pāḍayyē avakāśaṁ undi. Kābaṭṭi ārabeṭṭukōḍaṁ man̄cidi. Ilā ārabeṭṭaḍaṁ vāḷḷa cekkalu karakaralāḍutū vastāyi. Biyyaṁ piṇḍi iṇṭlō cēsukōlēni vāḷḷu bayaṭa biyyaṁ piṇḍi konukōvaccu.

  
పచ్చిమిరపకాయలు తీస్కుని కడిగి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే రోటిలో రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీస్కుని అందులో బియ్యం పిండి వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు లో నుంచి నీరు వడకట్టి, మల్లె ఒకసారి కడిగి బియ్యం పిండిలో వేసుకోవాలి. ముందుగా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దీ కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి.
Paccimirapakāyalu tīskuni kaḍigi pēsṭ lāgā graiṇḍ cēsukōvāli lēdaṇṭē rōṭilō rubbukōvaccu. Ippuḍu oka veḍalpu ginne tīskuni andulō biyyaṁ piṇḍi vēsukuni, ruciki saripaḍā uppu, nuvvulu, paccimirapakāya pēsṭ vēsukōvāli. Nānabeṭṭina pesarapappu lō nun̄ci nīru vaḍakaṭṭi, malle okasāri kaḍigi biyyaṁ piṇḍilō vēsukōvāli. Mundugā bāgā kalupukōvāli. Taruvāta koddī koddigā nīru pōsukuṇṭū piṇḍini muddagā kalupukōvāli.
 
ముందుగా పొయ్యి వెలిగించి మీడియం మంట మీద పెట్టి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడి అయ్యిన తరువాత అందులో నూనె పోసి పెద్ద మంట మీద నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడి చేసిన తరువాత పక్కన పెట్టుకున్న పిండి కొంచెం తీస్కుని పాపడ్ లాగా రౌండ్ గ చేసుకుని నూనె లో వదలాలి. బాగా వేగిన తరువాత రెండో వైపు తిప్పి కాలనివ్వాలి. ఎరుపు రంగు వచ్చి బాగా వేగిన తరువాత చిల్లుల గరిటతో చెక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి.
Mundugā poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda peṭṭi oka kaḍāyi peṭṭukōvāli. Kaḍāyi kon̄ceṁ vēḍi ayyina taruvāta andulō nūne pōsi pedda maṇṭa mīda nūne vēḍi cēsukōvāli. Nūne bāgā vēḍi cēsina taruvāta pakkana peṭṭukunna piṇḍi kon̄ceṁ tīskuni pāpaḍ lāgā rauṇḍ ga cēsukuni nūne lō vadalāli. Bāgā vēgina taruvāta reṇḍō vaipu tippi kālanivvāli. Erupu raṅgu vacci bāgā vēgina taruvāta cillula gariṭatō cekkalu tīsi pakkana peṭṭukōvāli.
 
అంతేనండి రుచికరమైన మరియు కరకరలాడే చెక్కలు సిద్ధంగా ఉన్నాయి. చెక్కలు నెలరోజుల వరకు ఉంటాయి. చాల తాజాగా బాగుంటాయి. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి. నువ్వులు, పెసరపప్పులు ఉండటం వాళ్ళ కరకరలాడుతూ తింటుంటే మధ్యలో ఆ రుచి వచ్చి చాలా బాగుంటాయి.
Antēnaṇḍi rucikaramaina mariyu karakaralāḍē cekkalu sid'dhaṅgā unnāyi. Cekkalu nelarōjula varaku uṇṭāyi. Cāla tājāgā bāguṇṭāyi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi. Nuvvulu, pesarapappulu uṇḍaṭaṁ vāḷḷa karakaralāḍutū tiṇṭuṇṭē madhyalō ā ruci vacci cālā bāguṇṭāyi.

Comments