చికెన్ పచ్చడి తయారీ విధానం | చికెన్ పికిల్ రెసిపీ | చికెన్ నుండి నిలవ పచ్చడి | చికెన్ పచ్చడి ఇలా చేసి చూడండి | సులువుగా తక్కువ సమయంలో చికెన్ పచ్చడి తయారీ విధానం Ciken paccaḍi tayārī vidhānaṁ | ciken pikil resipī | ciken nuṇḍi nilava paccaḍi | ciken paccaḍi ilā cēsi cūḍaṇḍi | suluvugā takkuva samayanlō ciken paccaḍi tayārī vidhānaṁ ​

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • పచ్చి చికెన్ - 500 గ్రా | Pacci ciken - 500 grā
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20-50 గ్రా | allaṁ vellulli pēsṭ - 20-50 grā
  • ఎర్ర కారం - 50gm/ 3-4 స్పూన్లు | erra kāraṁ - 50gm/ 3-4 spūnlu
  • పసుపు - 2 స్పూన్లు | pasupu - 2 spūnlu
  • నిమ్మకాయలు - 3 | nim'makāyalu - 3
  • నూనె - 150-250ml | nūne - 150-250ml
  • గరం మసాలా పౌడర్ - 2 స్పూన్లు | garaṁ masālā pauḍar - 2 spūnlu
  • ధనియాలు పొడి - 2 - 3 స్పూన్లు | dhaniyālu poḍi - 2 - 3 spūnlu
  • నీరు - 1 కప్పు | nīru - 1 kappu
 
ముందుగా తాజా చికెన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్/కడై పెట్టి పొయ్యి వెలిగించాలి. పాన్ వేడి అయ్యిన తరువాత అందులో కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, నీరు వేసి కలుపుతూ ఉడికించాలి (లేదంటే ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని ఒక 10మిస్ మ్యారినేట్ చేసిన తరువాత పొయ్యి మీద వేడి చేసిన పాన్ లో వేసి ఉడికించుకోవచ్చు. కొంతమంది 30 నిముషాలు కూడా మ్యారినేట్ చేస్తారు. మనకి సమయం ఉంటె 30నిముషాలు చేసుకోవచ్చు. లేదంటే 10నిముషాలు చేసిన సరిపోతుంది.
Mundugā tājā ciken tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Ippuḍu oka pān/kaḍai peṭṭi poyyi veligin̄cāli. Pān vēḍi ayyina taruvāta andulō kaḍigi pakkana peṭṭukunna ciken mukkalu vēsukōvāli. Andulō kon̄ceṁ pasupu, uppu, Nīru vēsi kaluputū uḍikin̄cāli (lēdaṇṭe mundugā oka ginnelō ciken vēsukuni pasupu, uppu vēsi bāgā kalupukuni oka 10mis myārinēṭ cēsina taruvāta poyyi mīda vēḍi cēsina pān lō vēsi uḍikin̄cukōvaccu. Kontamandi 30 nimuṣālu kūḍā myārinēṭ cēstāru. Manaki samayaṁ uṇṭe 30nimuṣālu cēsukōvaccu. Lēdaṇṭē 10nimuṣālu cēsina saripōtundi.
  
చికెన్ లో కొంచెం నీరు కూడా పోసి ఉడికించడం వాళ్ళ పాచి వాసన రాదు. చికెన్ మ్యారినేట్ చేస్తే పాన్ లో వేసిన తరువాత కొంచెం నీరు పోసుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత అందులో నుంచి నీరు వస్తూ ఉంటుంది. నీరు ఇగిరిపోయేదాకా ఉడకనివ్వాలి.
Ciken lō kon̄ceṁ nīru kūḍā pōsi uḍikin̄caḍaṁ vāḷḷa pāci vāsana rādu. Ciken myārinēṭ cēstē pān lō vēsina taruvāta kon̄ceṁ nīru pōsukōvāli. Mukkalu bāgā uḍikina taruvāta andulō nun̄ci nīru vastū uṇṭundi. Nīru igiripōyēdākā uḍakanivvāli.
 
చికెన్ లో నుంచి నీరు వచ్చిన తరువాత నీరు ఇగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం కూడా నీరు లేకుండా ముక్కలు బాగా ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
Ciken lō nun̄ci nīru vaccina taruvāta nīru igiripōyēdākā uḍakanivvāli. Ilā kon̄ceṁ kūḍā nīru lēkuṇḍā mukkalu bāgā uḍikina taruvāta tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu oka pān peṭṭi vēḍi cēsukōvāli. Andulō nūne pōsi vēḍi cēsukōvāli.
 
నూనె వేడి అయ్యిన తరువాత అందులో చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. చికెన్ ముక్కలు ఎరుపు రంగు వచ్చే దాక వేయించుకోవాలి. చికెన్ ముక్కలు గట్టిగ వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు మెత్తగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. కాబట్టి బాగా వేయించుకోవాలి.
Nūne vēḍi ayyina taruvāta andulō ciken mukkalu vēsi vēyin̄cukōvāli. Ciken mukkalu erupu raṅgu vaccē dāka vēyin̄cukōvāli. Ciken mukkalu gaṭṭiga vēgina taruvāta tīsi pakkana peṭṭukōvāli. Mukkalu mettagā vēyin̄cukuṇṭē ekkuva rōjulu niluva uṇḍadu. Kābaṭṭi bāgā vēyin̄cukōvāli.
 
ఇప్పుడు అదే కడాయి లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే దాక వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
Ippuḍu adē kaḍāyi lō allaṁ vellulli pēsṭ vēsi vēyin̄cukōvāli. Pacci vāsana pōyē dāka vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta andulō vēyin̄ci pakkana peṭṭukunna ciken mukkalu vēsi kalupukōvāli.
 
ఇప్పుడు అందులో కారం, మసాలా పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఉప్పు, కారం చూసుకుని అవసరమైతే  కొంచెం వేసుకుని కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తరువాత అందులో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక రోజు తర్వాత రుచి చూసుకుంటే ఉప్పు, కారం, నిమ్మరసం, మసాలాలు పట్టి చికెన్ ముక్క రుచిగా ఉంటుంది. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి. చికెన్ నిలువ పచ్చడి ఇలా చేసుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. రోజూ కన్నా ఒక ముద్దా ఎక్కువ తింటారు ఇలా ఇంట్లో చికెన్ పచ్చడి చేసుకుంటే ఉంటె. బోనెల్స్ చికెన్ తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. బోన్స్ ఉన్న చికెన్ తీసుకున్న వేగిన  తరువాత కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా తినేస్తారు. గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే ధనియాలు పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
Ippuḍu andulō kāraṁ, masālā poḍi, dhaniyāla poḍi vēsi bāgā kalupukōvāli. Poyyi āph cēsi pān tīsi pakkana peṭṭukuni callāranivvāli. Callārina taruvāta uppu, kāraṁ cūsukuni avasaramaitē kon̄ceṁ vēsukuni kalupukōvāli. Pūrtigā callārina taruvāta andulō nim'marasaṁ vēsi bāgā kalupukōvāli. Oka rōju tarvāta ruci cūsukuṇṭē uppu, kāraṁ, nim'marasaṁ, masālālu paṭṭi ciken mukka rucigā uṇṭundi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi. Ciken niluva paccaḍi ilā cēsukuṇṭē nela rōjula varaku niluva uṇṭundi. Rōjū kannā oka muddā ekkuva tiṇṭāru ilā iṇṭlō ciken paccaḍi cēsukuṇṭē uṇṭe. Bōnels ciken tīsukuṇṭē paccaḍi bāguṇṭundi. Bōns unna ciken tīsukunna vēgina taruvāta karakaralāḍutū uṇṭāyi kābaṭṭi avi kūḍā tinēstāru. Gujju ekkuva kāvāli anukuṇṭē dhaniyālu poḍi kon̄ceṁ ekkuva vēsukōvāli.

Comments