దహీ వాలే ఆలూ మట్టర్ | దహీ ఆలు మట్టర్ రెసిపీ | బంగాళదుంప పచ్చి బటానీ కూర | బంగాళదుంప పచ్చి బటానీ పెరుగు కూర | ఉత్తర భారత వంటకాలు | దహీ ఆలూ కి సబ్జీ | ఆలూ మట్టర్ సబ్జీ | పచ్చి బఠానీలు బంగాళదుంప పెరుగు కూర | బంగాళదుంప పచ్చి బఠానీ పెరుగు కూర | dahī vālē ālū muṭar | dahī ālu maṭṭar resipī | baṅgāḷadumpa pacci baṭānī kūra | baṅgāḷadumpa pacci baṭānī perugu kūra | uttara bhārata vaṇṭakālu |dahī ālū ki sabjī | ālū maṭṭar sabjī | pacci baṭhānīlu baṅgāḷadumpa perugu kūra | baṅgāḷadumpa pacci baṭhānī perugu kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:

 • టొమాటో - 2 | Ṭomāṭō - 2
 • బంగాళదుంపలు - 4 | baṅgāḷadumpalu - 4
 • పచ్చి బఠానీలు - 20 గ్రా | pacci baṭhānīlu - 20 grā
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • ధనియా పౌడర్ - 1 స్పూన్ | dhaniyā pauḍar - 1 spūn
 • వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్ | vēyin̄cina jīlakarra poḍi - 1 spūn
 • నువ్వుల పొడి - 1 స్పూన్ | nuvvula poḍi - 1 spūn
 • జీడిపప్పు - 10 | jīḍipappu - 10
 • పెరుగు - 2 స్పూన్లు | perugu - 2 spūnlu
ముందుగ పచ్చి బటాని ముండు రోజు నీళ్లలో నానబెట్టుకోవాలి (6-8గం).ఇప్పుడు టమోటా ని చిన్న ముక్కలుగా కోసుకుని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. బంగాళదుంప తొక్క తీసి ఒక కడాయిలో నీళ్ళు పోసి అందులో 5-10 నిమిషాలు ఊడించుకోవాలి. తరువాత ఆ కడాయి పక్కన పెట్టుకుని నీళ్ళు తీసేసి బంగాళదుంప ముక్కలు చల్లారని. అలాగే ఇప్పుడు ఆ బటానీ కూడ 5-10నిమిషాల నీరు లో ఉడికించాలి. లేడంటే సమయం తక్కువ ఉన్నవారు బటానీ, బంగాళదుంప ముక్కలూ కుక్కర్‌లో 1-2 విజిల్స్ రానిచ్చి అరబెట్టుకోవాలి. 
munduga pacci baṭāni mundē rōju nīḷlalō nānabeṭṭukōvāli (6-8gaṁ).Ippuḍu ṭamōṭā ni cinna mukkalugā kōsukuni pēsṭ lāgā rubbukōvāli. Baṅgāḷadumpa tokka tīsi oka kaḍāyilō nīḷḷu pōsi andulō 5-10 nimiṣālu ūḍin̄cukōvāli. Taruvāta ā kaḍāyi pakkana peṭṭukuni nīḷḷu tīsēsi baṅgāḷadumpa mukkalu callārani. Alāgē ippuḍu ā baṭānī kūḍa 5-10nimiṣāla nīru lō uḍikin̄cāli. Lēḍaṇṭē samayaṁ  ṭakkuva unnāru baṭānī, baṅgāḷadumpa mukkalū kukkar‌lō 1-2 vijils rānicci arabeṭṭukōvāli.
 
ఇప్పుడు మరల పొయ్యి వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అందులో పచ్చిమిరపకాయ చీలికలు, ఊడికించి పక్కన పెట్టుకున్నా బంగాళదుంపలు, పచ్చి బటానీ వేసి బాగా కలుపుకుని 5నిమిషాలు పెద్ద మంట మీద ఊడికించాలి.
Ippuḍu marala poyyi veligin̄ci pān peṭṭi vēḍi ceyyāli. Vēḍi ayyinā taruvāta andulō nūne vēsi vēḍi cēsukōvāli. Ippuḍu andulō jīlakarra vēsi vēyin̄cāli. Jīlakarra vēgina taruvāta andulō paccimirapakāya cīlikalu, ūḍikin̄ci pakkana peṭṭukunē baṅgāḷadumpalu, pacci batanilu vēsi bāgā kalupukuni 5nimiṣālu pedda maṇṭa mīda ūḍikin̄cāli. 
  
ఇప్పుడు కడాయి మీడ మూత పెట్టి 5 నిమిషాలు తక్కువ మంట మీద ఊడికించాలి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత టమోటా గుజ్జు కూరలో వేసుకుని మూత పెట్టుకుని ఓక 10నిమిషాలు ఊడికించుకోవాలి.
Ippuḍu kaḍāyi mīḍa mūta peṭṭi 5 nimiṣālu takkuva maṇṭa mīda ūḍikin̄cāli. Ippuḍu allaṁ velli pēsṭ vēsukuni bāgā kalupukōvāli. Taruvāta ṭamōṭā gujju kūralō vēsukuni mūṭa peṭṭukuni ōka 10nimiṣālu ūḍikin̄cukōvāli. 
  
1 కప్పు నీరు పోసుకోవాలి. ఒక్కోసారి త్వరగా ఊడికిపోవచ్చు. మీకు పచ్చివాసన పోయి ఎరుపు రంగు వచ్చేదాకా ఊడికించుకోవాలి. కూరలో నీరు తగ్గి చిక్కబడే లోపు మనం ఒక కప్పు తీసుకుని అందులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర చిక్కబడితే అందులో ఈ పెరుగు మిస్రమన్ని వేసి బాగా కలుపుని ఒక 10నిమిషాలు ఉడకనివ్వాలి.
1 Kappu nīru pōsukōvāli. Okasāri tvaragā ūḍikipōvaccu. Mīku paccē vāsana pōyi erupu raṅgu vaccēdākā ūḍikin̄cukōvāli. Kūralō nīru taggi cikkabaḍē lōpu manaṁ oka kappu tīsukuni andulō perugu, uppu, kāraṁ, pasupu, dhaniyā poḍi, vēyin̄cina jīlakarra poḍi vēsi bāgā kalupukōvāli. Ippuḍu kūra cikkabaḍitē andulō ī perugu misramanni vēsi bāgā kalupuni oka 10nimiṣālu uḍakanivvāli.
 
చివరిలో జీడిపప్పు పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఓక 5నిమిషాలు ఊడికించాలి. జీడిపప్పు పేస్ట్ తప్పకుండా వెయ్యాలి అని లేదు. కాని గ్రేవీ చాల గట్టిగా వస్తుంది. చివరిగా కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకొని వద్దించుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమయిన ఆలూ మట్టర్ కూర సిద్దంగా ఉంది. ఇది జీర అన్నం లోకి చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, ఫుల్కా వీటిలో తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండ సిద్ధం చేసి ఎలా ఉందో చెపండి.
Civarilō jīḍipappu pēsṭ vēsukuni kalupukōvāli ōka 5nimiṣālu ūḍikin̄cāli. Jīḍipappu pēsṭ tappakuṇḍā veyyāli ani lēdu. Kāni grēvī cāla gaṭṭigā vastundi. Civarigā kottimīra ākulu vēsi bāgā kalupukoni vaddin̄cukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramayina ālū maṭṭar kūra siddaṅgā undi. Idi jīra annaṁ lōki cālā bāguṇṭundi. Rōṭī, capātī, pulkhā vīṭilō tinaḍāniki cālā bāguṇṭundi. Tappakuṇḍa sid'dhaṁ cēsi elā undō cepaṇḍi.

Comments