గోధుమ రవ్వ ఉప్మా తయారీ విధానం | గోధుమ రవ్వతో ఇలా ఉప్మా చేసి చూడండి Gōdhuma ravva upmā tayārī vidhānaṁ | gōdhuma ravvatō ilā upmā cēsi cūḍaṇḍi ​

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • గోధుమ రవ్వ - 2 కప్పులు | Gōdhuma ravva - 2 kappulu
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • వేరుశెనగ గుల్లు - 20 గ్రా | vēruśenaga gullu - 20 grā
 • సెనగపప్పు - 2 స్పూన్లు | senagapappu - 2 spūnlu
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • క్యారెట్ - 1 | kyāreṭ - 1
 • బంగాళదుంప - 1 | baṅgāḷadumpa - 1
 • బీన్స్ - 5 | bīns - 5
 • టమోటా - 1 | ṭamōṭā - 1
 • అల్లం - 5 గ్రా | allaṁ - 5 grā
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • అవసరమైనంత నీరు / 4-6 కప్పులు | avasaramainanta nīru/ 4-6 kappulu
 
ముందుగా ఒక కడాయి /పాన్ తీస్కుని పొయ్యి వెలిగించి మీడియం మంట  మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె  వేసి వేడి చేసుకోవాలి. నూనె  వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, వేరుశెనగగుళ్ళు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిన తరువాత అందులో కరివేపాకు, సన్నగా తరిగిన అల్లము ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి
Mundugā oka kaḍāyi/pān tīskuni poyyi veligin̄ci mīḍiyaṁ māntā mīda peṭṭukuni vēḍi cēsukōvāli. Pān vēḍi ayyina taruvāta andulō Nūne vēsi hīṭ cēsukōvāli. Nūne vēḍi ayyina taruvāta andulō āvālu, vēruśenagaguḷḷu, Śenagapappu vēsi bāgā Vēyin̄cukōvāli. Pappulu bāgā vēgina taruvāta andulō karivēpāku, sannagā tarigina allamu mukkalu vēsi bāgā Vēyin̄cukōvāli.
 
ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకోవాలి. అలాగే   బంగాళదుంప, బీన్స్, టమాటో, క్యారెట్, ఉల్లిపాయ  కడిగి తోలు తీసి చిన్న  కోసుకోవాలి. ఇప్పుడు  ముక్కలు  వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మూట పెట్టుకుని ఒక 5మిస్  మెత్తగా ఉడికిపోతాయి. మూత తీసి ముక్కలు బాగా కలుపుకుని అందులో నీరు పోసుకోవాలి.   బట్టి వాటర్ వేసుకుంటాము. ఒక కప్ రవ్వకి రెండు లేదా మూడు కప్పుల నీరు పోసుకుంటాము.  నీరు ఎక్కువ పోస్తే (3 కప్స్) ఉప్మా మెత్తగా  వస్తుంది. పొడి పొడిగా రవ్వలాగా రావాలి అంటే ఒక (1) కప్ రవ్వకి రెండు (2) కప్స్ నీరు పోసుకోవాలి. నేను రెండు (2) కప్పుల రవ్వ తీసుకునాను కాబట్టి ఆరు  (6) కప్పుల నీరు పోసి బాగా ఉడికించాను. ఉప్పు సరి చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు.
Ippuḍu paccimirapakāyalu cīlikalugā kōsukōvāli. Alāgē baṅgāḷadumpa, bīns, ṭamāṭō, kyāreṭ, ullipāya kaḍigi tōlu tīsi cinna kōsukōvāli. Ippuḍu mukkalu vēsi bāgā kalupukuni vēyin̄cukōvāli. Kon̄ceṁ uppu vēsi mūṭa peṭṭukuni oka 5mis mettagā uḍikipōtāyi. Mūta tīsi mukkalu bāgā kalupukuni andulō nīru pōsukōvāli. Baṭṭi vāṭar vēsukuṇṭāmu. Oka kap ravvaki reṇḍu lēdā mūḍu kappula nīru pōsukuṇṭāmu. Nīru ekkuva pōstē (3 kaps) upmā mettagā vastundi. Poḍi poḍigā ravvalāgā rāvāli aṇṭē oka (1) kap ravvaki reṇḍu (2) kaps nīru pōsukōvāli. Nēnu reṇḍu (2) kappula ravva tīsukunānu kābaṭṭi āru (6) kappula nīru pōsi bāgā uḍikin̄cānu. Uppu sari cūsukuni saripōkapōtē kon̄ceṁ vēsukōvaccu.
 
నీరు బాగా మరిగిన తరువాత అందులో గోధుమ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. కలుపుతూ ఉంటె ఉండలు కట్టదు.ఒక 5నిముషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. నీరు తగ్గి రవ్వ ఉడికిన తరువాత దగ్గరకి అవుతుంది. అప్పుడు కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి.అంతేనండి ఎంతో రుచికరమైన మరియు కూరగాయలతో ఆరోగ్యకరమైన ఉప్మా సిద్ధంగా ఉంది. ఇది వేడిగా తినటానికి చాలా బాగుంటుంది. పల్లి చట్నీ ఉంటె మంచి కాంబినేషన్. లేకపోయినా కొంచెం నిమ్మరసం చల్లి తింటే అద్భుతంగా ఉంటుంది.తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి. 
Nīru bāgā marigina taruvāta andulō gōdhuma ravva vēsi bāgā kalupukōvāli uṇḍalu kaṭṭakuṇḍā. Kaluputū uṇṭe uṇḍalu kaṭṭadu.Oka 5nimuṣālu mūta peṭṭi uḍakanivvāli. Nīru taggi ravva uḍikina taruvāta daggaraki avutundi. Appuḍu kon̄ceṁ neyyi vēsi bāgā kalupukōvāli. Civarigā kottimīra vēsi kalupukuni poyyi āph cēsukōvāli.Antēnaṇḍi entō rucikaramaina mariyu kūragāyalatō ārōgyakaramaina upmā sid'dhaṅgā undi. Idi vēḍigā tinaṭāniki cālā bāguṇṭundi. Palli caṭnī uṇṭe man̄ci kāmbinēṣan. Lēkapōyinā kon̄ceṁ nim'marasaṁ calli tiṇṭē adbhutaṅgā uṇṭundi.Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi.

Comments