జీరా రైస్ చేయడం ఎలా | మిగిలిన అన్నంతో తక్షణ అల్పాహారం | అన్నంతో సింపుల్ బ్రేక్ ఫాస్ట్ | సాధారణ అల్పాహారం | త్వరిత మరియు సులభమైన జీరా రైస్ రెసిపీ Jīrā rais cēyaḍaṁ elā | migilina annantō takṣaṇa alpāhāraṁ | annantō simpul brēk phāsṭ | sādhāraṇa alpāhāraṁ | tvarita mariyu sulabhamaina jīrā rais resipī

కావలసిన పదార్ధాలు | Kāvalasina padārdhālu:
  • ఉడికించిన అన్నం - 250 గ్రా / 2-3 కప్పులు | Uḍikin̄cina annaṁ - 250 grā/ 2-3 kappulu
  • జీడిపప్పు - 15 | jīḍipappu - 15
  • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
  • మిరియాల పొడి - 1/2 స్పూన్ (ఐచ్ఛికం) | miriyāla poḍi - 1/2 spūn (aicchikaṁ)
  • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • జీలకర్ర - 2 స్పూన్లు | jīlakarra - 2 spūnlu
  • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
  • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 
ముందుగా ఉడికించిన అన్నం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుని చీలికలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  కొత్తిమీర కూడా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి /పాన్ పెట్టుకుని  పొయ్యిప్ వెలిగించి మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు  జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత అందులో తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాజా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు తప్పకుండా వెయ్యాలి అని లేదు కానీ వేస్తె బాగుంటుంది అని వేసాను . జీడిపప్పు లేకపోయినా పర్వాలేదు.
Mundugā uḍikin̄cina annaṁ tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu paccimirapakāyalu tīsukuni cīlikalugā kōsukuni pakkana peṭṭukōvāli. Alāgē karivēpāku kaḍigi pakkana peṭṭukōvāli. Ippuḍu kottimīra kūḍā kaḍigi tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu oka kaḍāyi/pān peṭṭukuni poyyip veligin̄ci mīḍiyaṁ Maṇṭa mīda vēḍi cēsukōvāli. Pān vēḍi ayyina taruvāta andulō Nūne vēsi vēḍi cēsukōvāli. Ippuḍu jīlakarra vēsi Vēyin̄cukōvāli. Taruvāta andulō tarigina paccimirapakāya mukkalu vēsi bāgā kalupukōvāli. Ippuḍu tājā karivēpāku vēsi bāgā kalupukōvāli. Ippuḍu andulō jīḍipappu vēsi Vēyin̄cukōvāli. Jīḍipappu tappakuṇḍā veyyāli ani lēdu kānī vēste bāguṇṭundi ani vēsānu. Jīḍipappu lēkapōyinā parvālēdu.
ఇప్పుడు బాగా వేయించుకున్నా తరువాత అందులో కొంచెం ఉప్పు,మిరియాల పొడి (ఐచ్చికం) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వండి పక్కన పెట్టుకున్న అన్నం అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసి తరువాత కొంచెం వేసి అన్నంలో కలుపుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుని పొయ్యి ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన జీరా రైస్ తయారుగా తప్పకుండ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. జీర అన్నం ఒకటే తినలేము అండీ. అందులోకి రైతా, ఆలూ మటర్, పనీర్ మసాలా, పన్నీర్ బట్టర్ మసాలా ఎదైనా ఉంటె కాంబినేషన్ అదిరిపోతోంది అండీ
Ippuḍu bāgā Vēyin̄cukunnā taruvāta andulō kon̄ceṁ uppu,miriyāla poḍi (aiccikaṁ) vēsi bāgā kalupukōvāli. Ippuḍu vaṇḍi pakkana peṭṭukunna annaṁ andulō vēsi bāgā kalupukōvāli. Uppu saripōyindō lēdō ruci cūsi taruvāta kon̄ceṁ vēsi annanlō kalupukōvaccu. Civarigā kottimīra vēsi bāgā kalupukuni poyyi āph cēsi pān tīsi pakkana peṭṭukōvāli. Antēnaṇḍi entō rucikaramaina jīrā rais tayārugā tappakuṇḍa cēsi elā vaccindō ceppaṇḍi. Jīra annaṁ okaṭē tinalēmu
aṇḍī. Andulōki raitā, ālū maṭar, panīr masālā, pannīr baṭṭar masālā edainā uṇṭe kāmbinēṣan adiripōtōndi aṇḍī.

Comments