కందపులుసు తయారీ విధానం | కంద పులుసు కూర | కంద పులుసు రెసిపీ | కంద పులుసు ఏలె చెయ్యాలి | కందగడ్డ పులుసు Kandapulusu tayārī vidhānaṁ | kanda pulusu kūra | kanda pulusu resipī | kanda pulusu ēle ceyyāli | kandagaḍḍa pulusu ​


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • కంద గడ్డ - 300 - 400 గ్రా | Kanda gaḍḍa - 300 - 400 grā
 • ఆవాలు - 1 స్పూన్ | āvālu - 1 spūn
 • జీలకర్ర - 1 స్పూన్ | jīlakarra - 1 spūn
 • నూనె - 3-4 స్పూన్లు | nūne - 3-4 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • పసుపు - 1 స్పూన్ |pasupu - 1 spūn
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • ఉల్లిపాయలు - 2 పెద్దవి | ullipāyalu - 2 peddavi
 • టమోటా - 1-2 (ఐచ్ఛికం) | ṭamōṭā - 1-2 (aicchikaṁ)
 • ఆమ్చూర్ - 2-3 స్పూన్లు | āmcūr - 2-3 spūnlu
 • బెల్లం - 20 గ్రా | Bellaṁ - 20 grā
 • వెల్లుల్లి రెబ్బలు - 5 | vellulli rebbalu - 5
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • నీరు - 2-3 కప్పులు | nīru - 2-3 kappulu
 • వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్ | vēyin̄cina jīlakarra poḍi - 1 spūn
 
ముందుగా కంద తీస్కుని పైన తోలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కంద ముక్కలు వేసి మునిగే దాక నీరు పోసి పొయ్యి వెలిగించి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. (లేదంటే కుక్కర్ లో కంద ముక్కలు వేసుకుని ఒక కప్ నీరు పోసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కుక్కర్ తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి). పొయ్యి మీద గిన్నెలో ఉడికిస్తే ఒక 10నిముషాలు ఉడికిన తరువాత పొయ్యి ఆఫ్ చేసి గిన్నెర్ పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
Mundugā kanda tīskuni paina tōlu tīsi mukkalugā kōsukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka ginne peṭṭi andulō kanda mukkalu vēsi munigē dāka nīru pōsi poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda uḍikin̄cukōvāli. (Lēdaṇṭē kukkar lō kanda mukkalu vēsukuni oka kap nīru pōsukuni oka 2 visṭles vaccē varaku un̄ci tarvāta poyyi āph cēsi kukkar tīsi pakkana peṭṭi callāranivvāli). Poyyi mīda ginnelō uḍikistē oka 10nimuṣālu uḍikina taruvāta poyyi āph cēsi ginner pakkana peṭṭi callāranivvāli.
 
కంద ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతే చల్లటి నీరు పోసి కాసేపు ఉంచండి. ముక్కలు కొంచెం గట్టిబడి ముక్క చితకకుండా ఉంటుంది. ఈలోపు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి మీడియం మంట మీద వేడి చెయ్యాలి. వేడెక్కిన తరువాత అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో సన్నగా చీలికలుగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
Kanda mukkalu bāgā mettagā uḍikipōtē callaṭi nīru pōsi kāsēpu un̄caṇḍi. Mukkalu kon̄ceṁ gaṭṭibaḍi mukka citakakuṇḍā uṇṭundi. Īlōpu poyyi veligin̄ci oka pān peṭṭi mīḍiyaṁ maṇṭa mīda vēḍi ceyyāli. Vēḍekkina taruvāta andulō nūne vēsi vēḍi ceyyāli. Nūne vēḍi ayyina taruvāta andulō āvālu, jīlakarra vēsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta andulō sannagā cīlikalugā tarigina paccimirapakāya mukkalu, sannagā tarigina ullipāya mukkalu vēsi bāgā vēyin̄cukōvāli.
 
ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ (లేదంటే వెల్లుల్లి రెమ్మలు చిదిమి) వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు లేదా టమాటో గ్రైండ్ చేసుకుని గుజ్జు తీసి అది వేసుకుని బాగా వేయించుకోవాలి. టమాటో వెయ్యాలి అని లేదు వేసుకుంటే రుచి కొంచెం బాగుంటుంది అని గుజ్జు వేసుకుంటాము. టమాటో బాగా మగ్గి ఎరుపు రంగు వచ్చిన తరువాత అందులో ఆంచూర్, వేయించిన జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కంద ముక్కలు వేసి మసాలా, ఉప్పు, కారం అన్ని బాగా కలుపుకుని ఒక 2నిముషాలు ముక్కలని బాగా వేయించాలి.
Ippuḍu andulō uppu, kāraṁ, pasupu, vellulli pēsṭ(lēdaṇṭē vellulli rem'malu cidimi) vēsukuni bāgā vēyin̄cukōvāli. Pācc vāsana lēkuṇḍā vēyin̄cukōvāli. Ippuḍu ṭamāṭō mukkalu lēdā ṭamāṭō graiṇḍ cēsukuni gujju tīsi adi vēsukuni bāgā vēyin̄cukōvāli. Ṭamāṭō veyyāli ani lēdu vēsukuṇṭē ruci kon̄ceṁ bāguṇṭundi ani gujju vēsukuṇṭāmu. Ṭamāṭō bāgā maggi erupu raṅgu vaccina taruvāta andulō ān̄cūr, vēyin̄cina jīlakarra poḍi vēsukuni bāgā kalupukōvāli. Ippuḍu kanda mukkalu vēsi masālā, uppu, kāraṁ anni bāgā kalupukuni oka 2nimuṣālu mukkalani bāgā vēyin̄cāli
 
ఇప్పుడు కూర లో నీరు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. నీరు తగ్గి కూర గుజ్జుగా అవుతుంది. ఈలోపు కొంచెం బెల్లం వేసి కరిగేదాకా బాగా కలుపుకోవాలి. వేడికి త్వరగా కరిగిపోతుంది.
Ippuḍu kūra lō nīru pōsukuni bāgā uḍikin̄cukōvāli. Nīru taggi kūra gujjugā avutundi. Īlōpu kon̄ceṁ bellaṁ vēsi karigēdākā bāgā kalupukōvāli. Vēḍiki tvaragā karigipōtundi.
 
ఇప్పుడు అందులో కరివేపాకు వేసి ఉడికించుకోవాలి. నీరు తగ్గి కూర చిక్కబడిన తరువాత అందులో కొత్తిమీర వేసి కలుపుకుని పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి రుచికరమైన కంద గడ్డ కూర తయారుగా ఉంది. చాల రుచిగా ఉంటుంది. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి.
Ippuḍu andulō karivēpāku vēsi uḍikin̄cukōvāli. Nīru taggi kūra cikkabaḍina taruvāta andulō kottimīra vēsi kalupukuni poyyi āph cēsi pakkana peṭṭukōvāli. Antēnaṇḍi rucikaramaina kanda gaḍḍa kūra tayārugā undi. Cāla rucigā uṇṭundi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi.

Comments