కుక్కర్‌లో సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ | మటన్ కర్రీ రిసిపి | తక్కువ సమయంలో క్విక్ అండ్ టేస్టీ మటన్ కర్రీ | మటన్ కర్రీ తయారీ విధానం | సులువుగా చేసుకునే మటన్ కూర Kukkar‌lō simpul aṇḍ ījī maṭan karrī | maṭan karrī risipi | takkuva samayanlō kvik aṇḍ ṭēsṭī maṭan karrī | maṭan karrī tayārī vidhānaṁ | suluvugā cēsukunē maṭan kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • మటన్ - 500 గ్రా | Maṭan - 500 grā
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • అనాస పువ్వు - 1 | anāsa puvvu - 1
 • షాజీరా - 1 స్పూన్ | ṣājīrā - 1 spūn
 • లవంగాలు - 3 | lavaṅgālu - 3
 • కుక్కర్ - 1 | kukkar - 1
 • నీరు - 1 గ్లాస్ | nīru - 1 glās
  
ముందుగ మటన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీస్కుని చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓక కుక్కర్ తీస్కుని పొయ్యి వెలిగించి అధిక మంటలో పెట్టి వేడి చెయ్యాలి. ఇప్పుడు అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో అనాస పువ్వు, లవంగాలు వేసి వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
Munduga maṭan tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Ippuḍu reṇḍu ullipāyalu tīskuni cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Ōka kukkar tīskuni poyyi  veligin̄ci adhika maṇṭalō peṭṭi vēḍi ceyyāli. Ippuḍu andulō nūne vēsi vēḍicēyāli. Nūne vēḍi ayyinā taruvāta andulō anāsa puvvu, lavaṅgālu vēsi vēyin̄cāli. Taruvāta tarigina ullipāya mukkalu vēsi bāgā vēyin̄cāli.
 
ఇప్పుడూ అందులో ఉప్పు, కారం, షాజీరా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. బాగా ఫ్రై అయ్యిన తరువాత అందులో మటన్ వేసి ఓక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి.
Ippuḍū andulō uppu, kāraṁ, ṣājīrā, pasupu, allaṁ vellulli pēsṭ vēsi pacci vāsana pōyē varaku vēyin̄cāli. Bāgā phrai ayyina taruvāta andulō maṭan vēsi ōka 5 nimiṣālu uḍakanivvāli. Bāgā kalupukuṇṭū uḍakanivvāli.
 
ఇప్పుడు కుక్కర్ మూత 6-7 విజిల్స్ పెట్టి అధిక మంట వచ్చేవరకు ఉంచుకోవాలి. ఎక్కువ ఈలలు/విజిల్ వచ్చేవారికి ఉంచితే ముదురు మటన్ అయ్యిన సరే మెత్తగా ఊడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పక్కన్ పెట్టుకుని చల్లారనివ్వాలి. ఓక 10 నిమిషాలు అలా అయ్యిన తర్వాత కుక్కర్ చల్లారుతుంది. ఇప్పుడు మరల పొయ్యి వెలిగించి మీడియం మంట మీద కూర బాగా ఊడికించుకోవాలి. షేర్వాలాగా కావాలి, జూసి గా ఉండాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఊడికించుకోవాలి. లేదంటే మటన్ లో నుండి వచ్చిన నీరు తగ్గి కూర చిక్కబడే వరకు ఊడికించుకోవాలి.
Ippuḍu kukkar mūta 6-7 vijils peṭṭi adhika maṇṭa vaccēvaraku un̄cukōvāli. Ekkuva īlalu vaccēvāriki un̄citē muduru maṭan ayyinā sarē mettagā ūḍikipōtundi. Ippuḍu kukkar pakkan peṭṭukuni callāranivvāli. Ōka 10 nimiṣālu alā ayyinā tarvāta kukkar callārutundi. Ippuḍu marala poyyi veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda kūra bāgā ūḍikin̄cāli. Ṣērvālāgā kāvāli, jūsi gā uṇḍāli anukuṇṭē oka glās vāṭar pōsukuni uṇḍīn̄cukōvāli. Lēdaṇṭē maṭan lō nuṇḍi vaccina nīru taggi kūra cikkabaḍē varaku ūḍi kin̄cukōvāli. 
  
చివరిలో గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముక్క మెత్తగా ఉందో లేదో చూసుకోండి. బాగా ముదురు మటన్ అయితే కొంచెం ఎక్కువసేపు ఊడికించాలి. అంతేనండి ఎంతో రుచికరమైన మటన్ కూర సిద్దంగా ఉంది. చపాతీ, రోటీ, పుల్ఖాలో ఈ కూర చాలా బాగుంటుంది. జూసిగా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా తేలికగా చేసుకొని ఎక్కువ కూరను తినొచ్చు. ముక్క చాల మెత్తగా చాల బాగుంటుంది. తపకుండ చేసి ఎలా ఉందో చెప్పండి.
Civarilō garaṁ masālā vēsi bāgā kalupukōvāli. Mukka mettagā undō lēdō cūsukōṇḍi. Bāgā muduru maṭan ayitē kon̄ceṁ ekkuvasēpu ūḍikin̄cāli. Antēnaṇḍi entō rucikaramaina maṭan kūra siddaṅgā undi. Capātī, rōṭī, pulkhālō ī kūra cālā bāguṇṭundi. Jūsigā bāguṇṭundi. Ekkuva masālālu lēkuṇḍā tēlikagā cēsukoni ekkuva kūranu tinoccu. Mukka cāla mettagā cāla bāguṇṭundi. Tapakuṇḍa cēsi elā undō ceppaṇḍi.

Comments