దంబిర్యానీ విధానం | ధామ్ బిర్యానీ ఎలా చెయ్యాలి | రుచికరమైన ధూమ్ బిర్యానీ ఇంట్లో చేసుకోడం ఎలా Dambiryānī vidhānaṁ | dhām biryānī elā ceyyāli | rucikaramaina dhūm biryānī iṇṭlō cēsukōḍaṁ elā

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • బాస్మతి బియ్యం - 1 కేజీ | Bāsmati biyyaṁ - 1 kējī
 • చికెన్ - 500 గ్రా | ciken - 500 grā
 • నూనె - 5 స్పూన్లు | nūne - 5 spūnlu
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • మిరియాల గింజలు - 5 | miriyāla gin̄jalu - 5
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • ఏలకులు - 2 | ēlakulu - 2
 • దాల్చిన చెక్క - 2 | dālcina cekka - 2
 • బే ఆకు - 1 | bē āku - 1
 • అనస పుష్పం/నక్షత్ర పుష్పం - 1 | anasa puṣpaṁ/nakṣatra puṣpaṁ - 1
 • జాపత్రి/జాపత్రి - 1 | jāpatri/jāpatri - 1
 • నట్ మెగ్ / జాజికాయ - 1 | naṭ meg/ jājikāya - 1
 • కపోక్ బడ్స్ / మరాఠీ మొగ్గు - 1 | kapōk baḍs/ marāṭhī moggu - 1
 • షాజీరా - 1 స్పూన్ | ṣājīrā - 1 spūn
 • ఒక చిటికెడు కుంకుమపువ్వు | oka ciṭikeḍu kuṅkumapuvvu
 • నల్ల ఏలకులు - 2 | nalla ēlakulu - 2
 • జాజి పువ్వు - 1 | jāji puvvu - 1
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2-3 స్పూన్లు | kāraṁ poḍi - 2-3 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
 • గరం మసాలా పౌడర్ - 1 స్పూన్ | garaṁ masālā pauḍar - 1 spūn
 • పెరుగు/పెరుగు - 2 చెంచాలు | perugu/perugu - 2 cen̄cālu
 • కరివేపాకు తక్కువ | karivēpāku takkuva
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 • నెయ్యి - 3 స్పూన్లు | neyyi - 3 spūnlu
ముందుగా బాస్మతి బియ్యం తీస్కుని బాగా కడిగి 2 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుదిరితే ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వాళ్ళ చికెన్ త్వరగా ఉడుకుతుంది. అలాగే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ముక్కలకి పడతాయి.
Mundugā bāsmati biyyaṁ tīskuni bāgā kaḍigi 2 gaṇṭalu nīṭilō nānabeṭṭukōvāli. Ippuḍu ciken tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Kudiritē oka aragaṇṭa myārinēṭ cēsukōvaccu. Ilā ceyyaḍaṁ vāḷḷa ciken tvaragā uḍukutundi. Alāgē uppu, kāraṁ, masālālu annī mukkalaki paḍatāyi.

మ్యారినెట్ చేసుకోడానికి ఒక గిన్నెలో చికెన్ తీస్కుని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, పెరుగు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి.
Myārineṭ cēsukōḍāniki oka ginnelō ciken tīskuni andulō uppu, kāraṁ, pasupu, allaṁ vellulli pēsṭ, garaṁ masālā poḍi, perugu vēsukuni bāgā kalupukuni mūta peṭṭukōvāli.
 
ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. ప్యాన్ వేడి అయ్యిన తరువాత అందులోనెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడి అయ్యిన తరువాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తరువాత అవి తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా తరిగి నూనెలో వేయించుకోవాలి. ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ కడాయి తీస్కుని పొయ్యి మీద పెట్టి మధ్య మంట మీద వేడి చేసుకోవాలి. తరువాత నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో లవంగాలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, యాలుకలు, దాల్చిన చెక్క, బే ఆకు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, నల్ల యాలుకలు , జాజి కాయ, కరివేపాకు, వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా తరిగిన ముక్కలు అందులో వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అందులో టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి.
Ippuḍu poyyi veligin̄ci oka pyān peṭṭi vēḍi cēyāli. Pyān vēḍi ayyina taruvāta andulōneyyi vēsi vēḍi cēyāli. Neyyi vēḍi ayyina taruvāta andulō jīḍipappu vēsi vēyin̄cukōvāli. Jīḍipappu vēgina taruvāta avi tīsi pakkana plēṭ lō peṭṭukōvāli. Ippuḍu oka ullipāya poṭṭu tīsi sannagā tarigi nūnelō vēyin̄cukōvāli. Muduru gōdhuma raṅgu vaccē varaku vēyin̄cukuni pakkana plēṭ lō peṭṭukōvāli. Ippuḍu oka biryānī kaḍāyi tīskuni poyyi mīda peṭṭi madhya maṇṭa mīda vēḍi cēsukōvāli. Taruvāta nūne vēsi vēḍi cēyāli. Ippuḍu andulō lavaṅgālu, miriyālu, paccimirapakāyalu, yālukalu, dālcina cekka, bē āku, anāsa puvvu, jāpatri, jājikāya, marāṭhī mogga, nalla yālukalu, jāji kāya, karivēpāku, vēsi vēyin̄cukōvāli. Ippuḍu oka ullipāya poṭṭu tīsi sannagā tarigina mukkalu andulō vēsukuni vēyin̄cukōvāli. Ullipāya mukkalu vēgina taruvāta andulō ṭamāṭō mukkalu vēsi vēyin̄cukōvāli.
 
టమాటో ముక్కలు వేగిన తరువాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. చికెన్ లో నుంచి నీరు వస్తుంది. చికెన్ లో వచ్చిన నీరు తగ్గే వరకు ఉడకనివ్వాలి.
Ṭamāṭō mukkalu vēgina taruvāta myārinēṭ cēsi pakkana peṭṭukunna ciken vēsukuni bāgā kalupukuni uḍikin̄cukōvāli. Ciken lō nun̄ci nīru vastundi. Ciken lō vaccina nīru taggē varaku uḍakanivvāli.
ఇప్పుడు ఒక పాన్ తీస్కుని వేరే పొయ్యి వెలిగించి అందులో ఒక చెంచా నూనె వేసి వేడి చేయాలి. వేడి అయ్యిన తరువాత అందులో లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, పొదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి నీరు పోసి ఉడికించాలి. ఇప్పుడు బాస్మతి రైస్ కడిగి పాన్ లో వేసుకుని ఉడికించుకోవాలి. బియ్యం మునిగే వరకు నీరు పోసుకోవాలి. పూర్తిగాఉడించాల్సిన అవసరం లేదు, సగం ఉడికిస్తే సరిపోతుంది. తరువాత రైస్ ని చిల్లుల గిన్నెలో వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
Ippuḍu oka pān tīskuni vērē poyyi veligin̄ci andulō oka cen̄cā nūne vēsi vēḍi cēyāli. Vēḍi ayyina taruvāta andulō lavaṅgālu, yālukalu, dālcina cekka, podīnā, kottimīra, uppu vēsi nīru pōsi uḍikin̄cāli. Ippuḍu bāsmati rais kaḍigi pān lō vēsukuni uḍikin̄cukōvāli. Biyyaṁ munigē varaku nīru pōsukōvāli. Pūrtigā'uḍin̄cālsina avasaraṁ lēdu, sagaṁ uḍikistē saripōtundi. Taruvāta rais ni cillula ginnelō vaḍakaṭṭi pakkana peṭṭukōvāli.
 
ఈలోపు చికెన్ లో నీరు తగ్గుతుంది. ఇప్పుడు బిర్యానీ కడాయిలో పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుని కొంచెం నీరు చల్లాలి. బియ్యం సగం వరకు ఉంది కాబట్టి ఎక్కువ నీరు పోవాల్సిన అవసరం లేదు. బియ్యం పైన వేయించిన ఉల్లిపాయ, జీడిపప్పు, కొత్తిమీర, పొదీనా, కుంకుమ పువ్వు, నెయ్యి, కలర్ వేసి పైన మూట పెట్టుకోవాలి. గాలి వెళ్లకుండా చపాతీ పిండి చుట్టూ పెట్టుకుని ఒక 10-15 చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల వాసన బయటికి రాదు. దామ్ బిర్యానీ బాగా అవుతుంది. కారం ఎక్కువ తినేవారు మసాలాలు, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
Īlōpu ciken lō nīru taggutundi. Ippuḍu biryānī kaḍāyilō pakkana peṭṭukunna bāsmati biyyaṁ vēsukuni kon̄ceṁ nīru callāli. Biyyaṁ sagaṁ varaku undi kābaṭṭi ekkuva nīru pōvālsina avasaraṁ lēdu. Biyyaṁ paina vēyin̄cina ullipāya, jīḍipappu, kottimīra, podīnā, kuṅkuma puvvu, neyyi, kalar vēsi paina mūṭa peṭṭukōvāli. Gāli veḷlakuṇḍā capātī piṇḍi cuṭṭū peṭṭukuni oka 10-15 cinna maṇṭa mīda uḍikin̄cukōvāli. Mūta peṭṭukōvaḍaṁ valla vāsana bayaṭiki rādu. Dām biryānī bāgā avutundi. Kāraṁ ekkuva tinēvāru masālālu, kāraṁ kon̄ceṁ ekkuva vēsukōvāli.
 
అంతేనండి రుచికరమైన దామ్ బిర్యానీ సిద్ధంగా ఉంది. రైటా ఉంటె చాల బాగుంటుంది. తప్పకుండా చేసి ఎలా ఉందొ చెప్పండి.
Antēnaṇḍi rucikaramaina dām biryānī sid'dhaṅgā undi. Raiṭā uṇṭe cāla bāguṇṭundi. Tappakuṇḍā cēsi elā undo ceppaṇḍi.

బాస్మతి రైస్ విడిగా ఉడికించాలి అనుకుంటే ఒక కుక్కర్ లో నూనె వేసి లవంగాలు, మిరియాలు, యలుకాయ, పొదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకుని నీరు పోసుకుని బియ్యం వేసి బాగా 2 పొయ్యి ఆపేసి ఆ బియ్యం బిర్యానీ కడాయిలో బిర్యానీకి 1 గ్లాస్ బియ్యం స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. అలాగే 1 గ్లాస్ బియ్యం కి ఒకటి, అర నీరు పోసుకోవాలి. అప్పుడు బియ్యం గట్టిగ ఉడుకుతుంది. లేదంటే బిర్యానీ మెత్తగా అయ్యిపోతుంది.
Bāsmati rais viḍigā uḍikin̄cāli anukuṇṭē oka kukkar lō nūne vēsi lavaṅgālu, miriyālu, yalukāya, podīnā, kottimīra, uppu vēsukuni nīru pōsukuni biyyaṁ vēsi bāgā 2 poyyi āpēsi ā biyyaṁ biryānī kaḍāyilō biryānīki 1 glās biyyaṁ spūn uppu vēsukōvaccu. Alāgē 1 glās biyyaṁ ki okaṭi, ara nīru pōsukōvāli. Appuḍu biyyaṁ gaṭṭiga uḍukutundi. Lēdaṇṭē biryānī mettagā ayyipōtundi.

Comments