గుడ్డు మసాలా కూర తయారీ విధానం | గుడ్డు కూర గుజ్జుగా ఇలా చేసి చూడండి | సులభమైన గుడ్డు కూర వంటకం | ఎగ్ గ్రేవీ కర్రీ Guḍḍu masālā kūra tayārī vidhānaṁ | guḍḍu kūra gujjugā ilā cēsi cūḍaṇḍi | sulabhamaina guḍḍu kūra vaṇṭakaṁ | eg grēvī karrī

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • ఉడికించిన గుడ్లు - 6 | Uḍikin̄cina guḍlu - 6
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • టొమాటో - 2 | ṭomāṭō - 2
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • పెరుగు - 1 చెంచా | perugu - 1 cen̄cā
 • వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్ | vēyin̄cina jīlakarra poḍi - 1 spūn
 • గరం మసాలా పొడి - 1 స్పూన్ | garaṁ masālā poḍi - 1 spūn
 • పచ్చిమిర్చి - 2 | Paccimirci - 2
 • మిరియాల గింజలు - 5 | miriyāla gin̄jalu - 5
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • దాల్చిన చెక్క - 1 | dālcina cekka - 1
  
ముందుగ పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చెయ్యాలి. తరువాత అందులో నునే వేసి బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడూ నునే వేడి అయ్యిన తరువాత అందులో జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయంచుకోవాలి.ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తరువాత అందులో ఒక చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా చాలా మెత్తగా ఉడుకుతుంది. తరువాత అందులో కారం, పసుపు, అల్లం వెల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి.
Munduga poyyi veligin̄ci oka pyān peṭṭi vēḍi ceyyāli taruvāta andulō nunē vēsi bāgā vēḍi cēsukōvāli. Ippuḍū nunē vēḍi ayyinā taruvāta andulō jīlakarra, karivēpāku, miriyālu, dālcina cekka, lavaṅgālu vēsi vēyin̄cāli. Taruvāta andulō tarigina ullipāya mukkalu, Paccimirapakāya mukkalu  vēsi vēyan̄cukōvāli. Ullipāya mukkalu kon̄ceṁ maggina taruvāta andulō oka cen̄cā uppu vēsukuni bāgā kalupukōvāli. Ilā kon̄ceṁ vēgina tarvāta uppu vēstē ullipāya mukkalu tvaragā cālā mettagā uḍukutundi. Taruvāta andulō kāraṁ, pasupu, allaṁ velli mudda vēsi bāgā kalupukōvāli. Pacci vāsana pōyēdākā vēyin̄cukōvāli.
 
ఇప్పుడు టమోటా ముక్కలూ మిక్సీ జార్ వేసి పేస్ట్లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ టమోటా గుజ్జుని ఊడించిన ఉల్లిపాయ ముక్కలలో వేసి బాగా కలుపుకుని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కొంచెం నీరు తగ్గి చిక్కబడుతోంది. అలాగే కూర రంగు మారి ముదురు ఎరుపు రంగులోకి వస్తుంది. అలాగే కూరలో నువ్వు కూడా బయటికి వస్తావు వేపుడు కూరలో వచ్చినట్టుగా.
Ippuḍu ṭamōṭā mukkalū miksī jār vēsi pēsṭlāgā rubbukōvāli. Ippuḍu ā ṭamōṭā gujjuni ūḍin̄cina ullipāya mukkalalō vēsi bāgā kalupukuni kon̄ceṁ magganivvāli. Kon̄ceṁ kon̄ceṁ nīru taggi cikkabaḍutōndi. Alāgē kūra raṅgu māri muduru erupu raṅgulōki vastundi. Alāgē kūralō nuvvu kūḍā bayaṭiki vastāvu vēpuḍu kūralō vaccinaṭṭugā.
  
ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టిన గుడ్లు తీసుకోవాలి. గుడ్లకి కొంచెం గాట్లు పెట్టుకోవాలి.  ఇలా చేయడం వల్ల  గుడ్డు మధ్యలోకి ఉప్పు, కారం వెల్లి రుచి బాగుంటుంది. ఇపుడు ఒక పాన్ తీస్కుని అందులో కొంచెం నూనె వేసి గుడ్లు వేయించుకోవాలి. పయిన కొంచెం రంగు మారి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుంటే చాల బాగుంటుంది. ఇలా వేయించిన గుడ్లు తీసి పక్కన పెట్టుకోవాలి.
Mundugā uḍakabeṭṭi pakkana peṭṭina guḍlu tīsukōvāli. Guḍlaki kon̄ceṁ gāṭlu peṭṭukōvāli. Ilā cēyaḍaṁ valla guḍḍu madhyalōki uppu, kāraṁ velli ruci bāguṇṭundi. Ipuḍu oka pān tīskuni andulō kon̄ceṁ nūne vēsi guḍlu vēyin̄cukōvāli. Payina kon̄ceṁ raṅgu māri erupu raṅgu vaccē varaku vēyin̄cukuṇṭē cāla bāguṇṭundi. Ilā vēyin̄cina guḍlu tīsi pakkana peṭṭukōvāli.
 
ఇపుడు వేయించిన గుడ్లు కూరలో వేసి బాగా కలుపుకోవాలి. గుడ్లకి గాట్లు పెట్టాం కాబట్టి ఉప్పు, కారం బాగా పడుతుంది. రుచిగా కూడా ఉంటాయి.
Ipuḍu vēyin̄cina guḍlu kūralō vēsi bāgā kalupukōvāli. Guḍlaki gāṭlu peṭṭāṁ kābaṭṭi uppu, kāraṁ bāgā paḍutundi. Rucigā kūḍā uṇṭāyi.
 
ఇప్పుడు అందులో కొంచెం వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2నిముషాలు ఉడకనివ్వాలి.
Ippuḍu andulō kon̄ceṁ vēyin̄cina jīlakarra poḍi, garaṁ masālā poḍi vēsi bāgā kalupukōvāli. Oka 2nimuṣālu uḍakanivvāli.
 
ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉంటె పెరుగు బాగా కలిసి కూర చాలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది.
Ippuḍu andulō perugu vēsi bāgā kalupukōvāli. Bāgā kaluputū uṇṭe perugu bāgā kalisi kūra cālā gujju gujjugā uṇṭundi.
 
చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన మసాలా గుడ్డు కూర సిద్ధంగా ఉంది. పరోటా, రోటి, చపాతీ, జీరా రైస్ లోకి ఈ మసాలా గుడ్డు కూర చాల రుచిగా ఉంటుంది. మళ్ళి మళ్ళి తినాలనిపించేలా మసాలా గుడ్డు కూర తప్పకుండా చేసి ఎలా వచ్చిందో చెప్పండి.
Civarigā kottimīra vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina masālā guḍḍu kūra sid'dhaṅgā undi. Parōṭā, rōṭi, capātī, jīrā rais lōki ī masālā guḍḍu kūra cāla rucigā uṇṭundi. Maḷḷi maḷḷi tinālanipin̄cēlā masālā guḍḍu kūra tappakuṇḍā cēsi elā vaccindō ceppaṇḍi.

Comments