కందిపప్పు చారు తయారీ విధానం | పప్పు పులుసు ఎలా తయారు చేయాలి | పప్పు చారు రెసిపీ Kandipappu cāru tayārī vidhānaṁ | pappu pulusu elā tayāru cēyāli | pappu cāru resipī ​


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • కందిపప్పు - 1 కప్పు | Kandipappu - 1 kappu
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • ఉల్లిపాయ - 2 స్పూన్లు | ullipāya - 2 spūnlu
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • పసుపు - చెంచా | pasupu - cen̄cā
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం పొడి - 2 స్పూన్లు | kāraṁ poḍi - 2 spūnlu
 • చింతపండు - 10 గ్రా | cintapaṇḍu - 10 grā
 • కరివేపాకు తక్కువ | karivēpāku takkuva
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • నీరు - 5-6 కప్పులు | nīru - 5-6 kappulu
  
ముందుగా కందిప్పు తీస్కుని బాగా కడిగి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీరు పోసి కుక్కర్ లో ఉడికించాలి. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంటె పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. ఉల్లిపాయ పొత్తు తీసి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. టమాటో కూడా పెద్ద ముక్కలు కోసుకోవాలి. చింతపండు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి మధ్య మంట మీద వేడి చెయ్యాలి. తరువాత నూనె వేసి బాగా వేడి చేయాలి. వేడి అయ్యిన తరువాత అందులో పసుపు నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. అందులో తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ముక్కలు కొంచెం ఊడిన తరువాత అందులో ఉప్పు వేస్తే ముక్కలు బాగా మెత్తగా ఉడుకతాయి. ఇప్పుడు కారం వేసి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీరు పోసి బాగా ఉడికించాలి. ముక్కలు నీటిలో ఊడితే బాగా ఉప్పు, కారం పడుతుంది.
Mundugā kandippu tīskuni bāgā kaḍigi oka kappu pappuki reṇḍu kappulu nīru pōsi kukkar lō uḍikin̄cāli. 3-4 Vijils vaccēdākā uṇṭe pappu cālā mettagā uḍukutundi. Ullipāya pottu tīsi pedda mukkalugā kōsukōvāli. Ṭamāṭō kūḍā pedda mukkalu kōsukōvāli. Cintapaṇḍu nīṭilō nānabeṭṭi pakkana peṭṭukōvāli. Taruvāta poyyi veligin̄ci oka kaḍāyi peṭṭi madhya maṇṭa mīda vēḍi ceyyāli. Taruvāta nūne vēsi bāgā vēḍi cēyāli. Vēḍi ayyina taruvāta andulō pasupu nūne, āvālu, jīlakarra, karivēpāku vēsi vēyin̄cāli. Andulō taruvāta tarigina ullipāya mukkalu, ṭomāṭō mukkalu vēsi vēyin̄cāli. Paccimirapakāya mukkalu vēsi vēyin̄cukōvāli. Mukkalu kon̄ceṁ ūḍina taruvāta andulō uppu vēstē mukkalu bāgā mettagā uḍukatāyi. Ippuḍu kāraṁ vēsi mukkalaki paṭṭēlā bāgā kalupukōvāli. Ippuḍu nīru pōsi bāgā uḍikin̄cāli. Mukkalu nīṭilō ūḍitē bāgā uppu, kāraṁ paḍutundi.

ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి అందులో పోసుకోవాలి. బాగా మరిగిన తరువాత కందిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కందిపప్పు గట్టిగ ఉంటె మిక్సీలో గ్రైండ్ చేసుకుని చారులో వేసుకోవాలి. బాగా మరిగిన తరువాత ఉప్పు, కారం రుచి చూసుకుని అవసరమైతే కొంచెం వేసుకోవాలి. చారు కొంచెం చిక్కబడే దాక ఉంచుకుని పొయ్యి ఆపేసి కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి చాలా తేలికగా కందిపప్పు చారు ఇలా పెట్టుకోవాలి. తప్పకుండా చేసి ఎలా ఉందొ చెప్పండి.
Ippuḍu cintapaṇḍu gujju tīsi andulō pōsukōvāli. Bāgā marigina taruvāta kandipappu vēsukuni bāgā kalupukōvāli. Kandipappu gaṭṭiga uṇṭe miksīlō graiṇḍ cēsukuni cārulō vēsukōvāli. Bāgā marigina taruvāta uppu, kāraṁ ruci cūsukuni avasaramaitē kon̄ceṁ vēsukōvāli. Cāru kon̄ceṁ cikkabaḍē dāka un̄cukuni poyyi āpēsi kottimīra vēsukuni bāgā kalupukunikaḍāyi tīsi pakkana peṭṭukōvāli. Antēnaṇḍi cālā tēlikagā kandipappu cāru ilā peṭṭukōvāli. Tappakuṇḍā cēsi elā undo ceppaṇḍi.

Comments