కుక్కర్‌లో సింపుల్ మటన్ కర్రీ | కుక్కర్‌లో మటన్ గ్రేవీ కర్రీ | మటన్ కూర ఎలా చెయ్యాలి Kukkar‌lō simpul maṭan karrī | kukkar‌lō maṭan grēvī karrī | maṭan kūra elā ceyyāli

కావలసిన పదార్థాలు | Kāvalasina padārthālu:
  • మటన్ - 500 గ్రా | Maṭan - 500 grā
  • నూనె - 5-6 స్పూన్లు | nūne - 5-6 spūnlu
  • ఉల్లిపాయలు - 5 | ullipāyalu - 5
  • కరివేపాకు | karivēpāku
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • కారం పొడి - 2 స్పూన్లు | kāraṁ poḍi - 2 spūnlu
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
  • గరం మసాలా పొడి - 1 స్పూన్ | garaṁ masālā poḍi - 1 spūn
  • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 
ముందుగా మటన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పొట్టు తీస్కుని చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయ్యిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం మెత్తగా వేగిన తరువాత అందులో ఉప్పు వేసుకోవాలి.
Mundugā maṭan tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Ullipāyalu poṭṭu tīskuni cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka kukkar peṭṭukuni vēḍi cēsukōvāli. Vēḍi ayyina taruvāta andulō nūne vēsi vēḍi cēyāli. Nūne Bāgā vēḍi ayyina taruvāta andulō ullipaya mukkalu vēsi bāgā vēyin̄cukōvāli. Kon̄ceṁ mettagā vēgina taruvāta andulō uppu vēsukōvāli.
 
ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి. తరువాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తరువాత అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకుని ఒక 10 నిముషాలు వరకు మధ్యమ మంట మీద వేగనివ్వాలి. మటన్ ముక్కలు నుంచి నీరు వస్తూ ఉంటుంది.
Uppu vēyaḍaṁ valla ullipāya mukkalu tvaragā uḍukutāyi. Taruvāta karivēpāku vēsukōvāli. Ullipāya bāgā maggina taruvāta andulō kāraṁ vēsi bāgā kalupukōvāli. Ippuḍu maṭan mukkalu vēsukuni oka 10 nimuṣālu varaku madhyama maṇṭa mīda vēganivvāli. Maṭan mukkalu nun̄ci nīru vastū uṇṭundi.
  
 ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేయించాలి. 1 కప్పు నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేవరకు పెద్ద మంట మీద ఉంచాలి. తరువాత పొయ్యి ఆపేసి కుక్కర్ చల్లారనివ్వాలి. తరువాత మళ్ళి పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి మధ్య మంట మీద ఉడికించాలి. మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. కొంచెం సమయం ఉడికించాలి. తరువాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి రుచికరమైన మటన్ కూర సిద్ధంగా ఉంది. తక్కువ మసాలాలతో మటన్ కూర చాల బాగా కుదురుతుంది. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి.
Ippuḍu allaṁ vellulli pēsṭ vesi kalipi vēyin̄cāli. 1 Kappu nīru pōsi kukkar mūta peṭṭi 5-6 vijils vaccēvaraku pedda maṇṭa mīda un̄cāli. Taruvāta poyyi āpēsi kukkar callāranivvāli. Taruvāta maḷḷi poyyi veligin̄ci kukkar peṭṭi madhya maṇṭa mīda uḍikin̄cāli. Maṭan mukkalu bāgā mettagā uḍikindō lēdō cūsukōvāli. Kon̄ceṁ samayaṁ Udikinchali. Taruvāta garam masālā vēsi bāgā kalupukōvāli. Civarigā kottimīra vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi rucikaramaina maṭan kūra sid'dhaṅgā undi. Takkuva masālālatō maṭan kūra cāla bāgā kudurutundi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi.

Comments