పనీర్ కర్రీ తయారీ విధానం | సులభమైన పనీర్ కర్రీ రిసిపి | బటర్ పనీర్ కర్రీ ఎలా తయారు చేయాలి | పనీర్ కర్రీ రిసిపి Panīr karrī tayārī vidhānaṁ | sulabhamaina panīr karrī risipi | baṭar panīr karrī elā tayāru cēyāli | panīr karrī risipi

కావలసిన పదార్థాలు | Kāvalasina padārthālu:
 • పనీర్ - 250 గ్రా | Panīr - 250 grā
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • టొమాటో - 6 | ṭomāṭō - 6
 • నూనె - 3-5 స్పూన్లు | nūne - 3-5 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1-2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 1-2 spūnlu
 • జీడిపప్పు - 6 | jīḍipappu - 6
 • లవంగాలు - 5 | lavaṅgālu - 5
 • యాలుకలు - 5 | yālukalu - 5
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • దాల్చిన చెక్క - 2 | dālcina cekka - 2
 • వెన్న/బట్టర్ - 20 గ్రా | venna/Butter - 20 grā
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2-3 స్పూన్లు | kāraṁ - 2-3 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • గరం మసాలా పౌడర్ - 1 స్పూన్ | garaṁ masālā pauḍar - 1 spūn
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 
ముందుగా టొమాటోలు తీస్కుని బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీస్కుని అందులో టమాటో ముక్కలు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ పొట్టు తీసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తరువాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటో మగ్గి నీరు తగ్గిపోయి దగ్గరికి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. కూర బాగా దగ్గరకి వచ్చి నూనె వస్తుంది. ఇప్పుడు బట్టర్ వేసుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి. 2నిముషాలు ఊడితే బట్టర్ కరిగి కూర వాసన బాగుంటుంది. అలాగే రుచికి రుచి బాగుంటుంది.కూర చిక్కబడే లోపు పన్నీర్ ఉడికించుకోవాలి. 
Mundugā ṭomāṭōlu tīskuni bāgā kaḍigi cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Ippuḍu oka miksī jār tīskuni andulō ṭamāṭō mukkalu vēsi pēsṭ lāgā graiṇḍ cēsukuni pakkana peṭṭukōvāli. Alāgē ullipāya poṭṭu tīsi mukkalu kōsi pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pyān peṭṭi mīḍiyaṁ maṇṭa mīda vēḍi cēsukōvāli. Pyān vēḍi ayyina taruvāta andulō nūne vēsi vēḍi cēsukōvāli. NūneVēḍi ayyina taruvāta andulō āvālu, jīlakarra, ullipāya mukkalu, karivēpāku, Jīḍipappu, lavaṅgālu, dālcina cekka, yālukāyalu vēsi bāgā vēyin̄cukōvāli. Ullipāya bāgā maggina taruvāta andulō kon̄ceṁ pasupu, uppu vēsukuni bāgā kalupukōvāli. Ippuḍu ṭamāṭō gujju vēsukuni bāgā kalupukōvāli. Ṭamāṭō maggi nīru taggipōyi daggariki vaccēdākā vēyin̄cukōvāli. Ippuḍu andulō kāraṁ vēsukuni bāgā kalupukōvāli. Ippuḍu andulō allaṁ vellulli pēsṭ vēsi pacci vāsana pōyēdākā kalupukuṇṭū vēyin̄cukōvāli. Ippuḍu mūta peṭṭi kon̄censēpu magganivvāli. Kūra bāgā daggaraki vacci nūne vastundi. Ippuḍu baṭṭar vēsukuni kon̄censēpu uḍikin̄cukōvāli. 2Nimuṣālu ūḍitē baṭṭar karigi kūra vāsana bāguṇṭundi. Alāgē ruciki ruci bāguṇṭundi.Kūra cikkabaḍē lōpu pannīr uḍikin̄cukōvāli. 
 
పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో నీరు పోసుకుని పన్నీర్ ముక్కలు వేసుకుని ఒక 2 నిముషాలు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. పన్నీర్ ముక్కలు మునిగేలా నీరు పోసుకుంటే సరిపోతుంది. తరువాత నీరు తీసేసి పన్నీర్ ముక్కలు టమాటో గుజ్జులో వేసి బాగా కలుపుకుని ఒక 5నిముషాలు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు , కారం పడ్తుంది. అలాగే నీటిలో ఉడికించినందువల్ల వల్ల పన్నీర్ ముక్కలు మెత్తగా ఉంటాయి. తరువాత గరం మసాలా వేసి 2 నిముషాలు ఉడికించాలి. చివరిలో కొత్తిమీర వేసుకుని బాగా కలుపుని పొయ్యి ఆపేసి ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి చాల రుచిగా, మంచి సువాసనతో గుమ గుమలాడే పన్నీర్ కూర సిద్ధంగా ఉంది. పన్నీర్ కూర అన్నంలోకి, జీరా రైస్, వేజిటబుల్ పులావ్ లోకి చాల బాగుంటుంది. తప్పకుండ చేసి ఎలా ఉందొ చెప్పండి.
Poyyi veligin̄ci kaḍāyi peṭṭi andulō nīru pōsukuni pannīr mukkalu vēsukuni oka 2 nimuṣālu pedda maṇṭa mīda uḍikin̄cukōvāli. Pannīr mukkalu munigēlā nīru pōsukuṇṭē saripōtundi. Taruvāta nīru tīsēsi pannīr mukkalu ṭamāṭō gujjulō vēsi bāgā kalupukuni oka 5nimuṣālu uḍikin̄cāli. Ilā uḍikin̄caḍaṁ vāḷḷa pannīr mukkalaki uppu, kāraṁ paḍtundi. Alāgē nīṭilō uḍikin̄cinanduvalla vāḷḷa pannīr mukkalu mettagā uṇṭāyi. Taruvāta garaṁ masālā vēsi 2 nimuṣālu uḍikin̄cāli. Civarilō kottimīra vēsukuni bāgā kalupuni poyyi āpēsi pyān tīsi pakkana peṭṭukōvāli. Antēnaṇḍi cāla rucigā, man̄ci suvāsanatō guma gumalāḍē pannīr kūra sid'dhaṅgā undi. Pannīr kūra annanlōki, jīrā rais, vējiṭabul pulāv lōki cāla bāguṇṭundi. Tappakuṇḍa cēsi elā undo ceppaṇḍi.

టిప్: పన్నీర్ మెత్తగా ఇష్టం లేని వారు నీటిలో ఉండికించాక కొంచెం ఆయిల్ లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని అందులో వేయించుకుని తరువాత కూర లో వేసుకుంటే పన్నీర్ ముక్కలు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి.
Ṭip: Pannīr mettagā iṣṭaṁ lēni vāru nīṭilō uṇḍikin̄cāka kon̄ceṁ āyil lō uppu, kāraṁ, pasupu vēsukuni andulō vēyin̄cukuni taruvāta kūra lō vēsukuṇṭē pannīr mukkalu kon̄ceṁ karakaralāḍutū uṇṭāyi.

Comments