పొదీనా చికెన్ తయారీ విధానం | పొదీనా చికెన్ రెసిపీ | పొదీనా చికెన్ కలిపి ఇలా చూడండి | తప్పకుండ చేయాల్సిన రెసిపీ | Podīna ciken tayārī vidhānaṁ | podīnā ciken resipī | podīnā ciken kalipi ilā cūḍaṇḍi | tappakuṇḍa cēyālsina resipī ​

కావలసిన పదార్ధాలు | Kāvalasina padārdhālu:
 • చికెన్ - 1 కేజీ | Ciken - 1 kējī
 • పుదీనా ఆకులు - 100 గ్రా | pudīnā ākulu - 100 grā
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • పచ్చిమిర్చి - 5-6 | paccimirci - 5-6
 • నూనె - 5-6 స్పూన్లు | nūne - 5-6 spūnlu
 • జీడిపప్పు - 10 | jīḍipappu - 10
 • రుచి ప్రకారం ఉప్పు / 1-2 స్పూన్లు | ruci prakāraṁ uppu/ 1-2 spūnlu
 • పెరుగు - 2 స్పూన్లు | perugu - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2-3 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2-3 spūnlu
 • గరం మసాలా పౌడర్ - 1-2 స్పూన్లు | garaṁ masālā pauḍar - 1-2 spūnlu
 • వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్ | vēyin̄cina jīlakarra poḍi - 1 spūn
 • ధనియాల పొడి / ధనియా పొడి - 2 స్పూన్లు | dhaniyāla poḍi/ dhaniyā poḍi - 2 spūnlu
 • మిరియాల పొడి - 1-2 స్పూన్లు | miriyāla poḍi - 1-2 spūnlu
 • కొత్తిమీర ఆకులు | kottimīra ākulu
   
ముందుగా చికెన్ తీస్కుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక చెంచా ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి.
Mundugā ciken tīskuni bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Andulō oka cen̄cā uppu, pasupu, perugu, allaṁ vellulli pēsṭ vēsi bāgā kalupukuni pakkana peṭṭukuni mūta peṭṭukōvāli.
  
ఇప్పుడు ఒక గిన్నెలో జీడిపప్పు వేసి నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
Ippuḍu oka ginnelō jīḍipappu vēsi nīṭilō nānabeṭṭukōvāli. Alāgē ullipāya poṭṭu tīsi sannagā tarigi pakkana peṭṭukōvāli.
 
ఇప్పుడు ఒక ప్యాన్ తీస్కుని అందులో రెండు చెంచాలు నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తరువాత అందులో నూనె తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇలా గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. తరువాత పొయ్యి ఆపేసి ఉల్లిపాయ తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ముందుగా కడిగి శుభ్రపరుచుకున్న పొదీనా ఆకులు తీస్కుని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. అలాగే వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు తీస్కుని ముందుగా పొందిన మిక్సీ జార్ లో వేసుకోవాలి. తరువాత ఆ పదార్ధాలు అన్నింటిని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
Ippuḍu oka pyān tīskuni andulō reṇḍu cen̄cālu nūne vēsi vēḍi cēsukōvāli. Vēḍekkina taruvāta andulō nūne tarigina ullipāya mukkalu vēsukuni ilā gōdhuma raṅgu vaccēdākā vēyin̄cāli. Taruvāta poyyi āpēsi ullipāya tīsi pakkana peṭṭi callāranivvāli. Mundugā kaḍigi śubhraparucukunna podīnā ākulu tīskuni oka miksī jār lō vēsukōvāli. Alāgē vēyin̄cina ullipāya mukkalu, paccimirapakāyalu vēsukōvāli. Nānabeṭṭina jīḍipappu tīskuni mundugā pondina miksī jār lō vēsukōvāli. Taruvāta ā padārdhālu anniṇṭini mettagā pēsṭ lāgā rubbukōvāli.
  
ఇపుడు ఆ పొదీనా పేస్ట్ ని చికెన్ లో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కుదిరితే ఒక 30నిముషాలు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ కి ఉప్పు, పచ్చిమిరపకాయ కారం పట్టి రుచి బాగుంటుంది. సమయం తక్కువ ఉన్నవారు వెంటనే వండుకోవచ్చు.
Ipuḍu ā podīnā pēsṭ ni ciken lō vēsi bāgā kalupukōvāli. Mukkalaku paṭṭēlā bāgā kalupukuni mūta peṭṭi pakkana peṭṭukōvāli. Kudiritē oka 30nimuṣālu myārinēṭ cēstē bāguṇṭundi. Myārinēṭ cēyaḍaṁ valla ciken ki uppu, paccimirapakāya kāraṁ paṭṭi ruci bāguṇṭundi. Samayaṁ takkuva unnavāru veṇṭanē vaṇḍukōvaccu.
 
ఇప్పుడు పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మూడు చెంచాలు నూనె వేసి వేడి చేయాలి. బాగా వేడి అయ్యిన తరువాత అందులో నూనె షాజీరా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.
Ippuḍu poyyi veligin̄ci pyān peṭṭi andulō mūḍu cen̄cālu nūne vēsi vēḍi cēyāli. Bāgā vēḍi ayyina taruvāta andulō nūne ṣājīrā vēsukuni vēyin̄cukōvāli. Ippuḍu myārinēṭ cēsina ciken andulō vēsukuni bāgā kalupukōvāli.
 
చికెన్ ని కలుపుతూ పెద్ద మంట మీద వేయించుకోవాలి. బాగా కలిసేలా కలుపుతూ ఫ్రై నూనె చేసుకోవాలి.
Ciken ni kaluputū pedda maṇṭa mīda vēyin̄cukōvāli. Bāgā kalisēlā kaluputū phrai nūne cēsukōvāli.
 
ఇప్పుడు చికెన్ లో నుంచి నీరు వస్తుంది. నీరు తగ్గేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలాపొడి, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
Ippuḍu ciken lō nun̄ci nīru vastundi. Nīru taggēdākā bāgā uḍikin̄cukōvāli. Ippuḍu kon̄ceṁ vēyin̄cina jīlakarra poḍi, garaṁ masālāpoḍi, dhaniyāla poḍi vēsukuni bāgā kalupukōvāli.
 
పొదీనా వేసాము కాబట్టి కొంచెం పసర వాసన వస్తుంది. బాగా ఉడితే ఆ వాసన తగ్గుతుంది. చికెన్ లో నీరు తగ్గింది కాబట్టి ఇంకా మధ్య మంట/మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
Podīnā vēsāmu kābaṭṭi kon̄ceṁ pasara vāsana vastundi. Bāgā uḍitē ā vāsana taggutundi. Ciken lō nīru taggindi kābaṭṭi iṅkā madhya maṇṭa/mīḍiyaṁ maṇṭa mīda uḍikin̄cukōvāli.
  
ఇప్పుడు రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం గ తినేవారు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది. కూర బాగా మగ్గి నూనె వదులుతుంది. కూర గట్టిగ తినేవారు నీరు పోయాల్సిన అవసరం లేదు. కానీ గుజ్జుగా కావాలి అనుకునేవారు, ఎక్కువ గుజ్జు కావాలి అనుకునే వారు ఒక కప్పు నీరు పోసుకుని ఒక 5 నిముషాలు పెద్ద మంట మీద పెట్టుకుని ఉడికించుకోవాలి.
Ippuḍu ruci cūsukuni avasaramaitē uppu vēsukōvāli. Alāgē kāraṁ ga tinēvāru kon̄ceṁ miriyāla poḍi vēsukuṇṭē ghāṭugā bāguṇṭundi. Kūra bāgā maggi nūne vadulutundi. Kūra gaṭṭiga tinēvāru nīru pōyālsina avasaraṁ lēdu. Kānī gujjugā kāvāli anukunēvāru, ekkuva gujju kāvāli anukunē vāru oka kappu nīru pōsukuni oka 5 nimuṣālu pedda maṇṭa mīda peṭṭukuni uḍikin̄cukōvāli.
  
చివరిగా కొత్తిమీర ఆకులు వేసుకుని బాగా కలుపుని పొయ్యి ఆపేసి వడ్డించుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన పొదీనా చికెన్ సిద్ధంగా ఉంది. ఎప్పుడు చేస్తే కాకుండా ఎప్పుడైనా ప్రత్యేకంగా తినాలి అంటే ఈ పొదీనా చికెన్ కూర తప్పకుండ చేసి చూడండి. మళ్ళి మళ్ళి తినాలి అనిపిస్తుంది. అలాగే పొదీనా ఆరోగ్యానికి చాల మంచిది. అరుగుదల పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలు పొదీనా తినరు కాబట్టి ఇలా చికెన్ లో కలిపి చేస్తే తప్పకుండ తింటారు. ఈ పొదీనా చికెన్ కూర అన్నం లోకి, చపాతీ, పరోటా, జీరా రైస్, పూరి అన్నిటిలోకి చాల బాగుంటుంది.
Civarigā kottimīra ākulu vēsukuni bāgā kalupuni poyyi āpēsi vaḍḍin̄cukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina podīnā ciken sid'dhaṅgā undi. Eppuḍu cēstē kākuṇḍā eppuḍainā pratyēkaṅgā tināli aṇṭē ī podīnā ciken kūra tappakuṇḍa cēsi cūḍaṇḍi. Maḷḷi maḷḷi tināli anipistundi. Alāgē podīnā ārōgyāniki cāla man̄cidi. Arugudala pen̄cutundi. Mukhyaṅgā pillalu podīnā tinaru kābaṭṭi ilā ciken lō kalipi cēstē tappakuṇḍa tiṇṭāru. Ī podīnā ciken kūra annaṁ lōki, capātī, parōṭā, jīrā rais, pūri anniṭilōki cāla bāguṇṭundi.

Comments