పునుగులు తయారీ విధానం | చిన్న చైనా పునుగులు ఇలా చేయండి | ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేసుకోవచ్చు | ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలి Punugulu tayārī vidhānaṁ | cinna cainā punugulu ilā cēyaṇḍi | iḍlī piṇḍitō ilā punugulu cēsukōvaccu | iḍlī piṇḍitō punugulu elā cēsukōvāli ​

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • ఇడ్లీ పిండి - 1 కప్పు | Iḍlī piṇḍi - 1 kappu
  • బియ్యం పిండి - 3 చెంచాలు | biyyaṁ piṇḍi - 3 cen̄cālu
  • బొంబాయి రవ్వ/సూజి - 2 స్పూన్ | bombāyi ravva/sūji - 2 spūn
  • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
  • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
  • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • వేయించడానికి నూనె | vēyin̄caḍāniki nūne

పునుగులు చాల సులువుగా ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఓక కప్పు ఇడ్లీ పిండి తీస్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. తరువాత బొంబాయి రవ్వ/సూజి వేసుకోవాలి. ఓక ఉల్లిపాయ తీస్కుని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కడిగి సన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడూ కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిరపకాయ ముక్కలూ ఇడ్లీ పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తమీరా తీస్కుని బాగా కడిగి చివరలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తమీరను కూడా సన్నగా కోసుకోవాలి. ఇడ్లీ పిండిలో కొత్తమీర ఆకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో పునుగులు వేయించుకోడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యిన తరువాత అందులో ఇడ్లీ పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. చిల్లుల గరిటతో పునుగులని కలుపుతూ ఉండాలి. రెండో వైపు కూడా వేగిన తరువాత పునుగులు తీస్కుని ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద పునుగులు వేసుకోవాలి. అప్పుడు ఎక్కువ నూనె ఉంటే అది టిష్యూ పేపర్ పీలుస్తుంది కాబట్టీ పునుగులు ఎక్కువ నూనెగా ఉండవు. వీటిలోకి అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి ఏదైన బాగుంటుంది. ఏమి లేకపోయిన మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ,ఉప్పు అన్నీ వేసాము కాబట్టీ ఉట్టిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి.

Punugulu cāla suluvugā ilā cēsukōvaccu. Mundugā ōka kappu iḍlī piṇḍi tīskuni pakkana peṭṭukōvāli. Ippuḍu andulō kon̄ceṁ biyyaṁ piṇḍi vēsukōvāli. Taruvāta bombāyi ravva/sūji vēsukōvāli. Ōka ullipāya tīskuni poṭṭu tīsi cinna mukkalugā kōsukōvāli. Alāgē paccimirapakāyalanu kaḍigi sanna mukkalugā kōsukōvāli. Ippuḍū kōsukunnā ullipāya mukkalū, paccimirapakāya mukkalū iḍlī piṇḍilō vēsukuni bāgā kalupukōvāli. Ruciki saripaḍā uppu kūḍā vēsi bāgā kalupukōvāli. Civarigā kottamīrā tīskuni bāgā kaḍigi civaralu kaṭ cēsukōvāli. Ippuḍu kottamīranu kūḍā sannagā kōsukōvāli. Iḍlī piṇḍilō kottamīra ākulu kūḍā vēsi bāgā kalupukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pān peṭṭi andulō punugulu vēyin̄cukōḍāniki saripaḍā nunē pōsukōvāli. Nūne bāgā vēḍi ayyina taruvāta andulō iḍlī piṇḍini kon̄ceṁ kon̄ceṁ vēsukōvāli. Cillula Gariṭatō punugulani Kaluputū uṇḍāli. Reṇḍō vaipu kūḍā vēgina taruvāta punugulu tīskuni oka plēṭ lō ṭiṣyū pēpar vēsukuni dāni mīda punugulu vēsukōvāli. Appuḍu ekkuva nunē uṇṭē adi ṭiṣyū pēpar pīlustundi kābaṭṭī punugulu ekkuva nunēgā uṇḍavu. Vīṭilōki allaṁ paccaḍi, kobbari paccaḍi, palli paccaḍi ēdaina bāguṇṭundi. Ēmi lēkapōyina manaṁ ullipāya, paccimirapakāya,uppu annī Vēsāmu kābaṭṭī uṭṭigā tiṇṭē cālā rucigā uṇṭāyi. Tappakuṇḍa cēsi elā unnāyō ceppaṇḍi.

Comments