తోటకూర కూర | తోటకూర కూర నాన్ వెజ్ లాగా ఉంటుంది | హెల్తీ అండ్ టేస్టీ తోటకూర కూర | తోటకూర కూర బీట్స్ నాన్ వెజ్ | స్వచ్ఛమైన వెజ్ కర్రీ నాన్ వెజ్ లాగా ఉంటుంది | తోటకూరతో కూర ఎలా తయారు చేయాలి Tōṭakūra kūra | tōṭakūra kūra nān vej lāgā uṇṭundi | heltī aṇḍ ṭēsṭī tōṭakūra kūra | tōṭakūra kūra bīṭs nān vej | svacchamaina vej karrī nān vej lāgā uṇṭundi | tōṭakūratō kūra elā tayāru cēyāli

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • నూనె - 2 స్పూన్లు | Nūne - 2 spūnlu
 • తోటకూర - 250 గ్రా | tōṭakūra - 250 grā
 • సెనగపిండి/ బెసన్ - 1/2 కప్పు | senagapiṇḍi/ besan - 1/2 kappu
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • పసుపు - 1/2 చెంచా | pasupu - 1/2 cen̄cā
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2-3 స్పూన్లు | kāraṁ - 2-3 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు | kottimīra ākulu
 • గరం మసాలా పౌడర్ - 1 స్పూన్ | garaṁ masālā pauḍar - 1 spūn
ముందుగా తోటకూర తీస్కుని బాగా కడిగి శుబ్రపరచిన తరువాత చిన్న ముక్కలుగా గ కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో తోటకూర వేసుకుని బాగా వేగించుకోవాలి. అందులో నుంచి వచ్చే నీరు మొత్తము ఇగిరిపోయేదాకా వేయించుకోవాలి. తోటకూర బాగా వేగి మెత్తగా అవుతుంది. ఇప్పుడు పొయ్యి ఆపేసి ప్యాన్ పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
Mundugā tōṭakūra tīskuni bāgā kaḍigi śubraparacina taruvāta cinna mukkalugā ga kōsukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pān peṭṭi andulō tōṭakūra vēsukuni bāgā vēgin̄cukōvāli. Andulō nun̄ci vaccē nīru mottamu igiripōyēdākā vēyin̄cukōvāli. Tōṭakūra bāgā vēgi mettagā avutundi. Ippuḍu poyyi āpēsi pyān pakkana peṭṭukuni callāranivvāli.

తోటకూర చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, అర్ర చెంచా గరం మసాలా పొడి వేసి సగం కప్ నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ తోటకూర ముద్దని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఒక కప్పు తోటకూర ముద్దలోకి సగం కాప్ సెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి.
Tōṭakūra callārina taruvāta oka miksī jār lōki tīsukōvāli. Andulō kon̄ceṁ uppu, arra cen̄cā garaṁ masālā poḍi vēsi sagaṁ kap nīru pōsi mettagā rubbukōvāli. Ippuḍu ā tōṭakūra muddani oka ginnelōki tīsukōvāli.Oka kappu tōṭakūra muddalōki sagaṁ kāp senagapiṇḍi vēsi bāgā kalupukōvāli.

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లో ఆ తోటకూర ముద్దని పెట్టి ఇడ్లీ ఉడికించినట్లుగా ఉడికించుకోవాలి. ఇడ్లి పాత్రలో అడుగున నీరు పోసి పైన ఆ ప్లేట్స్ పెట్టి మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. తరువాత పొయ్యి ఆపేసి ఇడ్లి పాత్ర పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. అవి ఉడికిన తరువాత తీసుకుని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
Ippuḍu iḍlī plēṭ lō ā tōṭakūra muddani peṭṭi iḍlī uḍikin̄cinaṭlugā uḍikin̄cukōvāli. Iḍli pātralō aḍuguna nīru pōsi paina ā plēṭs peṭṭi mūta peṭṭukuni 3 vijils vaccēdākā un̄cāli. Taruvāta poyyi āpēsi iḍli pātra pakkana peṭṭukuni callāranivvāli. Avi ūḍikina taruvāta tīsukuni cinna mukkalugā kōsukōvāli.
 
ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు తీస్కుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తరువాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మెత్తగా ఉడుకతాయి. ఇప్పుడు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కోసుకుని పక్కన పెట్టుకున్నా తోటకూర ముక్కలు వేసి వేయించుకోవాలి. కొంచెం మెత్తగా తినేవారు అరకప్పు నీరు పోసుకుని ఉడికించుకుంటే తోటకూర ముక్కలు కొంచెం మెత్తబడి చాల బాగుంటుంది.నీరు కొంచెం తగ్గే వరకు ఒక 5నిముషాలు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం లోపలి వెళ్లి చాల బాగా వస్తుంది కూర. వేపుడు కూర ఇష్టపడే వారు నీరు వెయ్యకూడదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. 2 నిముషాలు ఊడికిన తరువాత చివరిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన తోటకూర వేపుడు సిద్ధంగా ఉంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వారు ఇలా చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికి, మంచి సువాసన నాన్ వెజ్ మర్చేపోయేలా ఉంటుంది ఈ కూర. తప్పకుండా చేసి ఎలా ఉందొ చెప్పండి. తోటకూర ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.
Ippuḍu ullipāya poṭṭu tīskuni sannagā tarigi pakkana peṭṭukōvāli. Poyyi veligin̄ci oka pān peṭṭi vēḍi cēsukōvāli. Andulō nūne vēsukuni vēḍi cēsukōvāli. Nūne Vēḍi ayyina taruvāta andulō āvālu, jīlakarra, pasupu, karivēpāku vēsi vēyin̄cukōvāli. Bāgā vēgina taruvāta andulō ullipāya mukkalu vēsi mettagā uḍikin̄cukōvāli. Ullipāya mukkalu kon̄ceṁ vēgina taruvāta andulō kon̄ceṁ uppu vēsukōvāli. Ilā ceyyaḍaṁ vāḷḷa ullipāya mukkalu tvaragā mettagā uḍukatāyi. Ippuḍu kāraṁ vēsukuni bāgā kalupukōvāli. Taruvāta allaṁ vellulli pēsṭ vēsi pacci vāsana pōyē dākā vēyin̄cukōvāli. Ippuḍu andulō kōsukuni pakkana peṭṭukuna tōṭakūra mukkalu vēsi vēyin̄cukōvāli. Kon̄ceṁ mettagā tinēvāru arakappu nīru pōsukuni uḍikin̄cukuṇṭē tōṭakūra mukkalu kon̄ceṁ mettabaḍi cāla bāguṇṭundi.Nīru kon̄ceṁ taggē varaku oka 5nimuṣālu uḍikin̄cukōvāli. Uppu, kāraṁ lōpali veḷli cāla bāgā vastundi kūra. Vēpuḍu kūra iṣṭapaḍē vāru nīru veyyakūḍadu. Ippuḍu kon̄ceṁ garaṁ masālā vēsi bāgā kalupukōvāli.2 Nimuṣālu ūḍikina taruvāta civarigā kottimīra vēsukuni bāgā kalupukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina tōṭakūra vēpuḍu sid'dhaṅgā undi. Idi annanlōki cāla bāguṇṭundi. Non veg tinani vāru ilā cēsi cūḍaṇḍi. Ārōgyāniki ārōgyaṁ, ruciki ruciki, man̄ci suvāsana non veg marcēpōyēlā uṇṭundi ī kūra. Tappakuṇḍā cēsi elā undo ceppaṇḍi. Tōṭakūra eppuḍu cēsēlā kākuṇḍā ilā cēstē tinani vāḷḷu kūḍā iṣṭaṅgā tiṇṭāru.

Comments