గుడ్డు కూర | ఎగ్ మసాలా కర్రీ | సులభమైన మరియు రుచికరమైన ఎగ్ కర్రీ | ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలి Guḍḍu kūra | eg masālā karrī | sulabhamaina mariyu rucikaramaina eg karrī | eg karrī elā tayāru cēyāli ​

కావలసిన పదార్థాలు | Kāvalasina padārthālu:

 • గుడ్లు - 5 | Guḍlu - 5
 • నూనె - 3-4 స్పూన్లు | nūne - 3-4 spūnlu
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • ఉల్లిపాయ - 2 | ullipāya - 2
 • టమోటా - 2 | ṭamōṭā - 2
 • పచ్చిమిర్చి - 2 | paccimirci - 2
 • రుచి ప్రకారం ఉప్పు / 1 చెంచా | ruci prakāraṁ uppu/ 1 cen̄cā
 • కారం - 1 చెంచా | kāraṁ - 1 cen̄cā
 • పసుపు - 1 చెంచా | pasupu - 1 cen̄cā
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • వేయించిన జీలకర్ర పొడి - 1 చెంచా | vēyin̄cina jīlakarra poḍi - 1 cen̄cā
 • ధనియాల పొడి - 1 స్పూన్ | dhaniyāla poḍi - 1 spūn
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • గరం మసాలా పౌడర్ - 1 స్పూన్ | garaṁ masālā pauḍar - 1 spūn
 • నల్ల మిరియాల పొడి - 1 స్పూన్ | nalla miriyāla poḍi - 1 spūn
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 
ముందుగా ఉల్లిపాయ తీస్కుని పొట్టు తీసి కడిగి సన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే టమాటో తీస్కుని బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
Mundugā ullipāya tīskuni poṭṭu tīsi kaḍigi sanna mukkalugā kōsukōvāli. Alāgē ṭamāṭō tīskuni bāgā kaḍigi cinna mukkalugā tarigi peṭṭukōvāli.
అలాగే పచ్చిమిరపకాయలు తీస్కుని చీలికలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి /పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. తరువాత వేడిచేసుకోవాలి. వేడి అయ్యిన తరువాత అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి.
Alāgē paccimirapakāyalu tīskuni cīlikalugā kōsukuni pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka kaḍāyi/pān peṭṭi vēḍi cēsukōvāli. Taruvāta vēḍicēsukōvāli. Vēḍi ayyina taruvāta andulō jīlakarra vēsi vēyin̄cukōvāli. Ippuḍu ullipāya mukkalu vēyin̄cukōvāli.
 
ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ముదురు గోధుమ రంగు వచ్చిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి.
Ullipāya mukkalu bāgā vēgina taruvāta andulō karivēpāku, paccimirapakāya mukkalu vēsi bāgā kalupukuni vēyin̄cukōvāli. Ullipāya mukkalu muduru gōdhuma raṅgu vaccina taruvāta andulō allaṁ vellulli mudda vēsi pacci vāsana pōyēdākā vēyin̄cukōvāli.
 
ఇప్పుడు అందులో తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటో బాగా మగ్గి గుజ్జులాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.ఇప్పుడు అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, ధనియ పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
Ippuḍu andulō tarigina ṭamāṭō mukkalu vēsi bāgā mettagā uḍikin̄cukōvāli. Ṭamāṭō bāgā maggi gujjulāgā ayyēvaraku uḍikin̄cukōvāli. Ippuḍu andulō uppu, kāraṁ, miriyāla poḍi, pasupu, dhaniya poḍi, jīlakarra poḍi, garaṁ masālā vēsi bāgā kalupukōvāli
 
టమాటో ముక్కలు బాగా మగ్గిన తరువాత అందులో ఒక కప్పు నీరు పోసి బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. నీరు బాగా తగ్గి కూర చిక్కబడిన తరువాత నూనె బయటికి వస్తుంది. అప్పుడు పగులగొట్టిన గుడ్డు అందులో వేసుకుని ఒక 5 నిముషాలు మూట పెట్టి ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి గుడ్డు రెండో వైపుకి తిప్పి కొంచెం ఉడికించుకోవాలి. అప్పుడు గుడ్డు గుడ్డుగా ఉండి చుట్టూ ఉప్పు, కారం మసాలా రుచులు పట్టి చాల బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుని పొయ్యిని ఆపేసి వడ్డించుకోవాలి. చిన్న పిల్లలు కారం తినరు కాబట్టి గుడ్డు వేసి అన్నం పెట్టొచ్చు. పెద్దవారు కూర కలుపుకుని గుడ్డు తో కలిపి అన్నం తినొచ్చు. తప్పకుండ చేసి చూడని ఎప్పుడు చేసుకునేలా కాకుండా కూర చాలా బాగుంటుంది.
Ṭamāṭō mukkalu bāgā maggina taruvāta andulō oka kappu nīru pōsi bāgā kalupukuni uḍikin̄cukōvāli. Nīru bāgā taggi kūra cikkabaḍina taruvāta nūne bayaṭiki vastundi. Appuḍu pagulagoṭṭina guḍḍu andulō vēsukuni oka 5 nimuṣālu mūṭa peṭṭi uḍikin̄cukōvāli. Taruvāta mūta tīsi guḍḍu reṇḍō vaipuki tippi kon̄ceṁ uḍikin̄cukōvāli. Appuḍu guḍḍu guḍḍugā uṇḍi cuṭṭū uppu, kāraṁ masālā ruculu paṭṭi cāla bāguṇṭundi. Civarigā kottimīra vēsukuni poyyini āpēsi vaḍḍin̄cukōvāli. Cinna pillalu kāraṁ tinaru kābaṭṭi guḍḍu vēsi annaṁ peṭṭoccu. Peddavāru kūra kalupukuni guḍḍu tō kalipi annaṁ tinoccu. Tappakuṇḍa cēsi cūḍani eppuḍu cēsukunēlā kākuṇḍā kūra cālā bāguṇṭundi.
 

Comments