కాలీఫ్లవర్ టొమాటో కూర | సులభమైన టమోటా మరియు కాలీఫ్లవర్ కర్రీ Kālīphlavar ṭomāṭō kūra | sulabhamaina ṭamōṭā mariyu kālīphlavar karrī


కావలసిన పదార్థాలు | Kāvalasina padārthālu:
 • కాలీఫ్లవర్ - 200 గ్రా | Kālīphlavar - 200 grā
 • టొమాటో - 3 | ṭomāṭō - 3
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం పొడి - 2 స్పూన్లు | kāraṁ poḍi - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ |  garaṁ masālā - 1 spūn
 • మిరియాలు - 1 చెంచా | miriyālu - 1 cen̄cā
 
ముందుగా కాలీఫ్లవర్ తీస్కుని బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ లో వాటర్ పోసి అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి 5-10 నిముషాలు ఉడికించుకోవాలి. తరువాత పొయ్యి ఆపేసి నీరు వడకట్టి ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. వేడి అయ్యిన తరువాత అందులో ఆవా నూనెలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
Mundugā kālīphlavar tīskuni bāgā kaḍigi cinna mukkalugā kōsukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pān lō vāṭar pōsi andulō kālīphlavar mukkalu vēsi 5-10 nimuṣālu uḍikin̄cukōvāli. Taruvāta poyyi āpēsi nīru vaḍakaṭṭi mukkalu tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu ṭamāṭālu, ullipāya sanna mukkalugā tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu poyyi veligin̄ci oka pān peṭṭi vēḍi cēyāli. Andulō nūne vēsi bāgā vēḍi cēsukōvāli. Vēḍi ayyina taruvāta andulō āvā nūnelu, jīlakarra vēsi vēyin̄cukōvāli.
  
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత అందులో టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాక వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.
Ippuḍu ullipāya mukkalu vēsi vēyin̄cukōvāli. Ullipāya mukkalu bāgā vēgina taruvāta andulō ṭamāṭō mukkalu vēsi bāgā vēyin̄cukōvāli. Taruvāta uppu, kāraṁ, pasupu vēsi bāgā kalupukōvāli. Ippuḍu andulō allaṁ vellulli pēsṭ vēsi pacci vāsana pōyē dāka vēyin̄cukōvāli. Ippuḍu karivēpāku vēsi bāgā kalupukōvāli.
 
తరువాత ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి. గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఒక కప్పు నీరు పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడు కూర గుజ్జుగా వస్తుంది.
Taruvāta uḍikin̄ci pakkana peṭṭukunna kālīph mukkalu vēsi bāgā kalupukōvāli. Ippuḍu mūta peṭṭi 10nimuṣālu uḍikin̄cukōvāli. Garaṁ masālā vēsi bāgā kalupukōvāli. Avasaramaitē oka kappu nīru pōsukuni mettagā uḍikin̄cukōvāli. Appuḍu kūra gujjugā vastundi.
  
చివరిగా కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి రుచికరమైన కాలీఫ్లవర్ టమాటో కూర సిద్ధంగా ఉంది. తప్పకుండ చెప్పండి
Civarigā kottimīra ākulu vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi rucikaramaina kālīphlavar ṭamāṭō kūra sid'dhaṅgā undi. Tappakuṇḍa ceppaṇḍi

Comments