క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ | ఆరోగ్యకరమైన క్యారెట్ మరియు క్యాప్సికమ్ కర్రీ | క్యాప్సికమ్ కర్రీ రెసిపీ Kyāpsikam kyāreṭ karrī | ārōgyakaramaina kyāreṭ mariyu kyāpsikam karrī | kyāpsikam karrī resipī

కావలసిన పదార్థాలు | Kāvalasina padārthālu:
 • క్యాప్సికమ్ - 2-3 | Kyāpsikam - 2-3
 • క్యారెట్ - 5 | kyāreṭ - 5
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
 • సెనగపప్పు - 1 స్పూన్ | senagapappu - 1 spūn
 • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • మిరియాల పొడి - 1 స్పూన్ | miriyāla poḍi - 1 spūn
 • కారం - 1-2 స్పూన్లు | kāraṁ - 1-2 spūnlu
 • వెల్లుల్లి రెబ్బలు - 2 | vellulli rebbalu - 2
 • కరివేపాకు కొన్ని | karivēpāku konni

   
ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసి సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మధ్యలో గింజలు తీసి నీటిలో కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే క్యారెట్ తీస్కుని తోలు తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
Mundugā ullipāya poṭṭu tīsi sanna mukkalugā tarigi pakkana peṭṭukōvāli. Ippuḍu kyāpsikam madhyalō gin̄jalu tīsi nīṭilō kaḍigi cinna mukkalugā kōsukōvāli. Alāgē kyāreṭ tīskuni tōlu tīsi sannagā turimi pakkana peṭṭukōvāli.
  
ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. ప్యాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో జీలకర్ర, సెనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
Ippuḍu poyyi veligin̄ci oka pyān peṭṭi vēḍi cēyāli. Pyān vēḍi ayyina taruvāta andulō nūne vēsi vēḍi cēyāli. Vēḍi ayyina taruvāta andulō jīlakarra, senagapappu, karivēpāku vēsi vēyin̄cāli. Taruvāta andulō sannagā tarigina ullipāya mukkalu vēsi bāgā vēyin̄cukōvāli.
  
ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత అందులో వెల్లులిపాయ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తరిగిన క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి.
Ullipāya mukkalu bāgā maggina taruvāta andulō vellulipāya vēsi vēyin̄cukōvāli. Ippuḍu kyāpsikam mukkalu vēsi vēyin̄cukōvāli. Mukkalu mettagā uḍikina taruvāta andulō uppu, kāraṁ, pasupu vēsi bāgā kalupukōvāli. Taruvāta tarigina kyāreṭ turumu vēsi vēyin̄cukōvāli.
 
క్యారెట్ బాగా వేగిన తరువాత అందులో కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తమీర ఆకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన క్యారెట్ క్యాప్సికమ్ కూర సిద్ధంగా ఉంది.
Kyāreṭ bāgā vēgina taruvāta andulō kon̄ceṁ miriyāla poḍi vēsi bāgā kalupukōvāli. Civarigā kottamīra ākulu vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina mariyu ārōgyakaramaina kyāreṭ kyāpsikam kūra sid'dhaṅgā undi.

Comments