మురుమురాలు ముంత మసాలా | పఫ్డ్ రైస్ తో చేసిన స్నాక్స్ | రుచికరమైన మరియు ముంతా మసాలా | సాయంత్రం టైం స్నాక్ తక్కువ సమయంలో ఇలా చేసి చూడండి Murumurālu munta masālā | paphḍ rais tō cēsina snāks | rucikaramaina mariyu muntā masālā | sāyantraṁ ṭaiṁ snāk takkuva samayanlō ilā cēsi cūḍaṇḍi ​

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • వేరుసెనగ గుల్లు - 30-50 గ్రా | Vērusenaga gullu - 30-50 grā
 • సెనగపప్పు - 20గ్రా | senagapappu - 20grā
 • నూనె - 1-2 స్పూన్లు | nūne - 1-2 spūnlu
 • ఉల్లిపాయ - 1 పెద్దది | ullipāya - 1 peddadi
 • టొమాటో - 1 మీడియం | ṭomāṭō - 1 mīḍiyaṁ
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
 • నిమ్మకాయ - 1 | nim'makāya - 1
 • ఉప్పు రుచికి సరిపడా / 1/2 స్పూన్ | uppu ruciki saripaḍā/ 1/2 spūn
 • కారం - 1 స్పూన్ | kāraṁ - 1 spūn
 • బూందీ కారపూస మిశ్రమం - 20gm/1Cup | būndī kārapūsa miśramaṁ - 20gm/1Cup
 • మురుమురాలు - 100gm/2-3కప్పులు | murumurālu - 100gm/2-3kappulu
 
ముందుగా పొయ్యి వెలిగించి ఒకప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు అందులో వేరుశెనగగుళ్ళు, పచ్చి సెనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
Mundugā poyyi veligin̄ci okapyān peṭṭi andulō kon̄ceṁ nūne vēsi vēḍi ceyyāli. Ippuḍu andulō vēruśenagaguḷḷu, pacci senagapappu vēsi bāgā vēyin̄cukōvāli. Pappulu bāgā vēgina taruvāta tīsi pakkana peṭṭukōvāli.
  
ఒక టొమాటో తీస్కుని చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పొట్టు తీసి సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర తీస్కుని చివరలను కత్తిరించి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
Oka ṭomāṭō tīskuni cinna mukkalugā kōsukuni pakkana peṭṭukōvāli. Oka ullipāya poṭṭu tīsi sanna mukkalugā tarigi pakkana peṭṭukōvāli. Alāgē kottimīra tīskuni civaralanu kattirin̄ci sannagā tarigi pakkana peṭṭukōvāli
 
బయట దొరికిన కారపూస,బూందీ మిక్స్ చర్ ప్యాకెట్ లో కొంచెం తీస్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం మూరుమూరలు తీసి పక్కన పెట్టుకోవాలి
Bayaṭa dorikina kārapūsa,būndī miks car pyākeṭ lō kon̄ceṁ tīskuni pakkana peṭṭukōvāli. Alāgē kon̄ceṁ mūrumūralu tīsi pakkana peṭṭukōvāli.
ఇప్పుడు ఒక బౌల్ తీస్కుని అందులో బూందీ, కారపూస మిక్స్ చర్ వేసుకోవాలి. అందులో వేయించిన వేరుశెనగగుళ్ళు, సెనగపప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి.
Ippuḍu oka baul tīskuni andulō būndī, kārapūsa miks car vēsukōvāli. Andulō vēyin̄cina vēruśenagaguḷḷu, senagapappu, tarigina ullipāya mukkalu, ṭomāṭō mukkalu, kottimīra vēsukōvāli.
తరువాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, మూరుమూరలు వేసుకోవాలి.
Taruvāta kon̄ceṁ uppu, pasupu, kāraṁ, mūḍumūralu vēsukōvāli.
 
ఇప్పుడు అందులో కొంచెం నిమ్మరసం పిండి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి.
Ippuḍu andulō kon̄ceṁ nim'marasaṁ piṇḍi anni kalisēlā bāgā kalupukōvāli
  
చివరగా కొంచెం మురుమురాలు వేసి బాగా కలుపుకోవాలి.
Civaragā kon̄ceṁ murumurālu vēsi bāgā kalupukōvāli.
 
అంతేనండి ఏంటో రుచికరమైన మురుమురాలు చాట్ తయారీగా ఉంది. తప్పకుండ చేసి చూడండి. తక్కువ సమయంలో చాల సులువుగా మరియు రుచిగా చేసుకునే చాట్.
Antēnaṇḍi ēṇṭō rucikaramaina murumurālu cāṭ tayārīgā undi. Tappakuṇḍa cēsi cūḍaṇḍi. Takkuva samayanlō cāla suluvugā mariyu rucigā cēsukunē cāṭ.

Comments